Jump to content

సికింద్రాబాద్ గణపతి దేవాలయం

వికీపీడియా నుండి
సికింద్రాబాద్ గణపతి దేవాలయం
సికింద్రాబాద్ గణపతి దేవాలయం
పేరు
స్థానిక పేరు:విరుపాక్ష గణపతి
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:హైదరాబాద్ జిల్లా
ప్రదేశం:సికింద్రాబాద్
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:వినాయకుడు
ప్రధాన పండుగలు:వినాయక జయంతి, వినాయక చవితి, సంకష్టహర చతుర్థి
నిర్మాణ శైలి:దేవాలయ నిర్మాణ శైలీ
వెబ్‌సైటు:దేవాలయ వెబ్సైటు

సికింద్రాబాద్ గణపతి దేవాలయం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు జంట నగరంగా ప్రసిద్ధి పొందిన సికింద్రాబాద్‌ లో ఉన్న వినాయక దేవాలయం.[1] దాదాపు 200 సంవత్సరాలనాటి ఈ దేవాలయంలో స్వయంభుగా వెలసిన వినాయకుడు, విరుపాక్ష గణపతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు.[2]

దేవాలయ చరిత్ర

[మార్చు]

పూర్వకాలంలో సైనిక నివాస ప్రాంతంగా ఉన్న ఈ స్థలంలో 1824లో మద్రాస్‌ రెజిమెంట్‌ ఆఫ్‌ సిపాయిస్‌ సైనికులు మంచినీటి కోసం బావి తవ్వినపుడు అందులో నుండి వినాయకుడి విగ్రహం బయటపడింది.[3] ఆ సైనికులు విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించిన అద్భుతమైన వాస్తుశిల్ప దేవాలయంలో ప్రతిష్టించారు. 1932లో శ్రీ నవగ్రహ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు.

చతుర్భుజములుతో కుడి చేతిలో అంకుశం, ఎడమచేతిలో డమరుపాశం కలిగి, కింది చేయి కటిమోకాలిపై ముద్రలో బోర్లించుకొని ఎడమచేతిలో బీజాపూర ఫలం కలిగి బింబంపై కుడివైపు చంద్రవంక ఎడమవైపు సూర్య బింబం కలిగి కుబేరస్థానం (ఉత్తరం) వైపు వెళ్ళు మూషికారూరుడై వెలసిన స్వామి విభిన్న రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడు.[4]

ఇతర దేవతలు

[మార్చు]

ఈ దేవాలయ ప్రాంగణంలో నవగ్రహాలు, శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి, ఉమామహేశ్వరులు, క్షేత్రపాలకుడిగా వేంకటేశ్వరస్వామి మొదలైన దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు.

పూజలు, ఉత్సవాలు

[మార్చు]

ఈ దేవాలయంలో సంకష్టహర చతుర్థి, వినాయక నవరాత్రులు,[5] వినాయక జయంతి మొదలైన ఉత్సవాలు జరుగుతుంటాయి.

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-08-31). "తెలంగాణ‌లో స్వయంభువుగా గ‌ణేశుడి ఆల‌యాలు ఇవే." Namasthe Telangana. Archived from the original on 2022-08-31. Retrieved 2022-09-13.
  2. "సికింద్రాబాద్ గణపతి దేవాలయం". www.ganeshtemplesec.telangana.gov.in. Archived from the original on 2022-06-15. Retrieved 2022-09-13.
  3. "Ganesh chaturthi 2020: ప్రతీఒక్కరు దర్శించుకోవాల్సిన వినాయక ఆలయాలు ఇవే..." News18 Telugu. 2020-08-21. Archived from the original on 2022-09-10. Retrieved 2022-09-10.
  4. "About Us". www.ganeshtemplesec.telangana.gov.in. Archived from the original on 2022-06-15. Retrieved 2022-09-13.
  5. telugu, NT News (2022-08-31). "లష్కర్‌లో గణపతి నవరాత్రులు". Namasthe Telangana. Archived from the original on 2022-08-31. Retrieved 2022-09-13.