సహాయం:ఇక్కడికి లింకున్న పేజీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియాలోని ప్రతి పేజీకి "ఇక్కడికి లింకున్న పేజీలు" అనే లింకు ఉంటుంది.

స్థూలంగా[మార్చు]

మీరున్న పేజీతో లింకున్న, లేదా ఈ పేజీ ఇమిడి ఉన్న అన్ని పేజీల జాబితా కనిపిస్తుంది. pagelinks, templatelinks అనే టేబుళ్ళ నుండి వస్తాయి. ఈ పేజీని ఇముడ్చుకుని ఉన్న పేజీలు inclusion గా గుర్తించబడి ఉంటాయి.

ఇక్కడికి లింకున్న పేజీలు సౌకర్యం ద్వారా మీరు చూస్తున్న పేజీకి ఎక్కడెక్కడి నుండి లింకులున్నాయో తెలుస్తుంది. దీని వలన చాలా ఉప్యోగాలున్నాయి:

  • ఆ పేజీ ఎంత పాపులరో తెలుస్తుంది. ఎక్కువ లింకులున్న పేజీలను ఎక్కువగా చూస్తారు కాబట్టి, ఆ పేజీలు మంచి విషయపుష్టితో ఉండాలి.
  • వ్యాసం లోని విషయం అంత స్పష్టంగా లేని సందర్భాల్లో దానికి లింకున్న పేజీలను చూస్తే ఆ పేజీ, అందులోని విషయపు ప్రాశస్త్యం ఏంటో తెలుస్తుంది. ఉదాహరణకు నారా చంద్రబాబునాయుడు పేజీలో కేవలం పుట్టిన తేదీ మాత్రమే ఉందనుకుందాం. దాన్ని బట్టి ఆ వ్యక్తి విశిష్టత ఏంటో తెలీదు. ఇక్కడికి లింకున్న పేజీలు లింకును నొక్కి అప్పుడు కనబడే పేజీలలో చూస్తే ఆ వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసాడని తెలుస్తుంది.
  • అయోమయ నివృత్తి చేసేందుకు ఇది మంచి సాధనం.

అసలు ఉనికిలో లేని పేజీకి కూడా ఈ సౌకర్యం పని చేస్తుంది. (ఉనికిలో లేని పేజీకి కూడా లింకులుండవచ్చు).

ఇక్కడికి లింకున్న పేజీలు లింకును నొక్క కుండా నేరుగా ఆ పేజీకి ఇలా వెళ్ళొచ్చు:
[[Special:Whatlinkshere/కోడి రామ్మూర్తి]]
అని ఇస్తే Special:Whatlinkshere/కోడి రామ్మూర్తి పేజికి వెళ్తుంది.

పరిమితి[మార్చు]

ఇక్కడికి లింకున్న పేజీల జాబితాలో ఉపపేజీలు కనిపించవు.