సాధారణ బొగ్గు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాదారణ బొగ్గు తయారు చేయు విధానము. పనికిరాని కర్రలను దుంగలను ఒక చోట చేర్చి శంకాకారంలో పెద్ద కుప్పగా పేర్చి దానిపై ఆకులలుములు పేర్చి దానిపై పలచగా మట్టిని కప్పి కింద ఒక ద్వారం చేసి అందులో మంట పెద్తారు. సుమారు ఆరు గంటలు మంట పెట్టి మంట బాగా వ్యాపించిందని అనుకొన్నాక ఆ ద్యారాన్ని కూడా మట్టితో మూసేస్తారు. ఈ కట్టెల కుప్పను మూటు అంటారు. అగ్ని లోపల అంతా వ్యాపించి మెల్లిగా కాలుతుటాయి. లోపల గాలి లేనందున లోపలున్న కర్రలు/దుంగలు కాలి బూడిద అయిపోవు. ఇలా సుమారు పది...ఇరవై రోజులు పాటు కాలుతుంటాయి. ఆ తర్వాత చల్లారినాక మూటును విప్పదీస్తే బొగ్గుల కుప్ప కనిపిస్తుంది. ఇది కర్ర బొగ్గు తయారి విధానం.