సాల్వడార్ డాలీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Salvador Dalí
Salvador Dalí 1939.jpg
Salvador Dalí
Photo by Carl Van Vechten taken
November 29, 1939.
జన్మ నామం Salvador Domingo Felipe Jacinto Dalí i Domènech
జననం (1904-05-11)మే 11, 1904
Figueres, Catalonia, Spain
మరణం జనవరి 23, 1989(1989-01-23) (వయసు 84)
Figueres, Catalonia, Spain
జాతీయత Spanish
రంగం Painting, Drawing, Photography, Sculpture, Writing
శిక్షణ San Fernando School of Fine Arts, Madrid
ఉద్యమం Cubism, Dada, Surrealism
కృతులు The Persistence of Memory (1931)
Face of Mae West Which May Be Used as an Apartment, (1935)
Soft Construction with Boiled Beans (Premonition of Civil War) (1936)
Swans Reflecting Elephants (1937)
Ballerina in a Death's Head (1939)
The Temptation of St. Anthony (1946)
Galatea of the Spheres (1952)
Crucifixion (Corpus Hypercubus) (1954)

సాల్వడార్ డొమింగో ఫెలిపే జసింతో డాలీ ఐ డొమెనిక్, ప్యుబల్ యొక్క 1వ మార్క్విస్ (1904 మే 11 – 1989 జనవరి 23), ఫిగ్యురెస్లో జన్మించిన ఒక ప్రఖ్యాత స్పానిష్ కాటలాన్ అధివాస్తవిక చిత్రకారుడు.

డాలీ(Spanish pronunciation: [daˈli]) ఒక నైపుణ్యం కలిగిన చిత్రలేఖకుడు. తన అధివాస్తవిక పనితనంతో ప్రభావవంతమైన, అద్భుతమైన చిత్రాలను సృజించి పేరుపొందారు. ఆయన చిత్రలేఖన నైపుణ్యాలు తరచూ రినైజాన్స్ నిపుణుల ప్రభావానికి లోనైనట్లుగా భావించబడ్డాయి.[1][2] ఆయన అత్యుత్తమ ప్రసిద్ధ చిత్రం, ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీ, 1931లో పూర్తయింది. డాలీ యొక్క విస్తృతమైన కళాత్మక జాబితాలో అనేకమంది కళాకారులు మరియు విభిన్న మాధ్యమాల సహకారంతో చేసిన చిత్రాలు, శిల్పాలు మరియు ఛాయాచిత్రాలు ఉన్నాయి.

డాలీ తన పూర్వీకులు మూర్స్ యొక్క వారసులని పేర్కొంటూ, "మెరుగులతో ఘనంగా ఉండే ప్రతిదానిపై ప్రేమ, భోగము పట్ల వ్యామోహం మరియు ప్రాచ్య వస్త్రధారణపట్ల మక్కువ"[3] ల తన స్వీయశైలిని "అరబ్ వారసత్వానికి" ఆపాదించారు.

డాలీ గొప్ప కల్పనాశక్తి కలవాడు. అందరి దృష్టిని ఆకర్షించటానికి అసాధారణమైన, ఆడంబరమైన ప్రవర్తన పట్ల ఆకర్షణ కలిగిఉండేవాడు. అతని విపరీత ప్రవర్తన కొన్నిసార్లు అతని చిత్రాలకంటే ఎక్కువగా ప్రజల దృష్టిని ఆకర్షించేది. ఈ ప్రవర్తన కొన్నిసార్లు అతని కళను ఇష్టపడేవారికి బాధ కలిగించగా విమర్శకులకు అంతే చిరాకును కలిగించేది.[4]

జీవితచరిత్ర[మార్చు]

ప్రారంభ జీవితం[మార్చు]

సాల్వడార్ డొమింగో ఫెలిపే జసింతో డాలీ ఐ డొమినెక్, 1904 మే 11 న ఉదయం 8:45 గంటలకు[5]స్పెయిన్, కెటలోనియాలో ఫ్రెంచ్ సరిహద్దు ప్రదేశమైన ఏమ్పోర్డాప్రాంతంలో ఫిగ్యురెస్ పట్టణంలో జన్మించాడు.[6] సాల్వడార్ అనే పేరునే కలిగిన డాలీ అన్న (జననం 1901 అక్టోబరు 12), తొమ్మిది నెలల ముందు అతిసారవ్యాధితో 1903 ఆగస్టు 1 న మరణించారు. ఆయన తండ్రి, సాల్వడార్ డాలీ ఐ క్యుసీ, ఒక మధ్య-తరగతి న్యాయవాది మరియు నోటరీ[7] ఈయన కచ్చితమైన క్రమశిక్షణావిధానం భార్య ఫెలిపా డొమినిక్ ఫెర్రీస్ చే నియంత్రించబడింది. ఈమె తన కుమారుని కళాత్మక ప్రయత్నాలను ప్రోత్సహించారు.[8] ఐదు సంవత్సరాల వయసులో, తల్లితండ్రులు డాలీని అతని అన్న సమాధివద్దకు తీసుకువెళ్లి అతడిని అతని అన్నయొక్క పునర్జన్మగా పేర్కొన్నారు,[9] ఈ భావనను అతను నమ్మాడు.[10] తన అన్న గురించి డాలీ ఈ విధంగా చెప్పాడు, "…[మేము] రెండు నీటి బిందువులవలె ఒకరితో ఒకరిని పోలి ఉన్నాము, కానీ మా ప్రతిబింబాలు వేరు." [11] "అతను బహుశా నామొదటి రూపం. కానీ సంపూర్ణత్వంలో అతిగా భావించారు." [11]

డాలీకి అతనికంటే మూడుసంవత్సరాలు చిన్నదైన అనా మారియా అనే సోదరి కూడా ఉంది.[7] 1949లో, ఆమె తన సోదరుని గురించి డాలీ యాజ్ సీన్ బై హిస్ సిస్టర్ అనే పుస్తకాన్ని ప్రచురించారు.[12] ఆయన చిన్ననాటి స్నేహితులలో భవిష్యత్ FC బార్సిలోన ఫుట్ బాల్ ఆటగాళ్లైన సగిబర్బ మరియు జోసెప్ సమిటియర్ ఉన్నారు. సెలవుదినాలలో ఈ త్రయం కాటలాన్ యొక్క కాడక్వేస్ విడిదిలో కలిసి ఫుట్ బాల్ ఆడేవారు.

డాలీ చిత్ర లేఖన పాఠశాలకు హాజరయ్యాడు. 1916 వేసవి సెలవులలో పారిస్‌కు తరచుగా ప్రయాణం చేసే స్థానిక కళాకారుడైన రోమన్ పిచోట్ కుటుంబంతో కాడక్వేస్లో ఆధునిక చిత్రకళను కూడా తెలుసుకున్నాడు.[7] తరువాత సంవత్సరంలో, డాలీ యొక్క తండ్రి అతని బొగ్గుతో గీసిన చిత్రాలతో వారి కుటుంబగృహంలో ఒక ప్రదర్శన నిర్వహించాడు. అతని మొట్టమొదటి బహిరంగ ప్రదర్శన ఫిగ్యురెస్ లోని మునిసిపల్ ధియేటర్ లో 1919లో జరిగింది.

ఫిబ్రవరి 1921లో, డాలీ తల్లి రొమ్ము కేన్సర్ తో చనిపోయారు. అప్పుడు డాలీకి పదహారు సంవత్సరాలు; తరువాత ఆయన తల్లి మరణం గురించి చెప్తూ "నేను నా జీవితంలో అనుభవించిన అతి పెద్ద దెబ్బ. నేను ఆమెను పూజించాను…ఎవరికొరకైతే సరిద్దుకోలేని నాఆత్మ యొక్క లోపాలను కనిపించకుండా ఉంచాలని ప్రయత్నించానో ఆమే లేనపుడు నన్ను నేను వదలుకోలేక పోయాను." [13] ఆమె మరణం తరువాత, అతని తండ్రి, మరణించిన తన భార్య సోదరిని వివాహం చేసుకున్నారు. డాలీకి తన పిన్ని పట్ల ఉన్న గొప్ప ప్రేమ మరియు గౌరవం వలన అతను ఈపెండ్లిని తిరస్కరించలేదు.[7]

మాడ్రిడ్ మరియు పారిస్[మార్చు]

డాలీ యొక్క క్రూర-చూపు చిలిపిచేష్ట (ఎడమ) మరియు సహచర అధివాస్తవిక చిత్రకారుడు మాన్ రే, పారిస్ లో 1934 జూన్ 16 న కార్ల్ వాన్ వెచెన్ చే తీయబడిన ఫోటో.

1922లో, డాలీ మాడ్రిడ్ లోని రెసిడెన్సియ డే ఎస్తుదింత్స్ (స్టూడెంట్స్' రెసిడెన్స్)కి వెళ్లారు[7] మరియు ఎకడేమియా డి సాన్ ఫెర్నాండో (లలితకళా పాఠశాల)లో అభ్యసించారు. సన్నగా, 1.72 మీ (5 అడుగుల. 7¾ అంగుళాల.) పొడవుతో,[14] డాలీ అప్పటికే విపరీతప్రవర్తనకు మరియు నాగరిక పోకడలపట్ల అనవసర వ్యామోహానికి గుర్తింపుపొందారు. ఆయనకు పొడవాటి జుట్టు మరియు చెవి ప్రక్కన పెంచిన గెడ్డం, కోటు, మేజోళ్ళు, మరియు మోకాలివరకు ఇజారుతో 19వ శతాబ్దపు చివరి ఆంగ్ల సౌందర్య శైలిలో ఉండేవారు.

రెసిడెన్సియలో, ఆయన (ఇతరులతో పాటు) పెపిన్ బెల్లో, లూయిస్ బున్నెల్, మరియు ఫెడెరికో గార్సియ లోర్కాలకు సన్నిహిత మిత్రుడయ్యారు. లోర్కాతో స్నేహంలో ఉభయులకూ తీవ్రమైన భావోద్వేగం ఉండేది,[15] కానీ డాలీ ఈ కవి యొక్క కామ విషయక పురోగతిని తిరస్కరించారు.[16]

ఏదేమైనా, క్యూబిజంతో ప్రయోగాత్మకంగా వేసిన వర్ణచిత్రాలు, తన తోటి విద్యార్థులు తనపై దృష్టి కేంద్రీకరించేలా చేసాయి. ఈ ప్రారంభ చిత్రాల సమయంలో, డాలీ బహుశా క్యూబిస్ట్ ఉద్యమాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకొని ఉండకపోవచ్చు. ఆసమయంలో మాడ్రిడ్ లో క్యూబిస్ట్ కళాకారులు ఎవరూ లేకపోవడం వలన, క్యూబిస్ట్ కళగురించి ఆయనకు తెలిసిన సమాచారం పత్రికల వ్యాసాలు మరియు ఆయనకు పిచోట్ ఇచ్చిన ఒక కేటలాగు మాత్రమే. 1924లో, ఇంకా అంతగా ప్రసిద్ధి చెందని సాల్వడార్ డాలీ మొదటిసారి ఒక పుస్తకానికి చిత్రాలను అందించారు. ఇది అతని పాఠశాల సహచరుడు, స్నేహితుడు మరియు కవి అయిన చార్లెస్ ఫగెస్ డే క్లిమెంట్ చే ప్రచురించబడిన కాటలాన్ పద్యం "లెస్ బ్రుక్సేస్ డేల్లెర్స్" ("ది విచెస్ ఆఫ్ ల్లెర్స్"). జీవితమంతా తన పనిపై ప్రభావంచూపిన దాదాతో కూడా ప్రయోగాలుచేశాడు.

1926లో డాలీ తన చివరి పరీక్షల ముందు, అధ్యాపకబృందంలో తనను పరీక్షించగల సామర్ధ్యంకలవారు ఎవరూలేరని ప్రకటించటంతో అకాడమియా నుండి బహిష్కరించబడ్డాడు.[17] చిత్రకళా నైపుణ్యాలలో అతని చాతుర్యానికి సాక్షిగా 1926లో అతనిచే చిత్రించబడిన లోపరహిత వాస్తవిక చిత్రం బాస్కెట్ ఆఫ్ బ్రెడ్ నిలుస్తుంది.[18] అదే సంవత్సరం, పారిస్ ను మొదటిసారిగా దర్శించి, యువకుడైన డాలీ ఎంతో గౌరవించే పబ్లో పికాసోను కలిశాడు. పికాసో అప్పటికే జొయన్ మిరో ద్వారా డాలీ గురించి అనుకూల సమాచారాన్ని విని ఉన్నాడు. తరువాతి కొన్నిసంవత్సరాలలో తన స్వంతశైలిని అభివృద్ధిపరచుకొని, పికాసో మరియు మీరోల తీవ్రప్రభావంతో డాలీ అనేకచిత్రాలు గీశాడు.

