Jump to content

సిగిరియా

అక్షాంశ రేఖాంశాలు: 07°57′25″N 80°45′35″E / 7.95694°N 80.75972°E / 7.95694; 80.75972
వికీపీడియా నుండి
Sigiriya
Sigiriya Rock from the main public entrance
ప్రదేశంCentral Province, Sri Lanka
అక్షాంశ,రేఖాంశాలు07°57′25″N 80°45′35″E / 7.95694°N 80.75972°E / 7.95694; 80.75972
Official name: Ancient City of Sigiriya
రకంCultural
అభిలక్షణముii, iii, iv
నియమించబడినది1982 (6th session)
సూచన సంఖ్య.202
UNESCO RegionAsia-Pacific
సిగిరియా is located in Sri Lanka
సిగిరియా
Sri Lanka లో Sigiriya స్థానం

సిగిరియా లేక సింహగిరి శ్రీలంక మధ్య ప్రాంతంలోని ఉత్తర మతాలే జిల్లాలో, దంబుల్లా పట్టణ సమీపంలో ఉన్న ఒక పురాతన రాతి కోట. ఈ పేరు చారిత్రక, పురావస్తు ప్రాముఖ్యత గల ఒక ప్రదేశాన్ని సూచిస్తుంది, ఇది దాదాపు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తులో ఉన్న ఒక భారీ శిలతో కూడి ఉంది. ప్రాచీన శ్రీలంక గ్రంథం కులవంశ ప్రకారం, ఈ ప్రదేశాన్ని కశ్యప రాజు (సా.శ 477 - 495) తన కొత్త రాజధాని కోసం ఎంపిక చేసుకున్నాడు.

ఈ శిలపైన అతడు తన ప్రసాదాన్ని నిర్మించాడు. ఈ రాతిపైకి ఎక్కే దారి మధ్యలో, భారీ సింహం ఆకారంలో ఒక ద్వారాన్ని నిర్మించాడు. ఈ స్థలానికి సింహగిరి అనే పేరు ఈ ద్వారం మీదుగానే వచ్చింది.

రాజు మరణించాక, ఈ రాజధానిని, ఈ రాజప్రాసాదాన్నీ విసర్జించారు. 14 వ శతాబ్ది వరకూ దీన్ని బౌద్ధారామంగా ఉపయోగించారు.[1] ప్రస్తుతం ఇది యునెస్కో వారసత్వ ప్రదేశం. ప్రాచీన పట్టణ ప్రణాళికకు అత్యుత్తమంగా పరిరక్షించబడిన ఉదాహరణల్లో ఇది ఒకటి.[2]

పౌరాణిక కథ

[మార్చు]

సిగిరియా అనేది రామాయణంలో చెప్పిన కుబేరుడి అలకాపురి కావచ్చని లాల్ శ్రీనివాస్, మిరాండో ఓబెశేకర చెప్పారు.

రావణ వథ అనే తాళపత్ర గ్రంథంప్రకారం, సిగిరియాను మయుడు నిర్మించాడు. రావణుడి తండ్రి విశ్రవసుడి ఆజ్ఞ మేరకు అతడుదీన్ని నిర్మించాడు.ఆ సమయంలో దీన్నిఅలకమండప అని పిలిచేవారు. కుబేరుడి కాలంలో దీన్ని చిత్రకూటం అని పిలిచేవారు. రావణుడి వథ తరువాత అతడి సోదరుడు విభీషణుడు రాజయ్యాడు. అతడు రాజధానిని కెలానియాకు మార్చడు. ఈ పుస్తకం ప్రకారం, చిత్తరాజ, ఈ అలకమండపాన్ని తన నివాసంగా వాడుకున్నాడు. చిత్తరాజు విభీషణుడి బంధువు.

చారిత్రిక ప్రశస్తి

[మార్చు]

సా.శ 477 లో మొదటి కశ్యపుడు కుట్ర చేసి, రాజు ధాతుసేనుడి నుండి గద్దెను చేజిక్కించుకున్నాడు. కశ్యపుడు ధాతుసేనుడికి ఒక రాణికి పుట్టినవాడు. కాని సింహాసనానికి వారసుడు కాడు. ఈ తిరుగుబాటులో అతడికి సేనాధిపతి మిగారుడు సాయపడ్డాడు. రాజుకు వారసుడైన మొగ్గల్లానుడు ప్రాణభయంతో దాక్షిణ భారత దేశానికి పారిపోయాడు. మొగ్గల్లానుడు దాడి చేస్తాడేమోననే భయంతో కశ్యపుడు తన రాజధానిని అనురాధాపుర నుండి సిగిరియాకు మార్చాడు. కశ్యపుడి పాలనా కాలంలో (సా.శ. 477 to 495), సిగిరియాను ఒక నగరంగా, ఒక దుర్గంగా మలచాడు.[3][4] ఈ శిలపైన, దాని చుట్టూరానూ ఉన్న రక్షక కుడ్యాలు, భవనాలు, తోటలు వంటి నిర్మాణాల్లో చాలావరకు అతడి కాలంలో నిర్మించినవే.

చ్చివరికి మొగ్గల్లానుడు సా.శ. 495 లో ససైన్యంగా తిరిగి వచ్చి, కశ్యపుని ఓడించాడు. కశ్యపుడి సైన్యం అతణ్ణి వదిలేసి పారిపోయింది. అతడు తన కత్తిపై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మొగ్గల్లానుడు తిరిగి అనురాధపురను తన రాజధానిగా చేసుకున్నాడు. సిగిరియాను బౌద్ధారామంగా మార్చాడు.[5] అది 13, 14 వ శతాబ్దం దాకా అలాగే కొనసాగింది.

మూలాలు

[మార్చు]
  1. Ponnamperuma, Senani (2013). The Story of Sigiriya. Panique Pty Ltd. ISBN 978-0-9873451-1-0.
  2. Bandaranayake, Senake; Aramudala, Madhyama Saṃskr̥tika (2005). Sigiriya: City, Palace, Gardens, Monasteries, Painting. Central Cultural Fund. ISBN 978-955-631-146-4.
  3. Ponnamperuma, Senani (2013). The Story of Sigiriya. Panique Pty Ltd. ISBN 978-0-9873451-1-0.
  4. Bandaranayake, Senake; Aramudala, Madhyama Saṃskr̥tika (2005). Sigiriya: City, Palace, Gardens, Monasteries, Painting. Central Cultural Fund. ISBN 978-955-631-146-4.
  5. Geiger, Wilhelm. Culavamsa Being The More Recent Part Of Mahavamsa 2 Vols, Ch 39. 1929
"https://te.wikipedia.org/w/index.php?title=సిగిరియా&oldid=2969042" నుండి వెలికితీశారు