Jump to content

వికీపీడియా:సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక

వికీపీడియా నుండి
(సాధారణ పదదోషాలు - తప్పొప్పుల పట్టిక నుండి దారిమార్పు చెందింది)

తెలుగులో సర్వ సాధారణంగా కనిపించే పదదోషాలను గుర్తించి, వాటికి సరైన పదాలను సూచించడం ఈ వ్యాస లక్ష్యం. వ్యాకరణ రూపాలలోని దోషాలు దీని పరిధిలోకి రావు. కేవలం పద స్వరూపంలో సాధారణంగా కనిపించే తప్పులకి మాత్రమే ఇది పరిమితం. ఇందులో పదాలని చేర్చే ముందు నిఘంటువులో[1] సరిచూడ్డం మంచిది.

ఈ దిగువన ఉన్న జాబితాలోని అచ్చుతప్పులను బాటు ద్వారా యాంత్రికంగా వికీపీడియా మొత్తం దిద్దించబడుతుంది. కాబట్టి ఈ దిగువ పట్టికలో ఉన్న విధంగానే మీరు చేర్చాలనుకున్న అచ్చుతప్పులు చేర్చండి. కొత్త అచ్చుతప్పులను చేర్చటానికి అనుసరించవలసిన పద్ధతి ఈ దిగువన గమనించండి.

గమనిక:ఈ దిగువ పదాలలో కూర్పు చేసేటప్పుడు పొరపాటున ఎక్కడైనా అటుది ఇటు, ఇటుది అటు కూర్ప అయి ఉండవచ్చు. అలాంటి పదాలు గమనించినప్పుడు ఈ వ్యాసం చర్చాపేజీలో రాయగలరు.వాటిని సరిచూసి సవరించగలరు.

తప్పొప్పుల పట్టిక -1

[మార్చు]
తప్పు ఒప్పు
అంక్షలు ఆంక్షలు
అంతర్థానం అంతర్ధానం
అంతర్యుద్దం అంతర్యుద్ధం
అంధలం అందలం
అకతాయి ఆకతాయి
అక్షంతలు అక్షింతలు
అక్షేపించు ఆక్షేపించు
అగంతకుడు ఆగంతకుడు
అగాథం అగాధం
అగాయిత్యం అఘాయిత్యం
అగ్నిమాపుకం అగ్నిమాపకం
అగ్రస్తానం అగ్రస్థానం
అజమాయషీ అజమాయిషీ
అట్టాహాసం అట్టహాసం
అడ్డాదిడ్డం అడ్డదిడ్డంగా
అణిముత్యాలు ఆణిముత్యాలు
అణుకువ అణకువ
అణ్వాస్త్రం అణ్వస్త్రం
అతిథ్యం ఆతిథ్యం
అతిధి అతిథి
అతిరధుడు అతిరథుడు
అతివృష్ఠి అతివృష్టి
అత్తలాకుత్తలం అతలాకుతలం
అత్తిసరు అత్తెసరు
అత్యథికం అత్యధికం
అదిక్షేపించు అధిక్షేపించు
అదిగమించు అధిగమించు
అదృస్యం అదృశ్యం
అద్యక్షుడు అధ్యక్షుడు
అద్వాన్నం అధ్వానం
అధమ అథమ
అధారిటీ అథారిటీ
అధికృత అధీకృత
అధిష్టానం అధిష్ఠానం
అధీగమించు అధిగమించు
అధ్యాయనం అధ్యయనం
అనర్దదాయకం అనర్థదాయకం
అనర్ధం అనర్థం
అనవతం అవనతం
అనివారంగా అనివార్యంగా
అనుచిత్తంగా అనుచితంగా
అనుచెరుడు అనుచరుడు
అనుబందము
అనుభందం అనుబంధం
అనుభందము, అనుబంధం
అనుభంధము,
అనుసంథానం అనుసంధానం
అనుసంథానం అనుసంధానం
అనుసందానం అనుసంధానం
అపబ్రంశం అపభ్రంశం
అపరాథం అపరాధం
