సర్వే గణిత చంద్రిక
స్వరూపం
సర్వే గణిత చంద్రిక 1932 సంవత్సరం ముద్రించబడిన గణితశాస్త్ర గ్రంథము. దీనిని చదలువాడ కోటినరసింహము పద్యరూపంలో రచించి విపులమైన వివరణలు అందించారు.
దీని ముద్రణ కొరకు తురగావారిపాలెము గ్రామానికి చెందిన ఉప్పటూరి బిల్లాలరెడ్డి, సింగం పుల్లారెడ్డి, కాసు పిచ్చిరెడ్డి, తుమ్మా రత్నారెడ్డి, ఉప్పటూరి అంకిరెడ్డి, గొంగటి రామిరెడ్డి, వోబుల్‌రెడ్డి కనికిరెడ్డి, ఉప్పుటూరి నరిశిరెడ్డి, శింగం నరిసిరెడ్డి, ఉప్పుటూరి అచ్చిరెడ్డి, పరసత్యాళ్ళూరు గ్రామానికి చెందిన చల్లా రాఘవరెడ్డి సహాయాన్ని అందించారు.
ప్రార్థన
[మార్చు]కం. శ్రీరమణవంద్య చరణాం
భోరుహ గర్వోన్నత త్రిపురదానవ సం
హారా యాశ్రితజన హృ
త్కైరవరజనీశ కాశికా విశ్వేశా.
తే.గీ. అవధరింపుము బాలురకైన దెలియు
రీతి బద్యంబులందు ధాత్రీగణితము
విపుల విషయాన్వితంబయి వెలయుచుండు
నట్లొనర్చెద గొను భవదంకితముగ.
విషయ సంగ్రహం
[మార్చు]- దైర్ఘ్యమానము
- చతురము, ఘనము
- చతురపు మానము
- ఘనమానము
- వర్గము, వర్గమూలము
- యోగము, సంక్రమణము
- ఇంగ్లీషు అక్షరములు
- సంఖ్యాసారము
- హెచ్చవేతయందలి తప్పొప్పులు తెలిసికొనుట
- భాగహారమునందలి తప్పొప్పులు తెలిసికొనుట
- వర్గమూలమునందలి తప్పొప్పులు తెలిసికొనుట
- సాధనములు
- గొలుసు
- గొలుసును బరీక్షించుట
- క్రాస్టాఫు, దానిని బరీక్షించుట
- మేకులు
- జెండా
- ఆఫుసెట్టు గడ
- స్కెచ్చి
- ప్లాను
- ఏర్యా స్క్వయరు పేపరు
- శూన్య త్రిభుజమును దెలిసికొనుట
- సమకోణమును దెలిసికొనుట
- రేఖలకు గుఱుతులు
- లంబమును దెలిసికొనుట
- భూమిని దెలిసికొనుట
- కర్ణమును దెలిసికొనుట
- కర్ణమును లంబమును దెలిసికొనుట
- కర్ణమును భూమిని దెలిసికొనుట
- భూమిని లంబమును దెలిసికొనుట
- భేదముచే గర్ణమును లంబమును దెలిసికొనుట
- భేదముచే భూమిని లంబమును దెలిసికొనుట
- భేదముచే గర్ణమును భూమిని దెలిసికొనుట
- సమకోణ త్రిభుజ చతురమును దెలిసికొనుట
- దిశచే సమత్రిభుజ లంబమును దెలిసికొనుట
- లంబముచే సమత్రిభుజముయొక్క దిశను దెలిసికొనుట
- దిశచే సమత్రిభుజ చతురమును దెలిసికొనుట
- లంబముచే సమత్రిభుజ చరుతమును దెలిసికొనుట
- సమత్రిభుజమును నిర్మించుట
- ద్విసమ, సమత్రిభుజములందు లంబస్థానముల నెఱుగుట
- విషమ త్రిభుజ లంబస్థానమును గుర్తించుట
