సావాసం
(సాహసం (1952 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
సావాసం (1952 తెలుగు సినిమా) | |
చందమామ పత్రికలో సావాసం ప్రకటన | |
---|---|
దర్శకత్వం | మీర్జాపురం రాజా |
తారాగణం | కృష్ణవేణి, ప్రభాకరరావు, మాణిక్యారావు, యం.కొండయ్య |
నిర్మాణ సంస్థ | శోభనాచల పిక్చర్స్ |
పంపిణీ | చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ |
భాష | తెలుగు |
సావాసం 1952 జనవరి11న విడుదలైన తెలుగు సినిమా. శోభనాచల పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను మిర్జాపురం రాజా స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. కృష్ణవేణి, కనకం లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కథ, మాటలు, పాటలను తాపీ ధర్మారావు నాయుడు రాసాడు. ఈ చిత్రం ప్రముఖ నటి, గాయని కృష్ణవేణి నటించిన చివరి చిత్రం.[1]
తారాగణం
[మార్చు]- కృష్ణవేణి - ప్రభ
- కనకం - చంప
- సీత - వకీలు భార్య
- వెంకుమాంబ - తల్లి
- ప్రభాకరరావు - ప్రకాష్
- కోటేశ్వరరావు - మధు
- కొండయ్య - కొండయ్య
- మాణిక్యారావు నాయుడు - మామ
- పాలడుగు సుబ్బారావు - తాత
సాంకేతిక వర్గం
[మార్చు]- కెమేరా : సి.యం.మారి
- సౌండు : యం.బి. వాల్కే
- ఆర్టు: టి.వి.యస్.శర్మ
- ఎడిటింగ్: ఆర్.యం.వేణుగోపాల్
- మేకప్: హరిబాబు, నాగేశ్వరరావు, నరసింహులు
- డ్యాన్సు: వెంపటి
- కథ, మాటలు, పాటలు: తాపీ ధర్మారావు నాయుడు
- అసోసియేట్ డైరక్టర్సు: యం.కొండయ్య, కె.వెంకట్రామన్
- ప్రొడ్యూసర్ అండ్ డైరక్టరు: రాజాసాహేబ్ ఆఫ్ మిర్జాపురం
పాటలు
[మార్చు]- ఈ వూరొచ్చాడొక బొండాం కాలొక తొండం చేయోక తొండం -
- ఏమి పాపమో నాదేమి లోపమో చింతే నా వంతాయే -
- ఏమీ తెలియగ రాదే ఏ గతి ఊరట లేదే -
- జీవితమందలి హాయి ఈ జీవితమందలి హాయి -
- తీరెనా తీరెనా తీరెనా ఆశా తీరెనా ఆశా -
- ప్రకాశమే ప్రకాశమే ఈ ప్రకాశమే నా ప్రకాశమే నేనున్నాను నీకోసం -
- బలెజోర్ బలెజోర్ కాకవేరా నా పేరు తెలియదేరా -
- సూట్టు బూట్టు హేటు చేతన హమేషా సిగరెట్టు -
- హెచ్చరికోయ్ భారతీయుడా హెచ్చరికోయ్ దేశము నమ్మిన -
మూలాలు
[మార్చు]- ↑ "Savaasam (1952)". Indiancine.ma. Retrieved 2021-06-09.