అపొహ అపోహ
అప్పానంగా అప్పనంగా
అప్రతిష్ట అప్రతిష్ఠ
అబినందన అభినందన
అబిప్రాయం అభిప్రాయం
అబిమానం అభిమానం
అబియోగం అభియోగం
అబివృద్ది అభివృద్ధి
అబ్యంతరం అభ్యంతరం
అబ్యర్తి అభ్యర్థి
అభద్దం అబద్ధం
అభ్యర్దించు అభ్యర్థించు
అభ్యుధయం అభ్యుదయం
అమంతంగా అమాంతంగా
అమాత్యిడు అమాత్యుడు
అయోమైయంగా అయోమయంగా
అరాచకం అరాజకం
అరిమరికలు అరమరికలు
అరిష్ఠం అరిష్టం
అర్జనుడు అర్జునుడు
అర్జి అర్జీ
అర్ధంతరంగా అర్ధాంతరంగా
అర్బకుడు అర్భకుడు
అలంకారించు అలంకరించు
అల్పఫీడనం అల్పపీడనం
అవకాతవకలు అవకతవకలు
అవస్త అవస్థ
అవ్యజ అవ్యాజ
అశ్రద్ద అశ్రద్ధ
అష్ఠకష్ఠాలు అష్టకష్టాలు
అష్ఠైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు
అసబ్యంగా అసభ్యంగా
అస్థమానం అస్తమానం
అస్థవ్యస్థం అస్తవ్యస్తం
అస్థిత్వము అస్తిత్వం
ఆంద్రుడు ఆంధ్రుడు
ఆక్రమం అక్రమం
ఆక్షేపన ఆక్షేపణ
ఆగచాట్లు అగచాట్లు
ఆగత్యం అగత్యం
ఆగ్రహాం ఆగ్రహం
ఆచ్చాదన ఆచ్ఛాదన
ఆధరణ ఆదరణ
ఆధర్శం ఆదర్శం
ఆధాయం ఆదాయం
ఆధునీకరణ ఆధునికీకరణ
ఆనవాయతీ ఆనవాయితీ
ఆబాలగోపాళం ఆబాలగోపాలం
ఆమోధం ఆమోదం
ఆయుకట్టు ఆయకట్టు
ఆరంబం ఆరంభం
ఆర్దిక ఆర్థిక
ఆర్బాటం ఆర్భాటం
ఆవగాహన అవగాహన
ఆవరన ఆవరణ
ఆవశ్యం అవశ్యం
ఆశక్తి, ఆశక్తులు ఆసక్తి, ఆసక్తులు
ఆశనిపాతం అశనిపాతం
ఆస్థిపాస్థులు ఆస్తిపాస్తులు
ఆస్థులు ఆస్తులు
ఆస్రితపక్షపాతం ఆశ్రిత పక్షపాతం
ఆహుతులు ఆహూతులు
ఇంగీతం ఇంగితం
ఇథోదికంగా ఇతోధికంగా
ఇనస్పెక్టర్‌ ఇన్‌స్పెక్టర్
ఇబ్బుడిముబ్బుడి ఇబ్బడిముబ్బడి
ఇబ్భంది ఇబ్బంది
ఇల్లరికటం ఇల్లరికం
ఈర్ష ఈర్ష్య
ఈసుడింపు ఈసడింపు
ఉచ్ఛారణ ఉచ్చారణ
ఉఢాయించారు ఉడాయించారు
ఉత్తానపతనాలు ఉత్థానపతనాలు
ఉత్ఫాథం ఉత్పాతం
ఉత్సావం ఉత్సవం
ఉదాశీనత ఉదాసీనత
ఉదాహారణ ఉదాహరణ
ఉద్గాటించారు ఉద్ఘాటించారు
ఉద్బవించారు ఉద్భవించారు
ఉద్భోదించారు ఉద్బోధించారు
ఉధ్యమం ఉద్యమం
ఉధ్వాసన ఉద్వాసన
ఉన్నపలంగా ఉన్నపళంగా
ఉప సంహారణ ఉపసంహరణ
ఉపగృహం ఉపగ్రహం
ఉపదేశ్యం ఉపదేశం
ఉపయోగ్యం ఉపయోగం
ఉపాచారం ఉపచారం
ఉపాది ఉపాధి
ఉపాద్యక్షుడు ఉపాధ్యక్షుడు
ఉపోద్గాతం ఉపోద్ఘాతం
ఉల్లంగించారు ఉల్లంఘించారు
ఉవ్విల్లూరు ఉవ్విళ్లూరు
ఊరుమ్ముడి ఊరుమ్మడి
ఎడతెరుపి ఎడతెరిపి
ఎద్ధడి ఎద్దడి
ఎన్నైక ఎన్నిక, ఎంపిక
ఏకంతంలో ఏకాంతంలో
ఏకాఎకిన ఎకాఎకిన
