సావిత్రి (కృష్ణా ఫిలిమ్స్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సావిత్రి
(1933 తెలుగు సినిమా)
దర్శకత్వం హెచ్.ఎం.రెడ్డి
తారాగణం మునిపల్లె సుబ్బయ్య,
చిత్తజల్లు కాంతామణి,
కె.ఎల్‌.కాంతం,
ఎల్.వి.ప్రసాద్
నిర్మాణ సంస్థ కృష్ణా ఫిలిమ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సతీ సావిత్రి హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో 1933లో విడుదలైన తెలుగు టాకీ చలనచిత్రం. ఈ సినిమా భారత్‌ మూవీటోన్‌ పతాకాన బొంబాయిలో ప్రారంభమైంది. ఇదే పేరుతో ఇంచుమించు అదే సమయంలో ఈ చిత్రానికి పోటీగా ఈస్ట్‌ ఇండియా ఫిలిం కంపెనీ పతాకాన కలకత్తాలో సి.పుల్లయ్య దర్శకత్వంలో ఒక చిత్రం ప్రారంభించారు.

హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'సతీ సావిత్రి' సినిమాకి 'భక్త ప్రహ్లాద'లో హిరణ్య కశిపుడు పాత్ర పోషించిన మునిపల్లె సుబ్బయ్యను యమధర్మ రాజు పాత్రను ఎంపిక చేసారు. కాంతామణి కన్యను సావిత్రి పాత్రకు, సత్యవంతుని పాత్రకు కె.ఎల్‌.కాంతంని, సత్యవంతుని మిత్రునిగా ఎల్‌.వి.ప్రసాద్‌ని ఎంపిక చేసారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4, 1933 (శనివారం) నాడు విడుదలైంది. ఈ చిత్రం విడుదల సందర్భంగా ప్రచురించిన పోస్టర్లలో "రోజుకు 3 ఆటలు ప్రదర్శన అని, సంగీతంతో కూడిన 100% తెలుగు టాకీ అని, మీరు ఇదివరకు చూచిన వాటికి దీనికి చాలా వ్యత్యాసం గలదు అని, సుప్రసిద్ధులు, ఆంధ్ర నటీ నటకులు పాల్గొన్నారని, మిక్కిలి భావ గర్భితము గలది, తయారు చేయుటలో చాలా నేర్పరితనము చూపబడినది. ఇది భ్రమగాదు అంతయు సత్యము. ఇప్పుడే టిక్కెట్లు కొని యుంచుకొనుడు" అని ప్రచురించడం జరిగింది.[1]

మూలాలు

[మార్చు]