సహాయం:వికీ మార్కప్‌తో పట్టికల పరిచయం/2/table 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
{| ప్రారంభం పట్టికను ప్రారంభించడంతో పాటు, పట్టిక తరగతిని (క్లాస్) నిర్వచించేది కూడా ఇక్కడే - ఉదాహరణకు, class="wikitable". ఈ "class" కు చెందిన పట్టికకు ప్రామాణిక వికీపీడియా ఆకృతీకరణ చేకూరుతుంది. "wikitable" , "wikitable sortable" అనే రెండు తరగతుల పట్టికలను సాధారణంగా వాడుతూంటారు; ఈ రెండవ రకం పట్టికలో ఏనిలువు వరుస శీర్షిక పైనైనా నొక్కి పాఠకుడు ఆ నిలువు వరుస ప్రకారం పట్టిక లోని అడ్డువరుసలను ఆరోహణ /అవరోహణ క్రమంలో పేర్చవచ్చు.
|+ వ్యాఖ్య తప్పనిసరి. డేటా పట్టికలలో ఇది ఉండాలి. ఇది, పట్టిక ప్రారంభానికి, మొదటి అడ్డు వరుసకూ మధ్య మాత్రమే ఉండాలి
! శీర్షిక గడి ఐచ్ఛికం. ప్రతి శీర్షిక గడి కొత్త లైనులో, ఒక ఆశ్చర్యార్థకం గుర్తు (!) తో మొదలౌతుంది. లేదా అనేక శీర్షిక గడులను ఒకే లైనులో మధ్యన రెండేసి ఆశ్చర్యార్థకం గుర్తు (!!) లతో చేర్చవచ్చు.
|- కొత్త అడ్డు వరుస కొత అడ్డువరుసను మొదలుపెట్టేందుకు,ఒక నిలువు గీత (పైపు) (|), ఆ వెంటనే ఒక (హైఫన్- ) చేర్చండి.

ను వాడండి

| అడ్డువరుసలో


కొత్త 

గడి

అడ్డువరుసలో ఒక కొత్త గడిని చేర్చేందుకు ఒక కొత్త లైనులో ఒక పైపుతో (|) మొదలు పెట్టండి.లేదా ఒకే లైనులో అనేక గడులను వరుసగా చేర్చేందుకు ఒక్కో గడికీ మధ్య రెండు పైపులను (||) చేర్చండి.
|} ముగింపు పట్టికను మూసేసేందుకు ఒక పైపును (|), ఆ వెంటనే ఒక మీసాల బ్రాకెట్టునూ (}) చేర్చండి.