ఏన్నర్థంగా ఏణ్ణర్థంగా
ఏమరుపాటిగా ఏమరుపాటుగా
ఐక్యమత్యం ఐకమత్యం
ఐఖ్యం ఐక్యం
ఐచ్చిక ఐచ్ఛిక
ఒడంభడిక ఒడంబడిక
ఔఛిత్యం ఔచిత్యం
కటాకట కటకట
కధ కథ
కనిష్ఠం కనిష్టం
కమీశనర్‌ కమిషనర్‌
కలక్టరేట్ కలెక్టరేట్‌
కలువరింత కలవరింత
కల్లోళం కల్లోలం
కాకీ ఖాకీ
కాపురస్తులు కాపురస్థులు
కాయిలా ఖాయిలా
కార్యదర్సి కార్యదర్శి
"కారణములను" (శైలి) కారణాలను
కాలుశ్యం కాలుష్యం
కీర్తిసేషులు కీర్తిశేషులు
కూలంకశంగా కూలంకషంగా
కూలంఖషంగా కూలంకషంగా
కౌన్సిలింగ్‌ కౌన్సెలింగ్‌
క్రమబద్దీకరణ క్రమబద్ధీకరణ
క్రీఢాకారులు క్రీడాకారులు
క్రోదం క్రోధం
క్షిఫణి క్షిపణి
ఖంగారు కంగారు
ఖచ్చితంగా కచ్చితంగా
ఖచ్చితంగా కచ్చితంగా
గంబీరంగా గంభీరంగా
గడిబిడ గడబిడ
గమినించు గమనించు
గరానా ఘరానా
గర్బం గర్భం
గాతం ఘాతం
గాయికుడు గాయకుడు
గాయిని గాయని
గుండ్రాళ్లదెబ్బ ఉండేలు దెబ్బ
గుత్తాదిపత్యం గుత్తాధిపత్యం
గుభాళింపు గుబాళింపు
గుభులు గుబులు
గూడాచారి గూఢచారి
గృహస్తుడు గృహస్థుడు
గౌరవార్ధం గౌరవార్థం
గ్రంధం గ్రంథం
గ్రంధసాంగుడు గ్రంథసాంగుడు
చతుర్ది చతుర్థి
చతుష్ఠయం చతుష్టయం
చాంపియన్‌ ఛాంపియన్‌
చిరనామ చిరునామా
చేతన్యం చైతన్యం
చేధించు ఛేదించు
ఛట్టబద్దం చట్టబద్ధం
జఠిలం జటిలం
జనార్ధన జనార్దన
జయంత్యోత్సవం జయంత్యుత్సవం
జళిపించు ఝళిపించు
జీర్ణుద్ధరణ జీర్ణోద్ధరణ
జీవచ్చవం జీవచ్ఛవం
డమరుకం ఢమరుకం
డయిరీ డెయిరీ
డిశంబర్‌ డిసెంబర్‌
డెప్యూటీ డిప్యూటీ
డైరక్టరేట్ డైరెక్టరేట్‌
డ్రయినేజీ డ్రైనేజీ
ఢక్కామక్కీలు డక్కామొక్కీలు
ఢీలాపడు డీలా పడు
తటస్తం తటస్థం
తనికీ తనిఖీ
తలక్రిందులు తల్లకిందులు
తలవొంపులు తలవంపులు
తలుకుబెలుకు తళుకుబెళుకు
తాకత్తు తాహతు
తాదాత్మం తాదాత్మ్యం
తాలుకా తాలూకా
తిరస్కారించు తిరస్కరించు
తిరోగామం తిరోగమనం
తీర్ధం తీర్థం
తృటి త్రుటి
త్రైపక్షిక త్రైపాక్షిక
దంఢయాత్ర దండయాత్ర
దగ్దం దగ్ధం
దగ్దం దగ్ధం
దరకాస్తు దరఖాస్తు
దరలు ధరలు
దర్మాసనం ధర్మాసనం
దశరధుడు దశరథుడు
దషకం దశకం
దహానం దహనం
దాఖలు దఖలు
దాటి ధాటి
దిక్కరించు ధిక్కరించు
దిగ్బ్రాంతి దిగ్భ్రాంతి
దిగ్భందం దిగ్బంధం
దుర్ధినం దుర్దినం
దుర్బేధ్యం దుర్భేద్యం
దుష్పలితం దుష్ఫలితం
దూమపానం ధూమపానం
దృక్ఫదం దృక్పథం
దృవీకరించు ధ్రువీకరించు
దైర్యం ధైర్యం
దోహధపడు దోహదపడు