డాలీ యొక్క 1920ల చిత్రాలలోని కొన్నిధోరణులు అతని జీవితకాలం కొనసాగటాన్ని గమనించవచ్చు. అత్యంత విద్వత్సంబంధ సాంప్రదాయంనుండి ఆసమయంలో అమలులో ఉన్న ప్రయోగాల వరకు, అనేక శైలుల చిత్రకళలనుండి డాలీ అభినివేశం ప్రభావితమైనది.[19] అతనిని సంప్రదాయపరంగా ప్రభావితం చేసినవారిలో రాఫెల్, బ్రోంజినో, ఫ్రాన్సిస్కో డే జుర్బరాన్, వెర్మీర్, మరియు వెలజ్క్వెజ్వంటి వారు ఉన్నారు.[20] ఆయన సాంప్రదాయ మరియు ఆధునిక పద్ధతులను రెండిటినీ కొన్నిసార్లు విడి చిత్రాలలో, మరికొన్నిసార్లు కలయికతో ఉపయోగించాడు. బార్సిలోనాలో ఆయన చిత్రాల ప్రదర్శన పలువురి దృష్టిని ఆకర్షించడంతోపాటు పొగడ్తలు మరియు సంభ్రమచర్చలను విమర్శకులనుండి పొందింది.

ఏడవ శతాబ్దపు చిత్రకళా ప్రవీణుడైన డిగో వేలజ్క్వేజ్ చే ప్రభావితమై, డాలీ ఆడంబరమైన మీసాలను పెంచుకున్నాడు. ఆయన తదనంతర జీవితంలో ఈమీసాలు అతనికి గుర్తింపు చిహ్నాలుగా మారాయి.

1929 రెండవ ప్రపంచయుద్ధ కాలంలో[మార్చు]

1929లో, డాలీ అధివాస్తవ చిత్రదర్శకుడు లూయిస్ బున్యెల్కు లఘు చిత్రంUn chien andalou(యాన్ అండలుసియన్ డాగ్ )కి సహాయం అందించారు. అతని ముఖ్య సహకారం సినిమాకు స్క్రిప్ట్ రాయటంలో బున్యెల్ కు సహాయం చేయడం. తరువాత ఈ ప్రాజెక్ట్ ను సినిమాగా తీయడంలోకూడా డాలీ ముఖ్యపాత్ర వహించాడని చెప్పబడింది కానీ, సమకాలీన గ్రంథాలలో ఇది వాస్తవమని పేర్కొనబడలేదు.[21] ఆగస్టు 1929లో డాలీ తన కావ్యదేవత, స్ఫూర్తి, మరియు కాబోయేభార్య గాలాను కలుసుకున్నారు,[22] ఈమె జన్మనామం ఎలెనా ఇవనోవ్న డియకొనోవ. ఆమె డాలీ కంటే పదకొండు సంవత్సరాల పెద్దదైన రష్యన్ వలసవ్యక్తి, మరియు అప్పటికే అధివాస్తవిక కవి పాల్ ఎల్యుఅర్డ్తో వివాహమైంది. అదే సంవత్సరంలో, డాలీ ముఖ్యమైన వృత్తిపర ప్రదర్శనలు కలిగిఉన్నాడు మరియు పారిస్ యొక్క మోంట్పర్నసే విభాగంలో అధివాస్తవిక సమూహంలో అధికారికంగా చేరాడు. అతని కళ అప్పటికే రెండు సంవత్సరాలుగా అధివాస్తవిక ప్రభావానికి తీవ్రంగా లోనయ్యింది. ఉన్నత సృజనాత్మక కళకు అంతఃచేతనను మేల్కొలిపే పద్ధతిగా డాలీ పేర్కొనిన పారనాయిక్-క్రిటికల్ పధ్ధతిని అధివాస్తవికులు కొనియాడారు.[7][8]

ఇంతలో, తన తండ్రితో డాలీ యొక్క సంబంధం భగ్నం కాబోయింది. డాన్ సాల్వడార్ డాలీ వై క్యూసి, గాలాతో తనకుమారుని సంబంధాన్ని గట్టిగా తిరస్కరించారు, మరియు అధివాస్తవికులతో అతనిసంబంధం అతని నైతికవిలువలపై చెడుప్రభావంగా గుర్తించారు. డాన్ సాల్వడార్, బార్సిలోనా యొక్క ఒక వార్తాపత్రికలో పారిస్ లో తనకుమారుని ఇటీవలి ప్రదర్శనలో "కొన్నిసార్లు, నేను సరదాకొరకు నాతల్లియొక్క చిత్రంపై ఉమ్మేస్తాను" అనే రెచ్చగొట్టే వ్రాతతో ఉన్న "క్రీస్తు యొక్క పవిత్ర హృదయం" చిత్రంగురించి చదివినపుడు చివరి అడ్డుపుల్ల పడింది.[ఆధారం కోరబడింది]

అవమానంతో, డాన్ సాల్వడార్ తన కుమారుడు ఆవ్యాఖ్యలను బహిరంగంగా ఉపసంహరించుకోవాలని కోరారు. బహుశా అధివాస్తవిక సమూహం నుండి బహిష్క్రతుడవుతాననే భయంతో డాలీ దీనిని తిరస్కరించారు, ఫలితంగా తన తండ్రి గృహం నుండి 1929 డిసెంబరు 28న బలవంతంగా గెంటివేయబడ్డారు. ఆయన తండ్రి తన వారసత్వంనుండి తొలగిస్తానని, తిరిగి ఎప్పుడూ కాడక్వేస్ లో కాలుమోపనని చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా డాలీ తన స్వంత వీర్యం కలిగిన కండోమ్ ను తండ్రికిపంపి ఈవిధంగా అన్నట్లు చెప్పబడింది "దీనిని తీసుకో". నేను నీకు ఏవిధంగాను ఋణపడి లేను!"[ఆధారం కోరబడింది] తరువాత వేసవిలో, డాలీ మరియు గాలా సమీపంలోని పోర్ట్ ల్లిగాట్ తీరంలో ఒక మత్స్యకారుని చిన్నఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆయన ఆ ప్రదేశాన్ని కొని, కొన్ని సంవత్సరాలలో దానిని విస్తరించి, క్రమంగా తనకు అత్యంత ప్రీతిపాత్రమైన భవంతిని సముద్రతీరాన నిర్మించారు.

1931లో, డాలీ తన అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో ఒకటైన, ది పర్సిస్టెన్స్ అఫ్ మెమరీ ని చిత్రించారు.[23] ఇది మృదువుగా, జారిపోతున్న జేబు గడియారముల అధివాస్తవిక చిత్రములను పరిచయం చేసింది. కాలం కఠినమైనది మరియు నిర్ణయాత్మకమైనది అనే భావనకు తిరస్కారంగా ఈ మృదువైన గడియారాలు ఉన్నాయని ఈ చిత్రం యొక్క సాధారణ వ్యాఖ్యానం. ఈ భావనను ఈ చిత్రంలోని విశాలమైన ప్రకృతిదృశ్యం, కీటకాలు మ్రింగివేస్తున్నట్లు చూపబడిన ఇతర పనిచేయని గడియారాలవంటివి బలపరుస్తున్నాయి.[24]

1929నుండి కలిసి నివసించిన డాలీ మరియు గాలా 1934లో ఒక పౌర వేడుకలో వివాహం చేసుకున్నారు. వారు తిరిగి కాథలిక్ పద్ధతిలో 1958లో వివాహం చేసుకున్నారు.

1934లో డాలీ కళాఖండాల విక్రేత అయిన జూలియన్ లెవీ ద్వారా అమెరికాకు పరిచయమయ్యారు. పర్సిస్టెన్స్ అఫ్ మెమరీ తో సహా, న్యూ యార్క్ లో డాలీ చిత్రాల ప్రదర్శన వెంటనే సంచలనాన్ని సృష్టించింది. సోషల్ రిజిస్టర్ సభ్యులు ఆయనకు ప్రత్యేకంగా నిర్వహించబడిన "డాలీ బాల్"లో విందు ఇచ్చారు. ఆయన ఛాతీపై గాజులో బిగించిన లోదుస్తులను ధరించి ప్రత్యక్షమయ్యారు.[25] అదే సంవత్సరంలో, డాలీ మరియు గాలా న్యూ యార్క్ లో వారికొరకు వారసురాలు కారేస్సే క్రోస్బీ ఆతిధ్యం ఇచ్చిన మారువేషాల పార్టీకి హాజరయ్యారు. వారి వస్త్రధారణగా, వారు లిండ్బర్గ్ బేబీ మరియు అతనిని బలవంతంగా ఎత్తుకుపోయేవాని దుస్తులు ధరించారు. దాని ఫలితంగా పత్రికలలో వ్యక్తమైన తీవ్ర గందరగోళానికి డాలీ క్షమాపణలు కోరారు. అతను పారిస్ కి తిరిగిరాగానే, ఒక అధివాస్తవ చర్యకు క్షమాపణ కోరినందుకు అధివాస్తవికులు అతనిని నిలదీశారు.[26]

అధికభాగం అధివాస్తవిక కళాకారులు వామపక్ష రాజకీయాలతో సంబంధాన్ని పెంచుకోగా, డాలీ రాజకీయాలు మరియు కళల మధ్య సంబంధ విషయంపై అస్పష్ట వైఖరిని ప్రదర్శించారు. ప్రముఖ అధివాస్తవికవాది ఆండ్రీ బ్రిటన్ డాలీని "హిట్లర్ తరహా"లో "నూతన" మరియు "ఆహేతుకమైన" దానిని కాపాడుతున్నారని ఆరోపించారు, కానీ డాలీ వెంటనే ఈఆరోపణను ఖండిస్తూ, "నేను వాస్తవంగా లేదా ఉద్దేశపూర్వకంగా హిట్లేరియన్ ను కాను" అనిచెప్పారు.[27] అధివాస్తవికవాదం రాజకీయాలకు అతీతంగానే మనుగడ సాగించగలదని నొక్కిచెపుతూ బహిరంగంగా ఫాసిజాన్ని ఆక్షేపించడాన్ని తిరస్కరించారు.[ఆధారం కోరబడింది] ఇతరవిషయాలతో పాటు, ఇది అతని సహాధ్యాయులతో సమస్యలకు దారితీసింది. తరువాత 1934లో, డాలీ ఒక "విచారణ"ను ఎదుర్కొని, లాంఛనంగా అధివాస్తవిక సమూహంనుండి బహిష్కరింపబడ్డాడు.[22] దీనికి డాలీ, "నాకు నేనే అధివాస్తవికవాదం" అని జవాబిచ్చారు.[17]

1936లో, డాలీ లండన్ ఇంటర్నేషనల్ సర్రియలిస్ట్ ఎక్జిబిషన్లో పాల్గొన్నారు. Fantomes paranoiaques authentiques అనే శీర్షికగల ఆయన ఉపన్యాసం, లోతు-సముద్ర ఈత దుస్తులు మరియు శిరస్త్రాణం(హెల్మెట్) ధరించి ఇవ్వబడింది.[28] ఒక బిలియర్డ్స్ క్యూని మోసుకుంటూ రెండు రష్యన్ వోల్ఫ్ హౌండ్స్ వెంటబెట్టుకొని వచ్చినపుడు, శ్వాసకొరకు ఇబ్బందిపడగా హెల్మెట్ ను తొలగించవలసివచ్చింది. దీనిపై స్పందిస్తూ "నేను కేవలం మానవ మెదడులోకి 'లోతుగా మునిగాను' అని చూపదలచుకున్నాను", అని చెప్పారు.[29]

1936లోనే, జోసెఫ్ కార్నెల్ యొక్క చిత్రం రోజ్ హోబర్ట్ ప్రారంభ ప్రదర్శనను న్యూ యార్క్ నగరంలోని జూలియన్ లేవీ'స్ గాలరీలో ఏర్పాటుచేసినపుడు మరొక సంఘటనతో డాలీ ప్రసిద్ధుడయ్యాడు. లెవీ యొక్క లఘు అధివాస్తవిక చిత్రాల ప్రదర్శన మరియు మ్యూజియం అఫ్ మోడరన్ ఆర్ట్లో డాలీ చిత్రాలను కలిగిన మొదటి అధివాస్తవిక ప్రదర్శన రెండూ ఒక సమయంలో తటస్థించాయి. చిత్ర ప్రదర్శనలో ప్రేక్షకుడిగాఉన్న డాలీ, సగం చిత్రం ముగిసేసరికి, ఆవేశంతో ప్రొజెక్టర్ ను తన్నారు. “ఒక చలనచిత్రంకొరకు నాకుకూడా ఇదేవిధమైన ఆలోచనఉంది, నేను దానిని నిర్మించడానికి తగినధనం చెల్లించగలవారికి ప్రతిపాదన చేద్దామనుకున్నాను,” అని చెప్పారు. "నేను దానిని ఎక్కడా వ్రాయలేదు లేక ఎవరికీ చెప్పలేదు, కానీ అతను దానిని దొంగిలించినట్లే ఉంది". డాలీ ఆరోపణల ఇతర రూపాలు మరింత కవితాత్మకంగా ఉన్నాయి: "అతను నా ఉపచేతన నుండి దొంగిలించాడు!" లేదా ఇంకా "నా కలలను దొంగిలించాడు!"[30]

