Jump to content

సహాయం:దిద్దుబాటు పరిచయం/విషయ ప్రాముఖ్యత క్విజ్

వికీపీడియా నుండి

ఫలానా లిమిటెడ్‌ అనే సంస్థ గురించి రాసిన ఒక వ్యాసంలో కింది నాలుగు మూలాలను ఉదహరించినట్లు భావించండి: ఫలానా వారి ఉత్పత్తితో పోల్చినపుడు, ప్రత్యర్థి సంస్థ వారి ఉత్పత్తిలో లేని లక్షణాన్ని ఎత్తిచూపుతూ ఈనాడు పత్రికలో, ఒకే వాక్యంలో సంస్థ ప్రస్తావన వచ్చిన వ్యాసం; ఎకనామిక్ టైమ్స్ వారి అనుబంధ బ్లాగులో టైమ్స్ ఉద్యోగి కాని వ్యక్తి, ఫలానా లిమిటెడ్ గురించి రాసిన విస్తారమైన వ్యాసం; టెక్ ఔత్సాహికుల బ్లాగులో ఈ సంస్థ ఉత్పత్తి గురించి వచ్చిన సమీక్షా వ్యాసం; సంస్థ తమ పేటెంటును ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఒక పోటీదారు వేసిన కోర్టు కేసు.

ఈ వ్యాసానికి వికీపీడియా సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకంకు అనుగుణంగా ఫలానా లిమిటెడ్‌ సంస్థకు తగిన ప్రాముఖ్యత ఉన్నట్లేనా?

సమాధానం

లేదు, దానికి విషయ ప్రాముఖ్యత లేదు. విషయ ప్రాముఖ్యత ఉండాలంటే, ప్రతీ మూలం కూడా విస్తారంగా రాసి ఉడాలి, స్వతంత్ర మూలమై ఉండాలి, విశ్వసనీయమైనదై ఉండాలి ద్వితీయ స్థాయి మూలమై ఉండాలి.


  • ఈనాడు కథనం నమ్మదగినది, స్వతంత్రమైనది, ద్వితీయమైనది - కానీ ముఖ్యమైనది కాదు (మరొక కంపెనీ గురించిన కథనంలో ఒకే వాక్య ప్రస్తావన ఉండి, అంతే).
  • ఎకనామిక్ టైమ్‌స్ బ్లాగులోని వ్యాసం ముఖ్యమైనది, ద్వితీయమైనది – కానీ స్వతంత్రమైనది లేదా నమ్మదగినది కాదు (అటువంటి చాలా వ్యాసాలు కంపెనీ-ప్రాయోజిత లేదా కంపెనీ మార్కెటింగ్ ప్రచురణల ఆధారంగా ఉంటాయి).
  • టెక్ బ్లాగ్ సమీక్ష ముఖ్యమైనది, ద్వితీయమైనది – కానీ స్వతంత్రంగా ఉండకపోవచ్చు (బ్లాగు పోస్టులు తరచూ స్పాన్సర్ చేయబడతాయి), నమ్మదగినవి కాకపోవచ్చు (స్వయం-ప్రచురితమైన మూలాధారాలు సాధారణంగా విశ్వసనీయమైనవి కావు, అవి సబ్జెక్ట్-మేటర్ నిపుణులు వ్రాస్తే తప్ప ).
  • కోర్టు ఫైలింగ్ ముఖ్యమైనది, నమ్మదగినది (అందులో కోర్టు రికార్డు అనేది చట్టపరమైన చర్య యొక్క ధృవీకరించబడిన ఖాతా) - కానీ ద్వితీయమైనది కాదు (కోర్ట్ ఫైలింగ్‌లు ప్రాథమిక మూలాలు), స్వతంత్రమైనవి కావు (అవి చట్టపరమైన చర్య కోసం వాది పక్షాలు రాసినవి. అంచేత వీటికి స్వార్థపరమైన ఆసక్తి ఉంటుంది).
అందువల్ల, ఫలానా లిమిటెడ్ సంస్థ ప్రాముఖ్యతను స్థాపించే బహుళ మూలాల సంగతి దేవుడెరుగు.., దానికి పనికొచ్చే మూలం ఒక్కటి కూడా వీటిలో లేదు.