సాడిల్ పీక్ జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాడిల్ పీక్ జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
ప్రదేశంఅండమాన్ నికోబార్
విస్తీర్ణం85.47 km2 (33.00 sq mi)
స్థాపితం1979

సాడిల్ పీక్ జాతీయ ఉద్యానవనం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది.[1]

చరిత్ర[మార్చు]

ఈ ఉద్యానవనం 1979లో స్థాపించబడింది. ఇది 85.47 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇక్కడి వాతావరణం సాధారణంగా 20-30 ° C (68–86 ° F) మధ్య మారుతూ ఉంటుంది. ఇక్కడ వర్షాకాలం జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది.[2]

జంతుజాలం[మార్చు]

ఈ ఉద్యానవనంలో సముద్ర ఉష్ణోగ్రతలలో నివసించే జంతువులు సంరక్షించబడుతున్నాయి. అందులో అండమాన్ అడవి పంది, అండమాన్ హిల్ మైనా, అండమాన్ ఇంపీరియల్ పావురం, వాటర్ మానిటర్, డాల్ఫిన్లు, తిమింగలాలు, ఉప్పునీటి మొసలి వంటి అనేక జంతువులు సంరక్షించబడుతాయి.

వృక్ష సంపద[మార్చు]

ఈ ఉద్యానవనం చుట్టూ తేమ, ఉష్ణమండల వృక్షసంపదతో పాటు ఆకురాల్చే సతత హరిత అడవులు ఇందులో ఉన్నాయి. అందులో స్కోలోపియా పుసిల్లా, క్లిస్టాంతస్ రోబస్టస్ జాతుల వృక్షాలు ఇందులో పెరుగుతాయి. ఈ వృక్షాలు భారతదేశంలో అరుదుగా కనిపిస్తాయి.[3]

మూలాలు[మార్చు]

  1. Bisht, R.S. (1995). National parks of India. New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. p. 71. ISBN 8123001789.
  2. Negi, S.S. (2002). Handbook of national parks, wildlife sanctuaries, and biosphere reserves in India (3rd rev. ed.). New Delhi: Indus Pub. Co. p. 52. ISBN 8173871280.
  3. New Reports to the Flora of India from Saddle Peak National Park, North Andaman. Rheedea. Vol. 19 (1 & 2) 69-71. 2009