Jump to content

సాధనపల్లి ఆనంద్‌కుమార్

వికీపీడియా నుండి
(సాధనపల్లి ఆనంద్‌కుమార్‌ నుండి దారిమార్పు చెందింది)

సాధనపల్లి ఆనంద్‌కుమార్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్వతారోహకుడు. ఇతను 2014 మే 25 న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇతను 17 సంవత్సరాల వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మొట్టమొదట అధిరోహించిన దళిత బాలుడు గా చరిత్ర సృష్టించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆనంద్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మి, కొండలరావు దంపతుల కుమారుడు. ఆనంద్‌కుమార్ అన్నపురెడ్డిపల్లి ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొండలరావు సైకిల్ రిపేరు దుకాణం నడుపుతున్నారు.

పర్వతారోహణ

[మార్చు]

ఇతను స్వచ్ఛందసంస్థ స్వైరోస్, పర్వతారోహణలో శిక్షణ ఇచ్చే ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ సంస్థల అండతో ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు నడుం బిగించాడు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వివిధ పరీక్షలు నిర్వహించి, వారిలో అర్హులైన ఇద్దరిని స్వైరోస్ సంస్థ ఎంపిక చేసింది. వారికి మెరుగైన శిక్షణ ఇచ్చి 2014 ఏప్రిల్ 4 న ఎవరెస్ట్ శిఖరాధిరోహణ యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రలో 14 సంవత్సరాల వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా తెలంగాణా ప్రాంతానికి చెందిన తెలుగమ్మాయి మాలావత్ పూర్ణ రికార్డు సృష్టించింది. వీరితో పాటు వివిధ దేశాలకు చెందిన 30 మంది ఈ సాహసయాత్ర చేపట్టారు. వీరు ప్రముఖ పర్వతారోహకుడు, ట్రైనర్, అర్జున అవార్డు గ్రహీత శేఖర్‌బాబు నేతృత్వంలో ఈ సాహస యాత్ర సాగిస్తున్నారు.

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్టు శిఖరం 29,035 అడుగులు ఉంటుంది. వీరు ఎవరెస్టు శిఖరం ఉత్తర భాగమైన చైనా నుంచి ప్రయాణం ప్రారంభించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మాలవత్ పూర్ణ

మూలాలు

[మార్చు]

సాక్షి దినపత్రిక - మే 25, 2014