సాజిన్ గోపు
సజిన్ గోపు | |
---|---|
జననం | సజిన్ గోపు అలువా, కేరళ, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
విశ్వవిద్యాలయాలు | డి పాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ |
వృత్తి |
|
క్రియాశీలక సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
సాజిన్ గోపు, మలయాళ సినిమారంగానికి చెందిన భారతీయ చలనచిత్ర నటుడు. కేరళలోని అలువా నుండి వచ్చిన ఆయన 2015లో వచ్చిన ముంబై టాక్సీ చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించాడు.[1] 2021లో, ఆయన చురుళితో కెరీర్ లో పురోగతిని సాధించాడు, ఆ తరువాత, 2023లో వచ్చిన జాన్.ఇ.మాన్, రోమాంచం చిత్రాలతో ప్రసిద్ధిచెందాడు.[2]
ప్రారంభ జీవితం
[మార్చు]సాజీన్ గోపు అలువాలో గోపాలకృష్ణన్, ప్రమీలా దంపతుల పెద్ద కుమారుడిగా జన్మించాడు. ఆయన తన ఉన్నత పాఠశాల విద్యను ఎస్. ఎన్. డి. పి పాఠశాలలో, హయ్యర్ సెకండరీ విద్యను ఆలువా బాయ్స్ హయ్యర్ సెక్కండరీ పాఠశాలలో పూర్తి చేసాడు. ఆయన అంగమాలి డి పాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీలో కళాశాల విద్య పూర్తి చేసాడు.[3]
కెరీర్
[మార్చు]గోపు 2015లో ముంబై టాక్సీ చిత్రంతో అరంగేట్రం చేసాడు.[4] ఆ తరువాత ఆయన తిలోత్తమ, మరుభూమిలే ఆనా చిత్రాలలో చిన్న పాత్రలు పోషించాడు. 2021లో లిజో జోస్ పెల్లిస్సెరీ రూపొందించిన చురుళిలో జీపు డ్రైవర్ గా ఆయన పోషించిన పాత్ర అతని కెరీర్లో ఒక మలుపు తిప్పింది.[5] అదే సంవత్సరం అతను జాన్.ఇ.మాన్ లో సాజీ వైపిన్ పాత్రను పోషించాడు, అక్కడ అతని నటన ప్రశంసలు అందుకుంది.[6] 2023లో, అతను హర్రర్ కామెడీ రొమాంచంలో ప్రధాన పాత్రలలో ఒకదానిలో నటించాడు. అతని పాత్ర నీరోప్ యువ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.[7]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2015 | ముంబై టాక్సీ | ఉగ్రవాద సంస్థకు చెందిన జియా థాక్బీర్ | సినిమా అరంగేట్రం |
తిలోత్తమ | రాబి | ||
2016 | మరుభూమియిలే ఆనా | కిచు స్నేహితుడు | గుర్తింపు లేనిది |
2021 | చురుళి | జీపు డ్రైవర్ | [8] |
జాన్.ఇ.మాన్ | సాజీ వైపిన్ | [8] | |
2023 | రోమాంచం | నీరోప్ | [9] |
నెయ్మర్ | కామియో | [10] | |
చావర్ | ఆసిఫ్ | [11] | |
2024 | అవేశం | అంబానియా | [12] |
మూలాలు
[మార్చు]- ↑ "'പുതപ്പിക്കും ഞാൻ': അർജുനെ കാണുമ്പോഴേ ചിരി വരും: രോമാഞ്ചത്തിലെ 'നിരൂപ്' അഭിമുഖം". www.manoramaonline.com. Retrieved 2023-05-09.
- ↑ "'ഇനി ചെയ്യുന്ന വേഷങ്ങൾ വ്യത്യസ്തമായിരിക്കും; നെഗറ്റീവും ഹ്യൂമറും സീരിയസ്സുമെല്ലാം ചെയ്യും': അഭിമുഖം: സജിൻ ഗോപു - ജൂട്ടു". Samayam Malayalam (in మలయాళం). Retrieved 2023-05-09.
- ↑ Desk, M. V. "സജിന്റെ സിനിമാവഴികൾ..." Metrovaartha (in మలయాళం). Retrieved 2023-05-09.
- ↑ അനു (2023-03-26). "ടീമിനൊപ്പമായാലും ഒറ്റയ്ക്ക് നിന്നാലും സീനില് ശരിക്കും ഡോമിനേറ്റ് ചെയ്യും!!!". Malayalam Film News Portal (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-05-09.
- ↑ "ചുരുളിയിലെ ജീപ്പ് ഡ്രൈവർ, ജാനേമന്നിലെ സജിയണ്ണൻ; സജിൻ ഗോപുവിന് ഇത് ഡബിൾ ലോട്ടറി". ManoramaOnline (in మలయాళం). Retrieved 2023-05-09.
- ↑ "Sajin Gopu: Lijo Jose Pellissery is on every actor's bucket list". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2023-05-09.
- ↑ "വിതരണക്കാർപോലും തഴഞ്ഞ ചിത്രം; 5 കോടിയിൽ താഴെ മുതൽ മുടക്ക്; 'രോമാഞ്ചം' 50 കോടി ക്ലബ്ബിൽ". ManoramaOnline (in మలయాళం). Retrieved 2023-05-09.
- ↑ 8.0 8.1 "Lijo Jose Pellissery is on every actor's bucket list: Churuli actor Sajin Gopu". The New Indian Express. Retrieved 2023-05-09.
- ↑ "Director Jithu Madhavan wants to see his blockbuster Romancham remade in other languages I Exclusive". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-05-09.
- ↑ "Hit duo Mathew Thomas and Naslen K Gafoor set to return with Neymar". The Indian Express (in ఇంగ్లీష్). 2023-05-04. Retrieved 2023-05-12.
- ↑ "Chaaver trailer: Kunchacko Boban promises a high-energy, tension-filled actioner". The Indian Express (in ఇంగ్లీష్). 2023-09-22. Retrieved 2024-03-04.
- ↑ Bureau, The Hindu (2024-01-26). "'Aavesham' teaser: Fahadh Faasil, Jithu Madhavan promise a wacky ride". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-03-04.