Jump to content

సాధనా సింగ్ (రాజకీయ నాయకురాలు)

వికీపీడియా నుండి
సాధనా సింగ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు హరనాథ్ సింగ్ యాదవ్
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

పదవీ కాలం
2017 – 2022
ముందు బబ్బన్
తరువాత రమేష్ జైస్వాల్
నియోజకవర్గం మొఘల్‌సరాయ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం మొఘల్‌సరాయ్, ఉత్తర ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకురాలు

సాధనా సింగ్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2017లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2024లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సాధనా సింగ్ 1993లో భారతీయ జనతా పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి బిజెపి మహిళా మోర్చా చందౌలికి రెండుసార్లు అధ్యక్షురాలిగా, బిజెపి యుపి వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా మూడుసార్లు పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2017 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి బాబులాల్ పై 13243 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2][3] సాధన సింగ్‌ను 2022 శాసనసభ ఎన్నికల్లో మొఘల్‌సరాయ్ నియోజకవర్గం నుండి తప్పించి బిజెపి టికెట్‌ను రమేష్ జైస్వాల్‌కు ఇచ్చింది. ఆమె పార్టీ ప్రయోజనం కోసం రమేష్ జైస్వాల్ గెలుపులో కీలకంగా పని చేసింది.

సాధనా సింగ్ 2024లో రాజ్యసభకు జరిగిన ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించగా, ఆమె ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. NDTV (28 February 2024). "BJP Wins 8 seats, Samajwadi Party Two In Rajya Sabha Polls In Uttar Pradesh". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  2. "Uttar Pradesh 2017 Result" (PDF). Election Commission of India. Retrieved 7 December 2018.
  3. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. The Economic Times (27 February 2024). "BJP wins eight Rajya Sabha seats; SP bags two seats in UP". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
  5. Navbharat Times (12 February 2024). "कौन हैं साधना सिंह... चंदौली से राज्यसभा जाएंगी पूर्व विधायक, बीजेपी ने क्यों जताया इतना भरोसा जानिए". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.