ఈదశలో, లండన్ లో గొప్ప ధనవంతుడైన ఎడ్వర్డ్ జేమ్స్ డాలీ యొక్క ముఖ్య పోషకుడు. ఆయన డాలీ చిత్రాలను కొనుగోలుచేసి కళాప్రపంచంలో అభివృద్ధిచెందటానికి సహాయపడి రెండు సంవత్సరాలపాటు ఆర్థిక సహాయాన్ని అందించాడు. వారు మంచి స్నేహితులయ్యారు, డాలీ తన స్వాన్స్ రిఫ్లెక్టింగ్ ఎలిఫెంట్స్ వర్ణచిత్రంలో జేమ్స్ ను చిత్రీకరించాడు. అధివాస్తవిక ఉద్యమానికి రెండు శాశ్వత చిహ్నాలైన: లోబ్స్టర్ టెలిఫోన్ మరియు మే వెస్ట్ లిప్స్ సోఫాకు వారు సహకారమందించారు.[ఆధారం కోరబడింది]

1939లో, బ్రెటన్ అవమానకరమైన మారుపేరు "అవిదా డాలర్స్" అనే విపర్యయసిద్ధంను, సాల్వడార్ డాలీ కొరకు ఉపయోగించారు, మరియు ఇది "డాలర్లపై ఆసక్తి" అని అనువదించదగిన ఫ్రెంచ్ పదమైన ఆవిడే ఎ డాలర్స్ యొక్క శబ్దవ్యుత్పత్తి.[31] ఇది డాలీ చిత్రాల వ్యాపారీకరణ పెరగడాన్ని అపహాస్యం చేసింది మరియు డాలీ కీర్తి మరియు అదృష్టాలద్వారా స్వీయ-ఉన్నతిని కోరుతున్నారనే భావనను కలిగించింది. ఆ తరువాతనుండి, కొంతమంది అధివాస్తవికులు డాలీ చనిపోయినట్లుగా భూతకాలంలో మాట్లాడారు.[ఆధారం కోరబడింది] అధివాస్తవిక ఉద్యమం మరియు దాని అనేకమంది సభ్యులు(టెడ్ జోన్స్ వంటివారు)డాలీకి వ్యతిరేకంగా తీవ్రమైన వాదనలను ఆయన చనిపోయేవరకు మరియు ఆతరువాతకూడా కొనసాగించారు.

1940లో, ఐరోపాలో రెండవ ప్రపంచయుద్ధం మొదలవడంతో, డాలీ మరియు గాలా యునైటెడ్ స్టేట్స్ కు మారి, అక్కడే ఎనిమిది సంవత్సరాలపాటు నివసించారు. ఈ మార్పుతరువాత, డాలీ కాథలిసిజాన్ని అవలంబించడాన్ని తిరిగిప్రారంభించారు.

"ఈ కాలంలో, డాలీ వ్రాయడాన్ని ఎప్పుడూ ఆపలేదు," అని రాబర్ట్ మరియు నికోలస్ దెస్కర్నెస్ వ్రాసారు.[32]

1941లో, డాలీ, జీన్ గాబిన్ కొరకు మూన్ టైడ్ అనే చిత్రానికి దృశ్యరచన చేశారు. 1942లో, ఆయన తన స్వీయచరిత్ర, ది సీక్రెట్ లైఫ్ అఫ్ సాల్వడార్ డాలీని ప్రచురించారు. 1943లో న్యూ యార్క్ లోని నోడ్లెర్ గాలరీలో ప్రదర్శనవంటి తన ప్రదర్శనలకు కేటలాగులు రచించారు. ఆయన ఈవిధంగా వ్యాఖ్యానించాడు, "పూర్తి నిష్ఫలత్వం మరియు యాంత్రికీకరణ విపరీతంగా పెరిగి నిరంకుశ వ్యవస్థకు దారితీసాయనే విషయానికి ప్రయోగాత్మక ఋజువు ఇవ్వడానికైనా అధివాస్తవికత పనిచేసింది..... కళాశాల యొక్క నేటి ఉపయోగానికి చెందిన మానసిక ప్రాముఖ్యతలో ఈనాటి సోమరితనం మరియు పూర్తిగా పద్ధతిలేకపోవడం అనేవి వాటి తీవ్రస్థాయికి చేరాయి." ఆయన స్వయంచోదక వాహనాల(ఆటోమొబైల్స్) ఫాషన్ ప్రదర్శన గురించి రచించిన నవల 1944లో ప్రచురించబడింది. దీనిని ఎడ్విన్ కాక్స్ ది మయామి హెరాల్డ్ లోని ఒక చిత్రంలో, డాలీ ఒక వాహనానికి సాయంకాలపు గౌను వేస్తున్నట్లు వర్ణించారు.[32] ది సీక్రెట్ లైఫ్లో కూడా డాలీ, బన్యుఎల్, కమ్యూనిస్ట్ మరియు నాస్తికుడు కావడంవలన అతనితో విడిపోయినట్లు సూచించాడు. బన్యుఎల్ MOMA నుండి తొలగించబడ్డాడు(లేదా రాజీనామా చేసారు), న్యూ యార్క్ కు చెందిన కార్డినల్ స్పెల్మాన్ MOMAలో చలనచిత్ర విభాగ అధిపతి అయిన ఐరిస్ బార్రీని కలవడానికి వెళ్ళినపుడు ఇది జరిగిఉండవచ్చు. బన్యుఎల్ తరువాత హాలీవుడ్ కు తిరిగివెళ్లి వార్నర్ బ్రదర్స్ శబ్దానుకరణ విభాగంలో 1942 నుండి 1946 వరకు పనిచేసాడు. 1982 నాటి స్వీయచరిత్ర మోన్ దేర్నియేర్ సౌపిర్ (ఆంగ్లానువాదం మై లాస్ట్ సై ప్రచురణ 1983)లో, ఇన్నిసంవత్సరాలకాలంలో సర్దుబాటుకొరకు డాలీ ప్రయత్నాలను తాను తిరస్కరించినట్లు బన్యుఎల్ వ్రాసాడు.[33]

ఒక ఇటాలియన్ సన్యాసి, గాబ్రియేల్ మరియా బెరార్డి, 1947లో డాలీ ఫ్రాన్స్ లో ఉన్నపుడు అతనిపై భూతవైద్యం జరిపినట్లు ఆరోపించబడ్డారు.[34] 2005లో, ఈ సన్యాసియొక్క భవంతిలో శిలువపై ఉన్న క్రీస్తు విగ్రహం కనుగొనబడింది. డాలీ ఈశిల్పాన్ని తన భూతవైద్యునికి కృతజ్ఞతతో ఇచ్చారని చెప్పబడింది,[34] మరియు ఈ శిల్ప నిర్మాణశైలి డాలీదేనని నమ్మడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయని ఇద్దరు స్పానిష్ నిపుణులు నిర్ధారించారు.[34]

కటలోనియాలో తరువాత సంవత్సరాలు[మార్చు]

1949లో ప్రారంభించి, డాలీ తన తరువాత సంవత్సరాలు తనకు అత్యంత ప్రియమైన కటలోనియాలో గడిపారు. స్పెయిన్, ఫ్రాంకో పాలనలో ఉండగానే ఆయన అక్కడ నివసించడానికి ఎంపిక చేసుకోవడం ప్రగతిశీలురు మరియు ఇతరులనుండి విమర్శలను ఎదుర్కుంది.[35] అందువలన డాలీ యొక్క తరువాత చిత్రాలు కొంతమంది అధివాస్తవికులు మరియు విమర్శకులచే వాటిలోని కళాత్మక విలువలకుకాక రాజకీయ కారణాలచే కొట్టివేయబడి ఉండవచ్చు. 1959లో, ఆండ్రీ బ్రెటన్ అధివాస్తవికత యొక్క నలభయ్యవ వార్షికోత్సవ సందర్భంగా హోమేజ్ టు సర్రియలిజం అనే పేరుతో నిర్వహించిన ప్రదర్శనలో డాలీ, జోన్ మిరో, ఎన్రిక్ తాబారా, మరియు యుజేనియో గ్రానెల్ ల చిత్రాలు ఉన్నాయి. తరువాత సంవత్సరం న్యూ యార్క్ లో జరిగిన ఇంటర్నేషనల్ సర్రియలిజం ఎక్జిబిషన్ లో డాలీ యొక్క సిస్టీన్ మడోన్న చిత్రం ఉంచడానికి వ్యతిరేకంగా బ్రెటన్ తీవ్రంగా పోరాడారు.[36]

తన వృత్తివ్యాపకం యొక్క చివరిదశలో, డాలీ కేవలం వర్ణచిత్రాలకే పరిమితంకాక అనేక అసాధారణ మరియు నూతన మాధ్యమాలు మరియు ప్రక్రియలతో ప్రయోగాలు చేసాడు: ఆయన బులెటిస్ట్ చిత్రాలను తయారుచేసారు[37] మరియు త్రిమితీయ చిత్రణను కళాత్మకపద్ధతిలో ఉపయోగించిన మొట్టమొదటి కళాకారులలో ఒకరు.[38] అతని యొక్క అనేక చిత్రాలు దృశ్య భ్రాంతిని ఇముడ్చుకున్నాయి. అతని తరువాత సంవత్సరాలలో, అండీ వార్హోల్ వంటి యువ కళాకారులు పాప్ కళపై డాలీ యొక్క ముఖ్యప్రభావాన్ని ప్రకటించారు.[39] డాలీ జీవశాస్త్రం మరియు గణితంలో కూడా మంచి ఆసక్తికలవాడు. ఇది అతనియొక్క అనేకచిత్రాలలో వ్యక్తమవుతుంది, ప్రత్యేకించి 1950లలో, ఆయన తన విషయఅంశాన్ని ఖడ్గమృగం యొక్క కొమ్ములరూపం కలిగిఉన్నట్లు చిత్రీకరించాడు. డాలీ దృష్టిలో, ఖడ్గమృగం యొక్క కొమ్ము సంవర్గమాన సర్పిలాకారంలో పెరుగుతుంది కనుక అది దివ్య జ్యామితికి గూడార్ధం. ఆయన ఖడ్గమృగాన్ని పవిత్రత మరియు కన్య మేరీకి చెందిన విషయాలకు కూడా జతపరిచాడు.[40] డాలీ DNA మరియు హైపర్ క్యూబ్ (ఒక చతుర్మితీయ ఘనం)పట్ల కూడా ఆకర్షితుడయ్యాడు; క్రుసిఫిక్షన్(కార్పస్ హైపర్ క్యూబస్) వర్ణచిత్రంలో హైపర్ క్యూబ్ యొక్క అర్ధం చిత్రించబడింది.

డాలీ యొక్క రెండవ ప్రపంచాయుద్ధనంతరకాలం సాంకేతిక పరిణతి మరియు దృశ్యభ్రాంతి, శాస్త్రం మరియు మతములపట్ల ఆసక్తి అనే మైలురాళ్ళను కలిగిఉంది. అతను కాథలిక్ భక్తి పెరుగుతూవచ్చింది, అదేసమయంలో హిరోషిమా దిగ్భ్రాంతి మరియు "అణుయుగపు" ఆరంభంతో అతను ప్రేరణపొందాడు. అందువలన డాలీ ఈకాలానికి "అణు మార్మికత" అనే పేరుపెట్టారు. "ది మడోన్నా అఫ్ పోర్ట్-ల్లిగాట్" (మొదటి రూపం) (1949) మరియు "కార్పస్ హైపర్క్యూబస్" (1954) వంటి చిత్రాలలో, డాలీ క్రైస్తవ చిత్రవివరణను అణుభౌతికశాస్త్రంతో ప్రేరణపొందిన పదార్ధవిఘటన చిత్రాలతో సంశ్లేషణ చేయాలనుకున్నాడు.[41] "అణు మార్మికత"ను ప్రఖ్యాత చిత్రాలైన "లా గరే డి పెర్పిజ్ఞాన్" (1965) మరియు "హెలూసినోజెనిక్ తోరేదోర్" వంటి చిత్రాలు చూపిస్తాయి.(1968–70). 1960లో, డాలీ, తన స్వంతపట్టణమైన ఫిగ్యురెస్లో డాలీ థియేటర్ మరియు మ్యూజియం యొక్క పని ప్రారంభించాడు; అది 1974లో అతను తన శక్తినంతా కేంద్రీకరించి చేపట్టిన ఏకైక అతిపెద్ద కార్యక్రమం. అతను-1980ల మధ్యవరకూ దానికి అదనపు కూర్పులుచేయడం కొనసాగించాడు.[ఆధారం కోరబడింది]

1968లో, డాలీ, లన్విన్ చాకోలెట్స్ కొరకు ఒక టెలివిజన్ ప్రకటనను చిత్రీకరించాడు,[42] మరియు 1969లో చుపా చుప్స్కు చిహ్నాన్ని రూపొందించాడు. 1969లో, 1969 యూరోవిజన్ సాంగ్ కాంటెస్ట్ యొక్క ప్రచారఅంశాన్ని సృజించడానికి బాధ్యతవహించి, మాడ్రిడ్ లోని టెట్రో రియల్ యొక్క రంగస్థలంపై నిలబెట్టబడిన పెద్ద లోహశిల్పాన్ని తయారుచేసాడు.

