Jump to content

సరళదేవదారు

వికీపీడియా నుండి

Chir Pine
Pinus roxburghii
Pinus roxburghii, Uttarakhand, India
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Subgenus:
Species:
P. roxburghii
Binomial name
Pinus roxburghii
Male cones
Female cones

సరళదేవదారు నిటారుగా 30 నుంచి 50 మీటర్ల (98-160 అడుగులు) ఎత్తు పెరుగుతుంది. దీని మాను వ్యాసం 2 మీటర్లు (6.6 అడుగులు), అనూహ్యంగా 3 మీటర్లు (10 అడుగులు) ఉంటుంది. దీని శాస్త్రీయ నామం పినస్ లాంగిఫోలియా (పైనస్ రోక్స్బుర్గీ). దీనిని తెల్లతెగడచెట్టు అని కూడా అంటారు. భారతదేశంలో కనిపించే పినస్ లలో అత్యంత ముఖ్యమైనది సరళదేవదారు. హిమాలయాలలో పెరిగే కొన్ని చెట్లలో ఇది ఒకటి, కొన్నిసార్లు ఈ జాతులలోని కొన్ని రకాలు అత్యంత కఠినమైన నేలలో కూడా పెరుగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది ఒక జిగురు వృక్షం, నిరంతరం రెసిన్ అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, పొడవైన గాటు కొట్టడం ద్వారా ఈ చెట్టు నుంచి రెసిన్ స్వీకరిస్తారు. నిటారుగా పెరిగే ఈ చెట్టు పై భాగం గోపురం వలె గుండ్రంగా ఉంటుంది, ఇది సతతహరిత వృక్షం, సాధారంగా చాలా ఎత్తు వరకు ఒకే మానును కలిగి ఉంటుంది, అరుదుగా ఎక్కువ మానులు కలిగి ఉంటుంది. ఈ చెట్టు బెరడు మాను వద్ద గోధుమ ఎరుపు రంగుతో మందంగా, లోతుగా పగుళ్ళతో ఉంటుంది, శిఖర భాగంలో సన్నగా, పొరలుగా ఉంటుంది. వీటి ఆకులు సూదుల వలె చాలా సన్నగా 20-35 సెంటీమీటర్ల పొడవుతో విశిష్టమైన పసుపు ఆకుపచ్చని రంగులో ఉంటాయి. వీటి పుష్పాలు ద్విలింగ పుష్పాలు ఇవి గాలి ద్వారా పరాగ సంపర్కం చెందుతాయి.

Trunk
Pinus roxburghii forest, Uttarakhand, India