దౌర్బాగ్యం దౌర్భాగ్యం
ద్యేయం ధ్యేయం
ద్వందవైఖరి ద్వంద్వ వైఖరి
ధండకం దండకం
ధనుంజయుడు ధనంజయుడు
ధీటుగా దీటుగా
ధురందరుడు దురంధరుడు
ధృడం దృఢం
నదీనదులు నదీనదాలు
నసించు నశించు
నాస్థికుడు నాస్తికుడు
నిక్కచ్ఛిగా నిక్కచ్చిగా
నిఘ్రహం నిగ్రహం
నిమత్తం నిమిత్తం
నిముషం నిమిషం
నిరాఠంకంగా నిరాటంకంగా
నిరాయుదీకరణ నిరాయుధీకరణ
నిరాహార ధీక్ష నిరాహార దీక్ష
నిరూపయోగం నిరుపయోగం
నిర్ద్వందంగా నిర్ద్వంద్వంగా
నిర్ధయ నిర్దయగా
నిర్ధాక్షిణ్యం నిర్దాక్షిణ్యం
నిర్ధారణ నిర్ధరణ
నిర్ధిష్టంగా నిర్దిష్టంగా
నిర్ధేశ్యం నిర్దేశం
నిర్భందం నిర్బంధం
నిర్భందం నిర్బంధం
నిర్వాఖం నిర్వాకం
నిర్వీరం నిర్వీర్యం
నివృతి నివృత్తి
నివేధిక నివేదిక
నిశేదాజ్ఞలు నిషేధాజ్ఞలు
నిశ్చితార్ధం నిశ్చితార్థం
నిషేదిత నిషేధిత
నిష్క్రమింఛారు నిష్క్రమించారు.
నిసృహ నిస్పృహ
నీరషించు నీరసించు
నెంబరు నంబరు
నేపద్యం నేపథ్యం
నేరస్తులు నేరస్థులు
నైవేధ్యం నైవేద్యం
న్యాయస్తానం న్యాయస్థానం
పంఛాయతీ పంచాయితీ
పందారం పందేరం
పటిష్ఠం పటిష్టం
పట్టబద్రులు పట్టభద్రులు
పరంబోకు పోరంబోకు
పరిక్ష పరీక్ష
పరిణామ్యం పరిణామం
పరివాహక పరీవాహక
పరోపంగా పరోక్షంగా
పర్యావసానం పర్యవసానం
పలయానం పలాయనం
పల్లెత్తమాట పల్లెత్తుమాట
పశుసంవర్దక పశుసంవర్ధక
పించెను పింఛను
పీపాస పిపాస
పుంకానుపుంకాలు పుంఖానుపుంఖాలు
పునరుద్గాటించు పునరుద్ఘాటించు
పునర్వవస్తీకరణ పునర్వ్యవస్థీకరణ
పురష్కారం పురస్కారం
పూర్వత్తరాలు పూర్వోత్తరాలు
ప్రక్షాలనం ప్రక్షాళనం
ప్రచ్చనం ప్రచ్ఛన్నం
ప్రణాలిక ప్రణాళిక
ప్రతిక ప్రతీక
ప్రతిబ ప్రతిభ
ప్రతిష్ట ప్రతిష్ఠ
ప్రత్యర్ధి ప్రత్యర్థి
ప్రత్యామ్నం ప్రత్యామ్నాయం
ప్రధమ ప్రథమ
ప్రబంజనం ప్రభంజనం
ప్రబాతం ప్రభాతం
ప్రమానం ప్రమాణం
ప్రయివేటు ప్రైవేటు
ప్రలోబం ప్రలోభం
ప్రవాశం ప్రవాసం
ప్రశక్తి ప్రసక్తి
ప్రాంగనం ప్రాంగణం
ప్రాదేయపడు ప్రాధేయపడు
ప్రాధమిక ప్రాథమిక
ఫుకారు వదంతి
బవిత భవిత
బాగస్తులు భాగస్థులు
బాహబాహి బాహాబాహీ
బీష్మించు భీష్మించు
బృంధావనం బృందావనం
బేధం భేదం
బేషజం భేషజం
బౌతిక భౌతిక
బ్రహ్మరధం బ్రహ్మరథం
భందము, భంధము, బందము బంధం
భడుగు బడుగు
భహిరంగంగా బహిరంగంగా
భాందవ్యము బాంధవ్యం
భాద బాధ
భాద్యత బాధ్యత
భాష్పము బాష్పం