1972లో డాలీ

2007 జూన్ 3లో ఛానల్ 4లో ప్రసారమైన డర్టీ డాలీ: ఎ ప్రైవేట్ వ్యూ అనే కార్యక్రమంలో కళావిమర్శకుడు బ్రియాన్ సెవెల్ 1960ల చివరిలో డాలీతో తన పరిచయాన్ని వివరించారు, క్రీస్తుబొమ్మ యొక్క బాహుమూలములో పిండస్థితిలో పంట్లాములు లేకుండా డాలీ కొరకు జననాంగములు నలుపగా, ఆయన ఛాయాచిత్రాలు తీస్తున్నట్లు నటిస్తూ తన పంట్లాములో చేతులుజొనిపి వికృత చేష్టలు చేసారని చెప్పారు.[43][44]

1980లో, డాలీ ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణించింది. అతని ప్రియమైన-వృద్ధ పత్ని, గాలా, అతనికి సూచించబడని ప్రమాదకరమైన ఔషధ మిశ్రమాన్ని ఇవ్వగా అది, అతని నాడీవ్యవస్థను దెబ్బతీసి, చివరికి అతని కళాసామర్ధ్యం అంతమవడానికి కారణమైంది. 76 సంవత్సరాల వయసుగల డాలీ శిథిలమయ్యాడు, మరియు పార్కిన్సన్ -వంటి లక్షణాలతో అతని కుడిచేయి తీవ్రంగావణికిపోయింది.[45]

1982లో, కింగ్ యువాన్ కార్లోస్ డాలీకి మర్క్విస్ అఫ్ ప్యుబోల్ అనే బిరుదును స్పెయిన్ యొక్క గౌరవసూచకంగా ఇచ్చారు, తరువాత తనను మరణశయ్యపై సందర్శించినపుడు, డాలీ ఆయనకు ఒక చిత్రాన్ని (హెడ్ అఫ్ యూరోప, డాలీ యొక్క చివరి చిత్రం)ఇచ్చి బదులుతీర్చుకున్నాడు.

ఫిగురెస్ లో సాంత్ పెరె, డాలీ యొక్క బాప్టిజం, మొదటి సహవాసం, మరియు అంత్యక్రియల దృశ్యం
ఫిగురెస్ లో డాలీని ఖననంచేసిన డాలీ థియేటర్ అండ్ మ్యూజియం
డాలీ థియేటర్ అండ్ మ్యూజియంలో అతని వివరాలను కలిగిన సమాధి

గాలా, 1982 జూన్ 10న మరణించారు. గాలా మరణం తరువాత, డాలీకి జీవించాలనేకోరిక చాలావరకు తగ్గిపోయింది. ఆయన తనకుతాను నిర్జలీకరణ చేసుకున్నాడు, బహుశా ఆత్మహత్యాప్రయత్నం కావచ్చు, లేదా ఆయన ఇంతకుముందు చదివినట్లు కొన్నిసూక్ష్మ జీవులు చేయగలవని భావించిన అనిశ్చల చేతనాస్థితిలోఉండే ప్రయత్నంలోకావచ్చు. ఆయను ఫిగ్యురెస్ నుండి తాను గాలా కొరకు కొన్న మరియు ఆమె మరణించిన ప్రదేశమైన, ప్యుబోల్ లోనిభవనంలోకి మారాడు. 1984లో, అనిశ్చిత పరిస్థితులలో[46] ఆయన పడకగదిలో అగ్నిప్రమాదం జరిగింది. అది బహుశా డాలీచే ఆత్మహత్యాప్రయత్నం కావచ్చు, లేదా బహుశా కేవలం సిబ్బంది నిర్లక్ష్యం కావచ్చు.[17] ఏదేమైనా, డాలీ కాపాడబడి ఫిగ్యురెస్ కి తిరిగివచ్చాడు, అక్కడ అతని స్నేహితులు, పోషకులు మరియు సాటి కళాకారుల యొక్క సమూహం అతని చివరిసంవత్సరాలు ధియేటర్-మ్యూజియంలో సౌకర్యవంతంగా జీవించేటట్లు చూసారు.

డాలీ యొక్క సంరక్షకులు, అతని మరణం తరువాత కూడా, అతని స్వంత చిత్రాల వలె అమ్ముటకు, అతనిచే బలవంతంగా ఖాళీ కేన్వాస్ లపై సంతకం చేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.[47] దీనిఫలితంగా, చిత్రాల అమ్మకందారులు డాలీకి ఆపాదించబడిన చివరి చిత్రాలపట్ల జాగ్రత్తపడతారు.[ఆధారం కోరబడింది]

నవంబరు 1988లో డాలీ, హృదయవైఫల్యంతో ఆసుపత్రిలో చేరాడు మరియు 1988 డిసెంబరు 5న కింగ్ యువాన్ కార్లోస్ డాలీపట్ల ఎల్లపుడూ తీవ్రఅభిమానం కలిగిఉన్నానని ప్రకటించారు.[48]

84 సంవత్సరాల వయసులో, 1989 జనవరి 23న తన అభిమాన రికార్డు ట్రిస్టాన్ అండ్ ఇసోల్దే వింటూ, హృదయవైఫల్యంతో ఫిగ్యురెస్ లో మరణించాడు, చివరికి వృత్తం ఆవృతమై, ఫిగ్యురెస్ లోని తన టెట్రో మ్యూజియోలోని గోతిలో ఖననంచేయబడ్డాడు. ఈ ప్రదేశం, అతను బాప్టిజం, మొదటి సహవాసం పొంది, మరియు అంత్యక్రియలు జరిగిన సాంట్ పెరె చర్చిఉన్న వీధికి ఆవలివైపున, మరియు అతను జన్మించిన ఇంటికి మూడు భవనసముదాయాలకు అవతలఉన్నది.[49]

ది గాలా-సాల్వడార్ డాలీ ఫౌండేషన్ ప్రస్తుతం అధికారికంగా అతని ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది.[50] గాలా-సాల్వడార్ డాలీ ఫౌండేషన్ యొక్క U.S. కాపీరైట్ ప్రతినిధిగా ఆర్టిస్ట్స్ రైట్స్ సొసైటీ ఉంది.[51] వారి రక్షణలోఉన్న ప్రత్యేక కళారూపాల భాగాలను అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపిస్తూ, 2002లో, ఈసొసైటీ గూగుల్ను డాలీ యొక్క జ్ఞాపకచిహ్నంగా తాముఉంచుకున్న గుర్తును తొలగించవలసినదిగా కోరినపుడు వార్తలలోకి ఎక్కింది. గూగుల్ ఈ విన్నపానికి అంగీకరించింది, కానీ కాపీరైట్ ఉల్లంఘనను తిరస్కరించింది.[ఆధారం కోరబడింది]

ప్రతీకవాదం[మార్చు]

డాలీ తన చిత్రాలలో విస్తృతమైన ప్రతీకవాదాన్ని వినియోగించారు. ఉదాహరణకు, ది పర్సిస్టెన్స్ అఫ్ మెమరీలో మొదట కనిపించే హాల్ మార్క్ "సాఫ్ట్ వాచెస్" కాలం సాపేక్షమైనది మరియు స్థిరమైనదికాదనే ఐన్ స్టీన్ యొక్క సిద్ధాంతాన్ని సూచిస్తాయి.[24] గడియారాలు ఈవిధంగా ప్రతీకాత్మకంగా పనిచేయడమనే భావన డాలీకి ఆగస్టులో వేడిగాఉన్న ఒకరోజున కారిపోతున్న కామేమ్బెర్ట్ చీస్ ముక్కను అలంకరించేటపుడు కలిగింది.[52]

డాలీ యొక్క చిత్రాలలో ఏనుగు కూడా పునరావృతం అవుతుంది. అది మొదటిసారి ఆయన 1944 చిత్రం డ్రీం కాజ్డ్ బై ది ఫ్లైట్ అఫ్ ఎ బీ అరౌండ్ ఎ పోమేగ్రనేట్ ఎ సెకండ్ బిఫోర్ అవేకెనింగ్లో కనిపిస్తుంది. రోమ్ లోని గియన్ లోరెంజో బెర్నిని యొక్క పురాతన స్తంభాన్ని మోస్తున్న ఏనుగు యొక్క శిల్ప ఆధారంతో ప్రేరణపొందిన ఈ ఏనుగులు,[53] "పొడవైన, అనేక కీళ్ళుకలిగి, దాదాపు అదృశ్యమైన కోరికల కాళ్ళు"[54] కలిగి, వాటి వీపులపై రాతిస్తంభాలను కలిగినట్లుగా చిత్రించబడ్డాయి. తమ పెళుసైన కాళ్ళతో జతకలిసిన చిత్రంతో, ఈ భారాలు, వాటి లింగ ఉపలక్షణచిహ్నాలుగా, ఒక మిధ్యావాస్తవిక భావనను సృష్టిస్తాయి. ఒక విశ్లేషణ వివరించినట్లు "ఏనుగు అంతరిక్షంలో ఒక వక్రీకరణ," "రూపంతో భారరహితస్థితి అనే భావనకు విరుద్ధంగా దాని స్తంభాలవంటి కాళ్ళు ఉన్నాయి".[54] "నేనువేసే వర్ణచిత్రాలు నన్ను ఆనందంకొరకు మరణించేటట్లుచేస్తాయి, స్వల్పంగానైనా రసాత్మక భావన లేకుండా, నేను పరిపూర్ణ సహజత్వంతో సృజిస్తాను, నాకు గాఢమైన భావావేశంతో స్ఫూర్తినిచ్చే చిత్రాలను తయారుచేస్తాను మరియు వాటిని నిజాయితీగా చిత్రించడానికి ప్రయత్నిస్తాను." —సాల్వడార్ డాలీ, డాన్ అడెస్ లో, డాలీ అండ్ సుర్రియలిజం .

గ్రుడ్డు మరియొక సాధారణ డాలిస్క్యూ చిత్రం. ఆయన గ్రుడ్డును జననపూర్వ మరియు గర్భాశయాంతర దశతో సంధానించి, దానిని ఆశ మరియు ప్రేమల చిహ్నంగా ఉపయోగించాడు;[55] అది ది గ్రేట్ మాస్టుర్బేటర్ మరియు ది మెటామార్ఫోసిస్ అఫ్ నార్సిస్సస్ లలో కనిపిస్తుంది. ఆయన చిత్రాలన్నిటిలో అనేక జంతువులు కనిపిస్తాయి: చీమలు మృత్యువు, క్షయము, మరియు తీవ్ర కామవాంఛలను సూచిస్తాయి; నత్త మానవునితలను సూచిస్తుంది(ఆయన సిగ్మండ్ ఫ్రాయిడ్ను మొదటిసారి కలసినపుడు ఫ్రాయిడ్ ఇంటిబయట ఒక నత్తను సైకిల్ పై చూసారు); మరియు మిడుతలు వ్యర్ధత మరియు భయచిహ్నాలు.[55]

వర్ణచిత్రాలు కాక ఇతర ప్రయత్నాలు[మార్చు]

ఫిలిపే హల్స్మన్ చే తీయబడిన ది డాలీ అటోమికస్ అనే ఫోటో(1948), దానికి ఆసరాగా ఉంచిన తీగలు తొలగించకముందు చూపబడినది

డాలీ ఒక బహుముఖ కళాకారుడు. అధిక ప్రసిద్ధిచెందిన ఆయన కళాక్రియలలో శిల్పాలు మరియు ఇతర వస్తువులు ఉన్నాయి, ఇతర రంగాలతోపాటు నాటకరంగం, ఫాషన్, మరియ ఛాయాచిత్రణ రంగాలలో ఆయన గుర్తించబడ్డాడు.

