సల్లా పాయల్ కొట్గరీకర్
Jump to navigation
Jump to search
సల్లా పాయల్ కొట్గరీకర్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | సంగీత కళాకారిణి |
పాయల్ కొట్గరీకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సంగీత కళాకారిణి. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]
జననం
[మార్చు]పాయల్ తెలంగాణ రాష్ట్రం లోని నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం బర్దీపూర్ గ్రామంలో జన్మించింది.
కళారంగంలో
[మార్చు]నిజామాబాద్ కు చెందిన పాయల్ తబలా వాయిద్యకారిణి. నిజామాబాద్ నగరంలోని సంగీత నృత్య కళాశాలలో డిప్లొమా పూర్తి చేసింది. పాయల్ గురువు పేరు కృష్ణ 20 ఏళ్లుగా ఈ వాయిద్యంలో రాణిస్తున్న పాయల్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ చేత కూడా ప్రశంసలు అందుకుంది. బెంగళూరు లో హార్ట్ ఆఫ్ లివింగ్ లో గురువు రవిశంకర్‌జీ నిర్వహించిన సంగీత కచేరిలో తబాలా వాయించి అందరి మన్ననలు పొందింది. రాజకీయరంగంలో దూసుకుపోతున్న పాయల్, బర్దీపూర్ ఎంపీటీసీగా గెలుపొందింది.[2]
బహుమతులు - పురస్కారాలు
[మార్చు]- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, మార్చి 8, 2017
- 2005లో జాతీయ స్థాయి అవార్డు, 2004, 2007లో రాష్టస్ధాయి అవార్డులు అందుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 17 April 2017.
- ↑ నమస్తే తెలంగాణ, డిచ్‌పల్లి. "పాయల్ ఝంకార్..!". Retrieved 17 April 2017.[permanent dead link]