భీభత్సం బీభత్సం
భుద్ది బుద్ధి
భూస్తాపితం భూస్థాపితం
భ్రష్ఠుడు భ్రష్టుడు
మథలబు మతలబు
మదువు మధువు
మద్యాన్నం మధ్యాహ్నం
మధ్యపానం మద్యపానం
మనస్థాపం మనస్తాపం
మనోనిబ్భరం మనోనిబ్బరం
మమైకం మమేకం
మరమత్తు మరమ్మతు
మర్థించు మర్దించు
మలేషియా మలేసియా
మహత్యము మాహాత్మ్యం
మహాత్యం మహాత్మ్యం
మార్చ్ మార్చి
మార్ధవం మార్దవం
మితృడు మిత్రుడు
మెలకువ మెళకువ
యదేచ్ఛగా యధేచ్చగా
యధాతధం యథాతథం
యధార్థం యథార్థం
యవ్వనం యౌవనం
యాదృచ్చికం యాదృచ్ఛికం
యుద్దం యుద్ధం
రంగరంగవైభవం అంగరంగ వైభవం
రంగేళిరాట్నం రంగులరాట్నం
రధం రథం
రబస రభస
రవుతు రౌతు
రాజదాని రాజధాని
రాయభారము రాయబారం
రిజిష్ట్రార్‌ రిజిస్ట్రార్‌
రుషి ఋషి
రొచ్ఛు రొచ్చు
రోదశి రోదసి
లంకణం లంఖణం
లక్షం లక్ష్యం
లబ్ధిదారులు లబ్దిదారులు
లాటీఛార్జి లాఠీచార్జ్
వశిష్టుడు వశిష్ఠుడు
వాయగండం వాయుగుండం
వార్శికం వార్షికం
విఛక్షణ విచక్షణ
విద్యుద్ఘాతం విద్యుదాఘాతం
వినోధం వినోదం
విబాగము విభాగం
విమర్ష విమర్శ
విరాలం విరాళం
విస్పోటన విస్ఫోటన
వుచితంగా ఉచితంగా
వుత్తమం ఉత్తమం
వెవసాయం వ్యవసాయం
వెవహారం వ్యవహారం
వేధిక వేదిక
వైశమ్యం వైషమ్యం
వ్యక్తిగథం వ్యక్తిగతం
వ్యర్ధం వ్యర్థం
వ్యాక్యానం వ్యాఖ్యానం
వ్యాఫారి వ్యాపారి
వ్యాహ్యాళి వాహ్యాళి
శతగ్ని శతఘ్ని
శబ్ధం శబ్దం
శాఖాహారం శాకాహారం
శికారు షికారు
శృతి శ్రుతి
శోదన శోధన
షాతం శాతం
షాశనం శాసనం
సంగటం సంకటం
సంజాయషీ సంజాయిషీ
సంథరించు సంతరించు
సందర్బం సందర్భం
సంభోదన సంబోధన
సంషయం సంశయం
సంస్త సంస్థ
సంస్తాగతం సంస్థాగతం
సఛివులు సచివులు
సదుద్ధేశ్యం సదుద్దేశం
సధస్సు సదస్సు
సబ్యుడు సభ్యుడు
సమర్ధన సమర్థన
సమర్ధించడం సమర్థించడం
సమిక్ష సమీక్ష
సమిష్టి సమష్టి
సమీకరనాలు సమీకరణాలు
సమృద్ది సమృద్ధి
సమైఖ్య సమైక్య
సవరన సవరణ
సవుజన్యం సౌజన్యం
సషేశం సశేషం
సహాకారం సహకారం
సారధి సారథి
సృహలో స్పృహలో
సౌష్టవం సౌష్ఠవం
స్తలం స్థలం
స్తలం స్థలం
స్తాయి స్థాయి
స్తావరం స్థావరం
స్తితిగతులు స్థితిగతులు
స్తిరం స్థిరం
స్తూలంగా స్థూలంగా
స్తోమత స్థోమత
స్నాతకుత్సవం స్నాతకోత్సవం
స్ఫందన స్పందన
స్మశానం శ్మశానం
స్వచ్చందంగా స్వచ్ఛందంగా
స్వానుబవం స్వానుభవం
హటాత్తుగా హఠాత్తుగా
హడావిడి హడావుడి
హుటాహుటన హుటాహుటిన
హేమాహేమిలు హేమాహేమీలు