అధివాస్తవిక ఉద్యమంలో అత్యంత ప్రసిద్ధిచెందిన రెండు వస్తువులైన లోబ్స్టర్ టెలిఫోన్ మరియు మే వెస్ట్ లిప్స్ సోఫా, డాలీచే వరుసగా 1936 మరియు 1937లలో పూర్తిచేయబడ్డాయి. అధివాస్తవిక కళాకారుడు మరియ పోషకుడు ఎడ్వర్డ్ జేమ్స్ ఈ రెండిటినీ డాలీ నుండి పొందాడు; జేమ్స్ తనకు ఐదుసంవత్సరాల వయసుఉన్నపుడు వెస్ట్ డీన్, వెస్ట్ సస్సేక్స్లో ఆంగ్ల భవంతిని వారసత్వంగా పొందాడు మరియు 1930లలో అధివాస్తవికతను బలపరచినవారిలో ముందున్నాడు.[56] టటే గాలరీలో లోబ్స్టర్ టెలిఫోన్కు ఈవిధంగా వ్రాయబడింది, "లోబ్స్టర్స్ మరియు టెలిఫోన్ లు బలమైన సంభోగ విశేషార్దాలుగా [డాలీ కి]ఉన్నాయి," "మరియు ఆయన ఆహారం, సంభోగంల మధ్య సమీప సామ్యాన్ని చిత్రీకరించాడు."[57] టెలిఫోన్ క్రియాత్మకమైనది, జేమ్స్, డాలీ నుండి నాలుగు ఫోన్ లను కొని తన విశ్రాంతిగృహంలో పాతవాటి స్థానంలో ఉంచాడు. ఒకటి ప్రస్తుతం టటే గాలరీలో కనిపిస్తుంది; రెండవది ఫ్రాంక్ఫర్ట్ లోని జర్మన్ టెలిఫోన్ మ్యూజియంలో ఉంది; మూడవది ఎడ్వర్డ్ జేమ్స్ ఫౌండేషన్ కు చెందినది; మరియు నాల్గవది నేషనల్ గాలరీ అఫ్ ఆస్ట్రేలియాలో ఉంది.[56]

చెక్క మరియు సాటిన్ వస్త్రంతో చేసిన మే వెస్ట్ లిప్స్ సోఫా, డాలీ అభిమాననటి అయిన మే వెస్ట్ పెదవుల ఆకారంలో చేయబడింది.[22] దీనికి ముందు డాలీ యొక్క 1935 వర్ణచిత్రం ది ఫేస్ అఫ్ మే వెస్ట్కు కూడా వెస్ట్ కర్తగా ఉన్నారు. మే వెస్ట్ లిప్స్ సోఫా ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని బ్రిఘ్టన్ అండ్ హొవ్ మ్యూజియంలో ఉంది.

1941 మరియు 1970ల మధ్య డాలీ 39 నగలతో ఒక సమాహారాన్ని నిర్మించాడు. ఈ నగలు చాలా క్లిష్టమైన రూపకల్పనతో కొన్ని కదిలేభాగాలను కూడా కలిగిఉన్నాయి . అత్యంత ప్రసిద్ధిచెందిన నగ, "ది రాయల్ హార్ట్," బంగారంతో చేయబడి 46 కెంపులు, 42 వజ్రాలు, మరియు నాలుగు పచ్చలు పొదగబడింది మరియు దాని మధ్యభాగం నిజమైన హృదయం వలెనె "స్పందించేటట్లు" తయారుచేయబడింది. "ప్రేక్షకులు లేకుండా, వీక్షకులు లేకుండా, ఈ నగలు తమ ఉనికికి సార్ధకత చేకూర్చలేవు. అందువలన వీక్షకుడే చివరి కళాకారుడు" అని డాలీ వ్యాఖ్యానించాడు. (డాలీ, 1959.) "డాలీ— జోయెస్" ("ది జేవెల్స్ అఫ్ డాలీ") సేకరణను స్పెయిన్ లోని కాటలోనియాలోగల డాలీ ధియేటర్ మ్యూజియం శాశ్వతప్రదర్శనలో చూడవచ్చు.

ఆ ప్రదర్శనలో, డాలీ, గార్సియా లోర్కా యొక్క 1927 శృంగారనాటిక మరియానా పినేడ కొరకు దృశ్యాన్ని సృష్టించాడు.[58] రిచర్డ్ వాగ్నర్ 1845 సంగీతనాటకం తన్న్హౌసర్ యొక్క సంగీతంపై ఆధారపడి దానికి అనుగుణంగా రూపొందించిన బచ్చనలే నృత్యంకొరకు, డాలీ రంగస్థల రూపకల్పన మరియు వచనాన్ని అందించాడు. బచ్చనలే తరువాత లాబీరింత్కు 1941లో మరియు ది త్రీ-కార్నర్డ్ హాట్కు 1949లో రంగస్థల రూపకల్పన చేసాడు.[59]

డాలీ యుక్తవయసులో చలన చిత్రాలపట్ల తీవ్రఆసక్తిని చూపి, ఆదివారాలలో ఎక్కువగా ప్రదర్శనలకు వెళ్ళేవాడు. ఆయన నిశ్శబ్దచిత్రాలు మరియు చలనచిత్ర మాధ్యమంలో చిత్రలేఖనానికి ప్రాముఖ్యత పెరుగుతున్న కాలానికిచెందినవాడు. ఛాయాచిత్రం మరియు చలనత్ర సిద్ధాంతాలకు రెండు దిశలు ఉంటాయని ఆయన నమ్మారు:"ఉన్నవి ఉన్నట్లుగా"—కెమేరా యొక్క ప్రపంచంలో నిజాలు చూపబడతాయి, మరియు "ఛాయాచిత్ర కల్పన"—అనేది కెమేరా చిత్రాన్ని చూపేపద్ధతి మరియు అది ఎంత సృజనాత్మకంగా లేదా కల్పనాత్మకంగా కనిపిస్తుందో చూపుతుంది.[60] డాలీ చిత్ర ప్రపంచంలో దృశ్యాలకు ముందు మరియు నేపథ్యంలో కూడా చురుకుగా ఉండేవాడు. ఆయన వాల్ట్ డిస్నీ యొక్క సహకారంతో నిర్మించిన డెస్టినో వంటి కళాత్మక చిత్రాలను కూడా సృష్టించాడు. లూయిస్ బున్యుఎల్ యొక్క అధివాస్తవిక చిత్రం అన్ చిఎన్ అన్డలౌకు సహసృష్టికర్తగా కూడా ఆయన పేరుపొందాడు, లూయిస్ బున్యుఎల్ తో సహరచన చేసిన ఈ 17నిమిషాలచిత్రం, దాని ప్రారంభదృశ్యములో మానవుని కనుగుడ్డుని ఒక కత్తితో నరుకుతున్నట్లు ఉండే రేఖాచిత్ర సన్నివేశానికి గుర్తుంచుకోబడుతుంది. ఈ చిత్రంతో డాలీ స్వతంత్ర చిత్రప్రపంచంలో ప్రసిద్ధిచెందారు. అన్ చిఎన్ అన్డలౌ వాస్తవప్రపంచంలో తన కలవంటి లక్షణాలను సృష్టించుకోగల డాలీయొక్క పద్ధతిని చూపుతుంది. వీక్షకులను, వారు అంతకుముందు చూస్తున్న దృష్టినుండికాక వేరొక పూర్తిభిన్నమైన దిశలోకి తీసుకువెళ్తూ చిత్రాలు మరియు దృశ్యాలు మారుతూఉంటాయి. బున్యుయేల్ తో కలిసి అతను నిర్మించిన రెండవచిత్రం L’age d’or, ఇది పారిస్ లో 1930లో స్టూడియో 28లో ప్రదర్శించబడింది. L’age d’or "పారిస్ లో ప్రదర్శిస్తున్న థియేటర్లో ఫాసిస్ట్ మరియు సెమెటిక్-వ్యతిరేక గుంపులు ఈచిత్రానికి వ్యతిరేకంగా దుర్వాసన వెదజల్లే బాంబులు మరియు సిరా-చల్లటంవంటి వాటితో దాడిచేయడంతో దీనిని కొన్ని సంవత్సరాలపాటు నిలిపివేశారు."[61] సమాజం యొక్క నకారాత్మకఅంశాలు డాలీ జీవితంలో ప్రవేశించి అతని యొక్క కళాక్రియల విజయాలను స్పష్టంగా ప్రభావితం చేసినప్పటికీ, అవి అతని కళలో తన స్వంతభావనలను మరియు నమ్మకాలను ప్రతిఫలించకుండా ఆపలేకపోయాయి. అన్ చిఎన్ అన్దలౌ మరియు ఎల్’ఏజ్ ది’ఓర్ చిత్రాలు రెండూ స్వతంత్ర అధివాస్తవ చిత్రోద్యమంపై తీవ్రప్రబావాన్ని కలిగించాయి. "అచేతన రంగంలో అధివాస్తవికత యొక్క సాహసాల ఉన్నత నమోదుగా అన్ చిఎన్ అందాలౌ నిలువగా, ఎల్'ఏజ్ ది'ఓర్" అత్యంత శక్తివంతమైన మరియు అదుపుచేయలేని విప్లవాత్మక ఉద్దేశం యొక్క వ్యక్తీకరణ."[62]

డాలీ అల్ఫ్రెడ్ హిచ్కాక్ వంటి ఇతర ప్రసిద్ధ చిత్రతయారీదారులతో కూడా కలసి పనిచేసాడు. అతని చిత్ర కార్యకలాపాలలో అల్ఫ్రెడ్ హిచ్ కాక్ యొక్క స్పెల్ బౌండ్ చిత్రంలో పూర్తిగా మనస్తత్వవిశ్లేషణ విషయాలతో పరిశోధించిన కల దృశ్యం అత్యంత ప్రసిద్ధిచెందింది. హిచ్కాక్ తన చిత్రానికి కలవంటి లక్షణాన్ని కోరుకున్నారు, ఇది, అణచిపెట్టబడిన అనుభవం మనోదౌర్బల్యాన్ని పెంచుతుందనే భావనతో వ్యవహరిస్తుంది, తన చిత్రంకొరకు తాను కోరుకున్న వాతావరణాన్ని సృష్టించడానికి డాలీ పనితనం ఉపయోగపడుతుందని ఆయనకుతెలుసు. ఆయన కోయాస్ అండ్ క్రియేషన్ అనే డాక్యుమెంటరీ చిత్రంపై కూడా పనిచేసారు, దానిలోఉన్న అనేక కళాత్మక సూచనలు డాలీయొక్క దృష్టిలో కలను అర్ధంచేసుకోవడానికి సహాయపడతాయి. ఆయన డిస్నీ కార్టూన్ నిర్మాణసంస్థ డెస్టినో తో కలసిపనిచేసాడు. 2003లో బాకర్ బ్లడ్వర్త్ మరియు రాయ్ డిస్నీలతో పూర్తిచేయబడిన ఈ చిత్రం, ఎగురుతూ మరియు నడుస్తూఉండే అనేక కలల వంటి వింతదృశ్యాలను కలిగిఉంది. అది మెక్సికన్ గేయరచయిత అర్మాన్డో డోమిన్గ్వేజ్ యొక్క గీతం "డెస్టినో" అనే గీతంపై ఆధారపడిఉంది. డిస్నీ, 1946లో డాలీని, డెస్టినో నిర్మాణ సహాయంకొరకు నియమించుకొంది. వారు ఎనిమిదినెలలపాటు నిరంతరంగా సజీవచిత్రాలతో పనిచేసి, తాము ఆర్థికపరమైనఇబ్బందులలో ఉన్నామని గ్రహించినపుడు ఆగిపోయారు. వారి సజీవచిత్రాన్ని పూర్తిచేయడానికి మరింతద్రవ్యం వారివద్ద లేదు; ఏదేమైనా, అది చివరికి పూర్తికాబడి, అనేక చిత్రోత్సవాలలో ప్రదర్శితమైనది. డాలీ యొక్క కళాత్మకక్రియ డిస్నీ యొక్క సాంప్రదాయ యువరాజు వంటి పాత్ర సజీవచిత్రణతో సహసంబంధం కలిగిఉండటాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. డాలీ, ఇంప్రెషన్స్ అఫ్ అప్పర్ మంగోలియా (1975)అనే మరొక చిత్రాన్ని మాత్రమే తన జీవితకాలంలో పూర్తిచేయగలిగాడు, దీనిలో ఆయన రాక్షస విభ్రమ పుట్టగొడుగుల పరిశోధన గురించి ఒకకథను వివరిస్తాడు. డాలీ అనేకవారాలుగా మూత్రవిసర్జన చేస్తున్న బాల్ పాయింట్ కలము యొక్క ఇత్తడిపట్టీపై ఉన్న అతిసూక్ష్మమైన యూరిక్ ఆమ్ల మరకలపై ఈ రూపాలు ఆధారపడ్డాయి.[63]

డాలీ, ఫాషన్ మరియు చాయాచిత్ర పరిశ్రమపై కూడా ఒక నివేదికను తయారుచేసారు. ఫాషన్ రంగంలో, ఇటాలియన్ ఫాషన్ రూపకర్త ఎల్సా స్కియపరేల్లితో ఆయన సహకారం అత్యంత ప్రసిద్ధిచెందింది, స్కియపరేల్లి డాలీని తెల్ల లోబ్ స్టర్ ముద్రణ దుస్తులను తయారుచేయడానికి నియమించుకున్నది. డాలీ ఆమెకొరకు చేసిన ఇతర రూపకల్పనలలో బూటు-రూపంలోని టోపీ మరియు బకెల్ కొరకు గులాబీరంగు పెదవులుగల బెల్ట్ ఉన్నాయి. ఆయన వస్త్రాల మరియు పరిమళ ద్రవ్యాల సీసాల యొక్క తయారీలోకూడా పనిచేసారు. 1950లో క్రిస్టియన్ డయర్ తో, డాలీ "2045 వ సంవత్సరానికి వస్త్రధారణ"ను ప్రత్యేకంగా రూపొందించాడు.[64] ఆయన సహకారం అందించిన ఛాయాచిత్రకారులలో మన్ రే, బ్రస్సాయి, సిసిల్ బాటన్, మరియు ఫిలిప్పే హల్స్మాన్ ఉన్నారు.