- విషమ త్రిభుజ చతురమును దెలిసికొనుట
- త్రిభుజ చతురముము దెలిసికొనుట
- సమత్రిభుజముగాక కోరిన త్రిభుజమును నిర్మించుట
- దిశచే సమచతుర్భుజ కర్ణమును దెలిసికొనుట
- కర్ణముచే సమచతుర్భుజ చతురమును దెలిసికొనుట
- చతురముచే సమచతుర్భుజ దిశను దెలిసికొనుట
- చతురముచే సమచతుర్భుజ కర్ణమును దెలిసికొనుట
- ఆయతపు భూమి కర్ణమును దెలిసికొనుట
- ఆయతపు భూమి చతురమును దెలిసికొనుట
- ఆయతముయొక్క పొడుగును, వెడల్పును దెలిసికొనుట
- కోరినభాగము లుండునట్లు, ఆయపుభూమి పొడుగును దెలిసికొనుట
- కోరినభాగము లుండునట్లు, ఆయతపు భూమి వెడల్పును దెలిసికొనుట
- భేదముచే ఆయతపు భూమి పొడుగును, వెడల్పును దెలిసికొనుట
- ఆయతపు భూమియొక్క పొడుగును వెడల్పును వేర్వేఱుగా దెలిసికొనుట
- ద్విసమకోణ చతుర్భుజ చతురమును దెలిసికొనుట
- విషమకోణ సమచతుర్భుజ చతురమును దెలిసికొనుట
- సమానాంతర ద్విభుజ, విషమకోణ చతుర్భుజ చతురమును; సమానాంతర ద్విభుజ, ద్విసమకోణ చతుర్భుజ చతురమును దెలిసికొనుట
- సమానాంతర ద్విభుజ విషమకోణ చతుర్భుజము, లేక సమానాంతర ద్విభుజ ద్విసమకోణ చతుర్భుజముయొక్క అంతరమును దెలిసికొనుట
- సమానాంతర ద్విభుజ విషమకోణ చతుర్భుజముయొక్క ఒక సమానాంతర సరళరేఖను దెలిసికొనుట
- చతుర్భుజ చతురమును దెలిసికొనుట
- బహుభుజ చతురమును దెలిసికొనుట
- త్రిభుజమునం దంతర్భాగము విడదీయుట
- సమచతుర్భుజమునందును, ఆయతమునందును, అంతర్భాగము విడదీయుట
- చతుర్భుజము నందైనను, బహుభుజము నందైనను, అంతర్భాగము విడదీయుట
- కొలువవలసిన దిక్కు తుద మొద లగపడునపుడు అడ్డుకొలతను దెలిసికొనుటకు ఒకటవ పథకము
- కొలువవలసిన దిక్కు తుద మొద లగపడునపుడు అడ్డుకొలతను దెలిసికొనుటకు రెండవ పథకము
- కొలువవలసిన దిక్కు తుదమొద లగపడునప్పుడు అడ్డుకొలతను దెలిసికొనుటకు మూడవ పథకము
- కొలువవలసిన దిక్కు తుద యగపడ నప్పుడు అడ్డుకొలతను దెలిసికొను పథకము
- పోయిన ఱాతిని బాతించుట
- వ్యాసమువలన బరిధిని దెలిసికొనుట
- పరిధివలన వ్యాసమును దెలిసికొనుట
- వ్యాసపరిధుల వలన జతురమును దెలిసికొనుట
- వ్యాసమువలన జతురమును దెలిసికొనుట
- పరిధివలన జతురమును దెలిసికొనుట
- చతురమువలన వ్యాసమును దెలిసికొనుట
- చతురమువలన బరిధిని దెలిసికొనుట
- బావియొక్క ఘనమును దెలిసికొనుట
- కందకముయొక్క ఘనమును దెలిసికొనుట
- ప్రత్యుత్తరములు.