సహకారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొంతమంది వ్యక్తులు కలసి తమ అందరి బాగోగుల కోసం పనిచేయడాన్ని సహకారం (కో ఆపరేషన్ ) అంటారు. ఒక్కరు చేయలేని పనిని కొంతమంది కలసి సాధించవచ్చును. ఇలా కొంతమంది కలసి ఉమ్మడి లక్ష్యం కోసం ఉద్యమించడమే సహకారోద్యమం (కో-ఆపెరటివ్ మూమెంట్ ). ఇలా ఏర్పడిన సంఘాలను సహకార సంఘాలు (కో-ఆపరేటివ్ సొసైటీస్) అంటారు. ఇందులో భాగస్వాములైన వ్యక్తులకు కొన్ని నిర్ధిష్టమైన ఆశయాలుంటాయి. సభ్యులు అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అందరూ కలసి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సహకార సంఘాలు మొదట జర్మనీ దేశంలో స్థాపించబడ్డాయి. తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సహకారోద్యమం ప్రారంభమైంది. భారతదేశంలో 1904 సంవత్సరంలో ఈ ఉద్యమం ప్రారంభమైనది. వీటికి సహాయం చేయడానికి ప్రభుత్వంలో సహకార మంత్రిత్వ శాఖలు ఏర్పాటుచేయబడ్డాయి. రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయిలలో సహకార భూమి తనఖా బ్యాంకులు స్థాపించబడ్డాయి. మన రాష్ట్రంలో వివిధ రంగాల్లో సుమారు పన్నెండు వేలకు పైగా సహకార సంఘాలున్నట్లు అంచనా.

వ్యవసాయం మన ప్రజల ముఖ్యమైన వృత్తి. దీనికి కావలసిన పెట్టుబడులు లభించక రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొని వానిని సకాలంలో తీర్చలేక తమ స్థిరాస్తులను అమ్ముకోవడం జరుగుతోంది. రైతులే సహకార సంఘాన్ని స్థాపించుకొని, దాని ద్వారా తమకు కావల్సిన నాణ్యమైన పరికరాలు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు, ఎరువులు పొందవచ్చును. పండిన పంటలకు కూడా మార్కెటింగ్ సదుపాయం కల్పించుకోవచ్చును.ఇలాంటి సహకార సంఘాలు ఇతర వృత్తి పనివారు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు కూడా స్థాపించుకొంటున్నారు. దేశాభ్యుదయానికి, ప్రజా సంక్షేమానికి సహకారోద్యమం మూలాధారమైనది.

కొన్ని సంఘాలు

[మార్చు]
  • గోవింద్ పేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, గోవింద్ పేట్, నిజామాబాదు జిల్లా.
  • గృహలక్ష్మిపరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ ఆలేరు. నల్లగొండ జిల్లా 508101

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=సహకారం&oldid=3946661" నుండి వెలికితీశారు