మన్ రే మరియు బ్రస్సాయితో డాలీ ప్రకృతి చిత్రీకరణ జరిపాడు; ఇతరులతో ఆయన, విస్తృత గూఢవిషయాలను పరిశోధించాడు, (హల్స్మాన్ తో కలిపి) ఆయన చిత్రం లెడా అటామికా తో ప్రేరణపొందిన డాలీ అటామికా శ్రేణి(1948)——దీనిలో ఒకచిత్రం "ఒక చిత్రకారుని యొక్క ఏటవాలు బల్ల, మూడు పిల్లులు, ఒక బాల్చీ నీళ్ళు, మరియు గాలిలో తేలే డాలీని వివరిస్తుంది."[64]

ఇరవయ్యవ శతాబ్దంలో క్వాంటం మెకానిక్స్ పుట్టుకతో అనుసరించిన మౌలికమార్పుపట్ల ఆకర్షణనుబట్టి డాలీ యొక్క శాస్త్రసందర్భ వివరణలు ఉన్నాయి. వెర్నెర్ హేసేన్బెర్గ్ యొక్క అనిశ్చిత సిద్ధాంతంతో స్ఫూర్తి పొంది, 1958లో తన "యాంటీ-మాటర్ మానిఫెస్టో"లో ఈవిధంగా వ్రాసారు: "అధివాస్తవికకాలంలో, నేను నాతండ్రి ఫ్రాయిడ్ యొక్క అంతర మరియు అద్భుత ప్రపంచాల చిత్రవర్ణన సృష్టించాలని కోరుకున్నాను. నేడు, బాహ్య మరియు భౌతికశాస్త్రాల ప్రపంచం మనస్తత్వశాస్త్రాన్ని అధిగమించింది. నేడు నాతండ్రి డాక్టర్ హేసేన్బెర్గ్."[65]

ఈ విషయంలో, 1954లో చిత్రించబడిన ది డిజ్ఇంటీగ్రేషన్ అఫ్ ది పర్సిస్టెన్స్ అఫ్ మెమరీ, తిరిగి ది పర్సిస్టెన్స్ అఫ్ మెమరీని ఆలకించడంగా, మరియు దానిని విభాగ మరియు విఘటనలుగా చిత్రించడం నూతనశాస్త్రంపట్ల డాలీ యొక్క కృతజ్ఞతకు సారాంశం వంటిది.[65]

నిర్మాణకళకు చెందిన విజయాలలో కడక్వేస్ సమీపంలోని పోర్ట్ ల్లిగాట్ నివాసంతో పాటు 1939 వరల్డ్స్ ఫెయిర్లో అనేక అసాధారణ శిల్పాలు మరియు విగ్రహాలను కలిగిన అధివాస్తవిక ప్రాంగణం డ్రీమ్ అఫ్ వీనస్ ఉన్నాయి. ఆయన సాహిత్య కృత్యాలలో ది సీక్రెట్ లైఫ్ అఫ్ సాల్వడార్ డాలీ (1942), డైరీ అఫ్ ఎ జీనియస్ (1952–63), మరియు ఓయి: ది పారనాయిడ్-క్రిటికల్ రివల్యూషన్ (1927–33) ఉన్నాయి. ఈకళాకారుడు రేఖాచిత్రాలతో విస్తృతంగా పనిచేసి, అనేక లోహముద్రలు మరియు రాతిచిత్రాలను నిర్మించాడు. అతనికి వయసు పెరుగుతున్నకొద్దీ ప్రారంభముద్రణల నాణ్యత అతని ముఖ్య వర్ణచిత్రాల నాణ్యతకు సరితూగేటట్లుగా ఉన్నప్పటికీ, వర్ణచిత్రాలపై హక్కులను అమ్ముకున్నాడు, కానీ ముద్రణల ఉత్పత్తిలోమాత్రం కల్పించుకోలేదు. దీనితోపాటు, ఎనభైలు మరియు తొంభైలలో పెద్దసంఖ్యలో నకిలీలు తయారుకాబడి, డాలీ ముద్రణ విపణిని అయోమయపరచాయి.

ఒక పూర్తి వ్యక్తిని చిత్రించడం డాలీ యొక్క అతి సాంప్రదాయేతర చిత్రణలలో ఒకటి కావచ్చు. 1965లో, ఒక ఫ్రెంచ్ నైట్ క్లబ్ లో డాలీ, పెకి డి'ఓస్లోగా కూడా పిలువబడే అమండ లియర్ అనే ఫాషన్ మోడల్ ను కలిశాడు.[66] లియర్ అతన్ని ఆశ్రితురాలై, కావ్యదేవతగా వెలిగింది[66] వారి సంబంధాన్ని గురించి అధికారిక జీవితచరిత్రలో మై లైఫ్ విత్ డాలీలో వ్రాసారు(1986).[67] తన ప్రాణం కంటే ఎక్కువగా లియర్ అతని మానవత్వానికి అధీనురాలైంది, డాలీ తన మేధస్సుతో ఆమెను మోడలింగ్ నుండి సంగీతప్రపంచంలోనికి విజయవంతంగా మార్చగలిగారు, ఆమెకు స్వీయ-ప్రదర్శనపై సలహాలను అందించి, ఆమె మూలములనుగురించి రహస్యగాధలను అల్లడానికి సహాయపడి డిస్కో-కళ సన్నివేశంతో సంచలనం సృష్టించేటట్లు చేశారు. లియర్ కు సంబంధించినంతవరకు, ఆమె మరియు డాలీలు ఒక నిర్మానుష్య పర్వత శిఖరంపై "అలౌకిక వివాహం"తో ఏకమయ్యారు.[66] డాలీ యొక్క "ఫ్రాంకెన్స్టీన్,గా సూచిస్తూ"[68] లియర్' యొక్క పేరు ఫ్రెంచ్ "ఎల్'అమంట్ డాలీ," యొక్క శ్లేష లేదా డాలీ యొక్క ప్రియురాలు అని కొందరు నమ్ముతారు. అంతకుముందున్న కావ్యదేవత, ఆండీ వార్హోల్ యొక్క ది ఫ్యాక్టరీలో చేరడానికి డాలీని విడిచివెళ్ళిన అల్ట్రా వయొలెట్ (ఇసబెల్లె కాలిన్ దుఫ్రేస్నే) స్థానాన్ని లియర్ ఆక్రమించారు.[69]

రాజకీయాలు మరియు వ్యక్తిత్వం[మార్చు]

1960ల నాటి అతని శైలిగా గుర్తింపుపొందిన ఆడంబర మీసకట్టుతో డాలీ.

సాల్వడర్ డాలీ యొక్క రాజకీయాలు అతను ఒక కళాకారుడిగా ఎదగడంలో ముఖ్యపాత్ర పోషించాయి. తన యవ్వనంలో, ఆయన అరాజకవాదాన్ని మరియు కమ్యూనిజాన్ని అంగీకరించారు, అయితే ఆయన రచనలలోని తీవ్రమైన రాజకీయ ప్రకటనలు కలిగిన కథలు ఇతర రంగాలలో తీవ్రమైన నమ్మకం కలిగినవారిని విస్మయానికి గురిచేస్తాయి. ఇది దాదా ఉద్యమంతో డాలీకిగల సంబంధంవలన ఏర్పడింది.

ఆయనకు వయసు పెరుగుతున్నకొద్దీ ఆయన రాజకీయ నమ్మకాలు మార్పుచెందాయి, ప్రత్యేకించి డాలీని ఆయన రాజకీయాలపై ప్రశ్నించినట్లు పేర్కొనబడిన ట్రోట్ స్కీయిస్ట్ ఆండ్రే బ్రెటన్ నాయకత్వంలో అధివాస్తవికత మార్పులకులోనయినపుడు ఇదిజరిగింది. 1970ల నాటి తన గ్రంథం డాలీ బై డాలీ లో, డాలి తనను తాను అరాచక మరియు ఏకస్వామ్యవాదిగా ప్రకటించుకున్నారు.

స్పానిష్ పౌరయుద్ధం మొదలవడంతో, డాలీ పోరాటం నుండి పారిపోయారు మరియు తనను ఏ వర్గంతోనైనా కలపడాన్ని ఆయన తిరస్కరించారు. అదేవిధంగా, రెండవ ప్రపంచయుద్ధం తరువాత, మూడు సంవత్సరాలు డాలీ వృద్ధిచెందిన తరువాత జార్జ్ ఆర్వెల్ డాలీని విమర్శిస్తూ "ఫ్రాన్స్ ప్రమాదంలో పడగానే ఎలుకవలె గునగున పారిపోవడం": "ఐరోపా యుద్ధం సమీపించినపుడు ఆయనకు ఒకే ముందుజాగ్రత్త ఉంది: మంచి వంట సామాగ్రి కలిగిన స్థలాన్ని ఎలా వెదకడం మరియు ప్రమాదం దానికి మరీ సమీపంలోనికి వచ్చినపుడు దానికి ఆయన త్వరగా గడియ పెట్టుకోవడం."

రెండవ ప్రపంచయుద్ధం తరువాత కాటలోనియా తిరిగివచ్చినపుడు, డాలీ నిరంకుశ ఫ్రాంకో పాలనకు దగ్గరయ్యారు. డాలీ యొక్క ప్రకటనలలో కొన్ని ఫ్రాంకో పాలనను సమర్ధించి, "వినాశకారక దళాలను స్పెయిన్ నుండి తొలగించినందుకు" ఫ్రాంకో చర్యలను అభినందించాయి.[35] డాలీ, కాథలిక్ విశ్వాసంలోకి తిరిగివచ్చి కాలం గడుస్తున్నకొద్దీ మతంతో మరింతగా మమేకమయ్యారు, బహుశా ఇది స్పానిష్ పౌరయుద్ధ సమయంలో కామ్యూనిస్ట్ లు, సామ్యవాదులు, అరాజకవాదులు దాదాపు 7,000 మంది మతాధికారులు మరియు సన్యాసినులను చంపినందుకు సూచనగా కావచ్చు.[70][71] ఖైదీలకు మరణశిక్ష విధించడాన్ని ప్రశంసిస్తూ డాలీ, ఫ్రాంకోకి తంతివార్త పంపారు.[35] ఆయన ఫ్రాంకోను వ్యక్తిగతంగా కూడా కలిసారు[72] మరియు ఫ్రాంకో మనవరాలి వర్ణచిత్రాన్ని కూడా గీసారు.

ఫ్రాంకోకు డాలీ యొక్క శ్లాఘనలు నిజమైనవా లేదా చపలమైనవా అనేది నిర్ధారణగా లేదు[ఆధారం కోరబడింది]; రోమానియన్ కమ్యూనిస్ట్ నాయకుడు నికోలే సెఔస్క్యో యొక్క మార్గదర్శకత్వాన్ని తన రాజచిహ్నాలలో భాగంగా రాజదండాన్ని స్వీకరించినందుకు ప్రశంసిస్తూ కూడా తంతివార్త పంపాడు. రొమానియన్ దినపత్రిక సైంతియ దానిలోని వ్యంగ్యతను అనుమానించకుండానే దానిని ప్రచురించింది. డాలీ యొక్క బహిరంగ అవిధేయతను చూపే అంశాలలో లోర్కా యొక్క రచనలు నిషేధించబడిన కొన్ని సంవత్సరాల తరువాత కూడా ఫెడెరికో గార్సియా లోర్కాను పొగడటాన్ని కొనసాగించడం ఒకటి.[ఆధారం యివ్వలేదు][16]

తన ఎల్లపుడూ-ఉండే పొడవైన పైవస్త్రం, ఊతకర్ర, గర్వపూరిత భావవ్యక్తీకరణ, మరియు పైకి మెలిత్రిప్పిన మైనపుపూత మీసములతో వర్ణరంజిత మరియు గంభీర ఉనికినికలిగిన డాలీ, "ప్రతి ఉదయం మేల్కొన్న తర్వాత, ఒక మధురమైన ఆనందాన్ని అనుభవిస్తాను: అది, నేను సాల్వడార్ డాలీని కావటమే" అని చెప్పినట్లు ప్రసిద్ధిలోఉంది.[73] వృత్తివినోదకారిణి అయిన చెర్ మరియు ఆమెభర్త సోనీ బోనో, యవ్వనంలో ఉన్నపుడు, న్యూ యార్క్ ప్లాజా హోటల్ లోని తన ఖరీదైన నివాసంలో డాలీచే ఇవ్వబడిన విందుకు హాజరైనపుడు, చెర్ ఒక వాలుకుర్చీలోని అసహజ ఆకృతిలోనున్న లైంగిక కంపనపరికరంపై కూర్చోవడంతో ఆమె నివ్వెరపోయారు. అభిమానులకొరకు ఆటోగ్రాఫ్ లపై సంతకం చేసేటపుడు, డాలీ వారి కలములను ఉంచేసుకునేవాడు. మైక్ వాలెస్తో 60 మినిట్స్ టెలివిజన్ ప్రదర్శనయొక్క ముఖాముఖిలో, డాలీ తననుతాను ప్రథమ పురుషలో సంబోధించుకుంటూ, నివ్వెరపోయిన వాలెస్ తో, ఒక వాస్తవ విషయంగా "డాలీ అమరుడు మరియు మృతిచెందడు" అని చెప్పాడు. మరియొక టెలివిజన్ ప్రదర్శన టునైట్ షోలో కనిపిస్తూ, డాలీ తనతో తెచ్చుకున్న ఒక తోలు ఖడ్గమృగముపై తప్ప మరే ఇతర ఆసనంపై కూర్చోవటానికి నిరాకరించాడు.[ఆధారం కోరబడింది]

డాలీ యొక్క స్వీయచరిత్రపై 1944లో చేసిన ఒక ప్రసిద్ధ సమీక్షలో, జార్జ్ ఆర్వెల్ వ్రాస్తూ, "డాలీ ఏకకాలంలో ఒక మంచి చిత్రకారుడు మరియు ఒక జుగుప్స కలిగించే మనిషని గుర్తు ఉంచుకోగలగాలి."[74]

ఎంపిక చేసిన చిత్రాల పట్టీకరణ[మార్చు]

దస్త్రం:Dali on the Rocky Steps.jpg
2005 లో సాల్వడార్ డాలీ ప్రదర్శన కొరకు మెట్లతో సహా ఒక అధివాస్తవిక ప్రవేశ ద్వారమును కలిగిన ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్.

డాలీ తన వృత్తి జీవితంలో 1,500పైగా వర్ణచిత్రాలను చిత్రించాడు[75] అదనంగా గ్రంథాలకు బొమ్మలు, రాతిముద్రణలు, రంగస్థల రూపకల్పనలు మరియు వస్త్రాలంకరణ, గొప్పసంఖ్యలో చిత్రాలు, డజన్లకొద్దీ శిల్పాలు, డిస్నీ కొరకు ఒక సజీవ వ్యంగ్యచిత్రంతో కలిపి అనేక ఇతరకార్యక్రమాలను చేపట్టారు. ఆయన 1965లో డాలీ ఇన్ న్యూ యార్క్ అనే చిత్రనిర్మాణానికి దర్శకుడు జాక్ బాండ్ కి సహకారం అందించారు. కొన్ని ప్రత్యేకసంవత్సరాలలో డాలీ యొక్క ముఖ్యమైన మరియు ప్రాతినిధ్య క్రియల కాలక్రమణిక, దానితోపాటు కొన్ని గమనికలు క్రింద ఇవ్వబడ్డాయి.[2]

క్లిఫ్ఫోర్డ్ తరలౌ సహకారంతో రచించిన కార్లోస్ లోజానో యొక్క జీవితచరిత్ర సెక్స్, సుర్రియలిజం, డాలీ, అండ్ మీ లో, డాలీ ఎప్పుడూ అధివాస్తవికవాది కాకుండాలేడని లోజానో స్పష్టం చేసారు. డాలీ తన గురించి చెప్పుకున్నట్లుగా: "నాకూ అధివాస్తవికవాదులకూ ఉన్న ఏకైకభేదం నేను అధివాస్తవికవాదిని కావడం."[31]

ఫ్లోయింగ్ యూస్లెస్లీ ఆన్ త్రీ షూస్ ; ఇదే సంవత్సరంలో, డాలీ, అల్ఫ్రెడ్ హిచ్కాక్ చిత్రంస్పెల్ బౌండ్ స్వప్న సన్నివేశానికి సహకారం అందించారు, కానీ ఉభయులూ తృప్తిచెందలేదు

డాలీ యొక్క అతిపెద్ద సేకరణ డాలీ థియేటర్ అండ్ మ్యూజియం ఫిగ్యురేస్, కాటలోనియ, స్పెయిన్, తరువాత సాల్వడార్ డాలీ మ్యూజియం సెయింట్ పీటర్స్బర్గ్, ఫ్లోరిడా, ఎ.రేనాల్డ్స్ మోర్స్& ఎలెనార్ R. మోర్స్ ల సేకరణలను కలిగిఉంది. దీనిలో 1,500 కి పైగా డాలీ చిత్రాలు ఉన్నాయి. ఇతర ప్రత్యేక గుర్తించదగిన సేకరణలలో మాడ్రిడ్ లోని రెయినా సోఫియా మ్యూజియం మరియు సాల్వడార్ డాలీ గాలరీ పసిఫిక్ పాలిసాడెస్, కాలిఫోర్నియా ఉన్నాయి. మోంట్ మార్ట్రే, పారిస్, ఫ్రాన్స్ లోని ఎస్పేస్ డాలీ, దానితోపాటు లండన్, ఇంగ్లాండ్ లోని డాలీ యూనివర్స్ పెద్దసంఖ్యలో డాలీయొక్క చిత్రాలను మరియు విగ్రహాలను కలిగిఉన్నాయి.

డాలీ యొక్క చిత్రానికి ఉండతగని చోటు న్యూ యార్క్ నగరంలోని రైకర్స్ ఐలాండ్ జైలు;అయన జైలుకు బహుకరించిన శిలువవేయడం గురించిన చిత్రం ఖైదీల భోజనశాలలో 16 సంవత్సరాలపాటు వ్రేలాడదీయబడి భద్రపరచుటకు జైలు నడవాలోనికి మార్చబడింది. దురదృష్టవశాత్తు, ఈ చిత్రం ఆప్రదేశం నుండి మార్చి 2003 లో దొంగిలించబడింది, ఇప్పటికీ కనుగొనబడలేదు.[76]

నవలలు[మార్చు]

కవి గార్సియా లోర్కా ప్రోత్సాహంతో డాలీ సాహిత్య వృత్తికి "సంపూర్ణ నవల" ద్వారా ప్రయత్నం చేసారు. తన ఏకైక సాహిత్య రచనలో, డాలీ 1930ల నాటి దిగజారుడుతనాన్ని సూచించే విలాసవంతమైన మరియు ఆడంబర జీవనశైలితో వింత పోకడలు కలిగి మిరుమిట్లు గొలిపే కులీనుల సమూహం యొక్క రహస్య తంత్రాలు మరియు ప్రేమ వ్యవహారాల గురించి, స్పష్టమైన కళ్ళకు కట్టే పదాలలో వివరిస్తారు.

గ్యాలరీ[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

 1. ఫెలాన్, జోసెఫ్, ది సాల్వడోర్ డాలీ షో
 2. 2.0 2.1 డాలీ, సాల్వడోర్. (2000) డాలీ: 16 ఆర్ట్ స్టికర్స్, కొరియర్ డోవర్ పబ్లికేషన్స్. ISBN 0-439-56827-7.
 3. Ian Gibson (1997). The Shameful Life of Salvador Dalí. W. W. Norton & Company.  అరబ్ దేశాలైన మొరాకో, ట్యునీషియా, అల్జీరియా లేక ఈజిప్ట్ లలో "డాలీ" (మరియు దాని వివిధ రూపాలు) అతిసాధారణమైన ఉపనామమని గిబ్సన్ కనుగొన్నాడు. మరొకవైపు, గిబ్సన్ ప్రకారం, డాలీ తల్లి కుటుంబం, డోమ్నెక్ ఆఫ్ బార్సేలోన, యూదు మూలాలు కలిగిఉన్నది.
 4. సలదీగా, స్టీఫెన్ ఫ్రాన్సిస్. "ది మైండ్సెట్ ఆఫ్ సాల్వడార్ డాలీ". లాంప్లైటర్ (నయాగరా యూనివర్సిటీ) . వాల్యూం. 1 నెం. 3, వేసవి 2006. జులై 22, 2007న సేకరించబడింది.
 5. జనన ధృవపత్రం మరియు "Dali Biography". Dali Museum. Dali Museum. Retrieved 2008-08-24. 
 6. డాలీ, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ సాల్వడార్ డాలీ , 1948, లండన్: విజన్ ప్రెస్, పుట.33
 7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 లోన్గ్యేరాస్, లూయిస్. (2004) డాలీ , ఎడిసియోన్స్ బి — మెక్సికో. ISBN 84-666-1343-9.
 8. 8.0 8.1 రోజస్, కార్లోస్. సాల్వడార్ డాలీ, ఆర్ ది ఆర్ట్ ఆఫ్ స్పిట్టింగ్ ఆన్ యువర్ మదర్స్ పోర్త్రైట్ , పెన్ స్టేట్ ప్రెస్(1993). ISBN 0-439-56827-7.
 9. సాల్వడార్ డాలీ. SINA.com . జూలై 13, 2007న తిరిగి పొందబడింది.
 10. astrodatabank.com లో సాల్వడార్ డాలీ బయోగ్రఫీ. సెప్టెంబర్ 30, 2006న సేకరించబడినది.
 11. 11.0 11.1 డాలీ, సీక్రెట్ లైఫ్, పుట.2
 12. "Dalí Biography 1904–1989 — Part Two". artelino.com. Retrieved 2006-09-30. 
 13. డాలీ, సీక్రెట్ లైఫ్, పుటలు.152–153
 14. 1924 నాటి అతని జైలు నమోదు ప్రకారం, వయసు 20 సంవత్సరాలు. ఏమైనప్పటికీ, అతని కేశాలంకరణకారుడు మరియు జీవితచరిత్రకారుడు అయిన లూయిస్ లోన్గ్యుయేరాస్, డాలీ 1.74 m (5 ft 8 12 in) పొడవైనవాడని చెప్పాడు.
 15. లోర్కా-డాలీల సంబంధంగురించి లోతైన సమాచారానికై ఇయాన్ గిబ్సన్ చే రచిపబడిన లోర్కా-డాలీ: ఎల్ అమోర్ క్యు నొ ప్యుడో సెర్ మరియు ది షేమ్ఫుల్ లైఫ్ ఆఫ్ సాల్వడార్ డాలీ లను చూడండి.
 16. 16.0 16.1 బోస్క్వేట్, అలైన్, కాన్వర్సేషన్స్ విత్ డాలీ , 1969. పుట. 19–20. (PDF ఫార్మాట్) (గార్సియా లోర్కా యొక్క) 'ఎస్.డి.:అందరికీ తెలిసినట్లుగా అతను స్వలింగసంపర్కి అయితే నాతో ప్రేమలోపడ్డాడు. అతను రెండుసార్లు నన్ను ఆక్రమించబోయాడు.... నాకు విపరీతమైన కోపమొచ్చింది, ఎందుకంటే నేను స్వలింగసంపర్కినికాను, పైగా నేను లొంగిపోవటానికి సిద్ధంగా లేను. ఇది నన్ను గాయపరచింది. ఫలితంగా ఏమీ జరగలేదు. కానీ నన్ను లొంగదీయటానికి ప్రయత్నించడం అలాగే నాగౌరవానికి భంగం కలిగించడం నన్ను బాధించాయి. నాలోలోపల అతను గొప్ప కవి అనేభావంతో మరియు డాలీ దివ్య మూలం గురించి కొద్దిగా ఋణపడిఉన్నాను
 17. 17.0 17.1 17.2 సాల్వడార్ డాలీ: ఓల్గాస్ గాలరీ. జూలై 13, 2007న తిరిగి పొందబడింది.
 18. వర్ణచిత్రాల గాలరీ #5
 19. హోడ్గే, నికోల, మరియు లిబ్బి అన్సన్. ది A–Z ఆఫ్ ఆర్ట్: ప్రపంచపు అతిగొప్ప మరియు అత్యంత ప్రసిద్ధులైన చిత్రకారులు మరియు వారి చిత్రాలు . కాలిఫోర్నియా: థన్డర్ బే ప్రెస్, 1996. Online citation.
 20. ఫెలాన్, జోసెఫ్
 21. కొల్లెర్, మిచెల్. Un Chien Andalou. సెన్సెస్ ఆఫ్ సినిమా జనవరి 2001. జూలై 13, 2007న తిరిగి పొందబడింది.
 22. 22.0 22.1 22.2 షెల్లీ, లాండ్రీ. "డాలీ వౌస్ క్రౌడ్ ఇన్ ఫిలడెల్ఫియా". అన్బౌండ్ (ది కాలేజ్ ఆఫ్ న్యూ జెర్సీ) వసంతకాలం 2005. జూలై 13, 2007న తిరిగి పొందబడింది.
 23. క్లోకింగ్ ఇన్ విత్ సాల్వడార్ డాలీ: సాల్వడార్ డాలీస్ మెల్టింగ్ వాచెస్ (PDF) సాల్వడార్ డాలీ మ్యూజియం నుండి. 24 ఆగస్టు 2009న పునరుద్ధరించబడింది.
 24. 24.0 24.1 సాల్వడార్ డాలీ, La Conquête de l’irrationnel (పారిస్: ఎడిషన్స్ సర్రియలిస్ట్స్, 1935), పుట. 25.
 25. కరెంట్ బయోగ్రఫీ 1940, పుటలు 219–220
 26. లూయిస్ బన్యుయేల్, మై లాస్ట్ సై: ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ లూయిస్ బన్యుయేల్ , వింటేజ్ 1984. ISBN 0-525-94980-1
 27. రాబిన్ అడ్లే గ్రీలె, సర్రియలిజం అండ్ ది స్పానిష్ సివిల్ వార్ , యాలె యూనివర్సిటీ ప్రెస్, 2006, పేజి81. ISBN 0-525-94980-1
 28. జకమాన్, రోబ్. (1989) కోర్స్ ఆఫ్ ఇంగ్లీష్ సర్రియలిస్ట్ పొయెట్రీ సిన్స్ ది 1930s , ఎడ్విన్ మెల్లెన్ ప్రెస్. ISBN 0-439-56827-7.
 29. కరెంట్ బయోగ్రఫీ 1940, పుట219
 30. ప్రోగ్రాం నోట్స్ బై యాన్డి డిత్జ్లర్(2005) అండ్ డెబొర సోలోమొన్, ఉటోపియా పార్క్ వే:ది లైఫ్ ఆఫ్ జోసెఫ్ కార్నెల్ (న్యూ యార్క్: ఫర్రార్, స్ట్రుస్, అండ్ గిరౌక్స్, 2003)
 31. 31.0 31.1 ఆర్ట్ సైక్లోపేడియా: సాల్వడార్ డాలీ. సెప్టెంబర్ 4, 2006న తిరిగి పొందబడింది.
 32. 32.0 32.1 డెస్చార్నేస్, రాబర్ట్ అండ్ నికోలస్. | సాల్వడర్ డాలీ న్యూ యార్క్: కొనేకి & కొనేకి, 1993. పుట. 35.
 33. లూయిస్ బున్యుఎల్, మై లాస్ట్ సై: ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ లూయిస్ బున్యుఎల్ (వింటేజ్, 1984) ISBN 0-8166-4387-3
 34. 34.0 34.1 34.2 డాలీస్ గిఫ్ట్ టూ ఎక్జార్సిస్ట్ అన్కవర్డ్ కాథోలిక్ న్యూస్ అక్టోబర్ 14, 2005
 35. 35.0 35.1 35.2 నవర్రో, విసెంటే, Ph.D. "ది జాక్బూట్ ఆఫ్ దాదా: సాల్వడార్ డాలీ, ఫాసిస్ట్". కౌంటర్పంచ్ . డిసెంబరు 4, 2009. జులై 22, 2007న సేకరించబడింది.
 36. లోపెజ్, ఇగ్నాషియో జేవియేర్. ది ఓల్డ్ ఏజ్ ఆఫ్ విలియం టెల్ (ఎ స్టడీ ఆఫ్ బన్యుఎల్స్ త్రిస్తాన) . MLN 116 (2001): 295–314.
 37. The Phantasmagoric Universe—Espace Dalí À Montmartre. Bonjour Paris. 24 ఆగస్టు 2009న పునరుద్ధరించబడింది.
 38. ది హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హోలోగ్రఫి. హోలోఫైల్ . 24 ఆగస్టు 2009న పునరుద్ధరించబడింది.
 39. హలో, డాలీ. కార్నెగీ మాగజైన్ . 24 ఆగస్టు 2009న పునరుద్ధరించబడింది.
 40. ఎలియట్ H. కింగ్ ఇన్ డాన్ అడేస్ (ed.), డాలీ , బొంపియని ఆర్టే, మిలన్, 2004, పుట. 456.
 41. సాల్వడార్ డాలీ బయో, ఆర్ట్ ఆన్ 5th గ్రహించబడినది జూలై 22, 2006.
 42. సాల్వడార్ డాలీ ఎట్ లే మ్యురిసే పారిస్ అండ్ సెయింట్ రెగిస్ ఇన్ న్యూ యార్క్ అన్ద్రియాస్ అగస్టిన్, ehotelier.com, 2007
 43. స్కాట్స్మాన్ రివ్యూ అఫ్ డర్టీ డాలీ
 44. ది డాలీ ఐ న్యూ బ్రియన్ సెవెల్ చే రచించబడినది, thisislondon.co.uk
 45. ఇయాన్ గిబ్సన్ (1997). ది షేంఫుల్ లైఫ్ ఆఫ్ సాల్వడార్ డాలీ . W. W. నార్టన్ & కంపెనీ.
 46. "డాలీ రెస్టింగ్ ఎట్ కాజిల్ ఆఫ్టర్ ఇంజురీ ఇన్ ఫైర్". ది న్యూయార్క్ టైమ్స్. 6 సెప్టెంబరు 2006 జులై 22, 2007న సేకరించబడింది.
 47. Mark Rogerson (1989). The Dalí Scandal: An Investigation. Victor Gollancz. ISBN 0575037865. 
 48. ఎతెరింగ్టన్ -స్మిత్, మెరేడిత్ ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమొరీ: ఎ బయోగ్రఫీ ఆఫ్ డాలీ పుట. 411, 1995 డ కాపో ప్రెస్, ISBN 0-306-80662-2
 49. ఎతెరింగ్టన్ -స్మిత్, మెరేడిత్ ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమొరీ: ఎ బయోగ్రఫీ ఆఫ్ డాలీ పుటలు. xxiv, 411–412, 1995 డ కాపో ప్రెస్, ISBN 0-306-80662-2
 50. http://www.salvador-dali.org/en_index.html | ది గాల-సాల్వడార్ డాలీ ఫౌండేషన్ వెబ్సైట్
 51. http://arsny.com/requested.html | అతి తరచుగా కోరబడే ఆర్టిస్ట్స్ రైట్స్ సొసైటీ యొక్క చిత్రకారుల జాబితా
 52. సాల్వడార్ డాలీ, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ సాల్వడార్ డాలీ (న్యూ యార్క్: డయల్ ప్రెస్, 1942), పుట. 317.
 53. మైఖేల్ టైలర్ ఇన్ డాన్ అడేస్ (ed.), డాలీ (మిలన్: బొమ్పియని, 2004), పుట. 342
 54. 54.0 54.1 డాలీ యూనివర్స్ కలెక్షన్. కౌంటీ హాల్ గాలరీ . జూలై 13, 2007న తిరిగి పొందబడింది.
 55. 55.0 55.1 "సాల్వడార్ డాలీస్ సింబాలిజం". కౌంటీ హాల్ గాలరీ . జూలై 13, 2007న తిరిగి పొందబడింది.
 56. 56.0 56.1 Lobster telephone. నేషనల్ గాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా . 24 ఆగస్టు 2009న పునరుద్ధరించబడింది.
 57. టాటె కలెక్షన్ | లోబ్స్టర్ టెలిఫోన్ బై సాల్వడార్ డాలీ. టాటె ఆన్లైన్ . 24 ఆగస్టు 2009న పునరుద్ధరించబడింది.
 58. ఫెడెరికో గార్సియా లోర్కా. పెగసోస్ . 24 ఆగస్టు 2009న పునరుద్ధరించబడింది.
 59. పాస్ట్ ఎక్జిబిషన్స్. హగ్గెర్టీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ . 29 ఆగస్టు 2005న పునరుద్ధరించబడింది.
 60. "డాలీ & ఫిల్మ్" Edt. గాలే, మాథ్యూ. సాల్వడార్ డాలీ మ్యూజియం ఇంక్. సెయింట్ పీటర్స్బర్గ్, ఫ్లోరిడా. 2007.
 61. "L’Age d’or (ది గోల్డెన్ ఏజ్)" హార్వర్డ్ ఫిలిం ఆర్చివ్. (2006). ఏప్రిల్ 10, 2008. http://hcl.harvard.edu/hfa/films/2000novdec/bunuel.html
 62. షార్ట్, రాబర్ట్. "ది ఏజ్ ఆఫ్ గోల్డ్: సర్రియలిస్ట్ సినిమా, పెర్సిస్టెన్స్ ఆఫ్ విజన్" వాల్యుం. 3, 2002.
 63. ఎలియట్ హెచ్. కింగ్, డాలీ, సర్రియలిజం అండ్ సినిమా , కమేరా బుక్స్ 2007, పుట. 169.
 64. 64.0 64.1 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; designws అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 65. 65.0 65.1 డాలీ: ఎక్స్ప్లోరేషన్స్ ఇంటూ ది డొమైన్ ఆఫ్ సైన్స్. ది ట్రైయాంగిల్ ఆన్లైన్ . 29 ఆగస్టు 2005న పునరుద్ధరించబడింది.
 66. 66.0 66.1 66.2 ప్రోస్, ఫ్రాన్సిన్. (2000) ది లైవ్స్ ఆఫ్ ది మ్యూజేస్: నైన్ వుమెన్ అండ్ ది ఆర్టిస్ట్స్ దే ఇన్స్పైర్డ్ . హర్పెర్ పెరిన్నియల్. ISBN 0-525-94980-1 ఉదహరింపు పొరపాటు: Invalid <ref> tag; name "Prose" defined multiple times with different content
 67. లేయర్, అమంద. (1986) మై లైఫ్ విత్ డాలీ . బ్యూఫోర్ట్ బుక్స్. ISBN 0-525-94980-1
 68. లోజానో, కార్లోస్. (2000) సెక్స్, సర్రియలిజం, డాలీ, అండ్ మీ . రాజొర్ బుక్స్ లిమిటెడ్. ISBN 0-9538205-0-5.
 69. ఎతెరింగ్టన్-స్మిత్, మెరేడిత్. (1995) ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమొరీ: ఏ బయోగ్రఫీ ఆఫ్ డాలీ . ద కాపో ప్రెస్. ISBN 0-525-94980-1
 70. పెనే, స్టాన్లీ జి. ది హిస్టరీ ఆఫ్ స్పెయిన్ అండ్ పోర్చుగల్, వాల్యూం. 2, చాప్టర్. 26, పుటలు. 648–651 (ప్రింట్ ఎడిషన్: యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ ప్రెస్, 1973) (లైబ్రరీ ఆఫ్ ఇబెరియన్ రేసౌర్సెస్ ఆన్లైన్ మే 15, 2007న గ్రహించబడినది)
 71. దె ల క్యుఎవ, జూలియో రెలిజియస్ పెర్సేక్యుషన్, యాంటిక్లెరికల్ ట్రెడిషన్ అండ్ రివల్యూషన్: ఆన్ అట్రోసిటీస్ అగైనేస్ట్ ది క్లెర్జి డ్యురింగ్ ది స్పానిష్ సివిల్ వార్, జర్నల్ ఆఫ్ కాన్టేమ్పరరీ హిస్టరీ వాల్యూం XXXIII - 3, 1998
 72. ఫ్రాన్సిస్కో ఫ్రాంకో తో కలసి సాల్వడార్ డాలీ
 73. ది సర్రియల్ వరల్డ్ ఆఫ్ సాల్వడార్ డాలీ. స్మిత్సోనియన్ మాగజైన్. | 2005 29 ఆగస్టు 2005న పునరుద్ధరించబడింది.
 74. సమ్ నోట్స్ ఆన్ సాల్వడార్ డాలీ, జార్జ్ ఆర్వెల్ చే రచించబడినది
 75. "The Salvador Dalí Online Exhibit". MicroVision. Retrieved 2006-06-13. 
 76. 76.0 76.1 "Dalí picture sprung from jail". BBC. March 2, 2003. 

సూచనలు[మార్చు]

బాహ్య లింక్‌లు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
జీవిత చరిత్రలు మరియు వార్తలు
ఇతర లింకులు
ప్రదర్శనలు