సిజా రోజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిజా రోజ్
జననం
సిజా రోజ్

జాతీయతభారతీయురాలు
వృత్తి
  • నటి
  • యాంకర్
  • డాన్సర్
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం

సిజా రోజ్ భారతీయ నటి. ఆమె ప్రధానంగా మలయాళం, తమిళ సినిమాలలో నటిస్తుంది. ఆమె 2014లో అమృత టీవీలో టెలివిజన్ రియాలిటీ షో లెట్స్ డ్యాన్స్‌ని హోస్ట్ చేసింది. ఫ్లవర్స్ టీవీలో స్టార్ ఛాలెంజ్ అనే రియాల్టీ షో కూడా చేసింది. ఆమె మొదటగా మలయాళ చిత్రం ఉస్తాద్ హోటల్‌లో దుల్కర్ సల్మాన్ సోదరిగా చిన్న పాత్ర పోషించింది. తులసి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రతో ఆమె 2012లో కోజి కూవుత్తు చిత్రంతో తమిళనాట అడుగుపెట్టింది.

ఆమె నటించిన మలయాళ చిత్రం ఉస్తాద్ హోటల్ (2012), తెలుగులో జనతా హోటల్‌ (2018) పేరుతో విడుదల చేసారు. ఇందులో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆమె ఒమన్‌లోని మస్కట్‌లో ఇండియన్ స్కూల్ అల్ వాడి అల్ కబీర్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[2]

కెరీర్

[మార్చు]

గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక సెలవులలో ఆమె కేరళకు వచ్చింది. ఆ సమయంలో, ఆమెకు మోడలింగ్ చేసే అవకాశం దక్కింది. దీంతో కొన్ని టీవీ ప్రకటనలలో చేసింది. ఇది ఆమెకు సినిమా ఆఫర్ లకు దారితీసింది.[3] ఆమె తొలి వెంచర్ 2012లో కన్నడ చిత్రం మగాడి. ఆమె మొదటి మలయాళ చిత్రం ఉస్తాద్ హోటల్‌లో దుల్కర్ సల్మాన్ సోదరిగా చిన్న పాత్ర పోషించింది. అలాగే 2012లో, ఆమె తమిళంలో కోజి కూవుత్తులో తులసి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషించింది.[4][5]

2013లో, ఆమె నటించిన నీ కో న్జా చా, అన్నయుం రసూలుం, అమనకర ఎంట్రీ మూడు చిత్రాలు ఒకే రోజు విడుదల అయ్యాయి.

ఆ తరువాత, ఆమె రెండు తమిళ చిత్రాలు మసాని, మాధవనుమ్ మలర్విజియుమ్ చేసింది. ఇందులో ఆమె భరతనాట్యం నర్తకి పాత్ర పోషించింది. ఆ తర్వాత హిందీ చిత్రం ట్రాఫిక్‌కి రాజేష్ పిళ్లై దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది.[6] అది పూర్తయిన తర్వాత బిజిత్ బాలా తొలి వెంచర్ నెల్లిక్కలో ఆమె దీపక్ సరసన నటించింది. ఆమె మొయిదీన్, కాంచనమాల నిజ జీవిత ప్రేమకథ ఆధారంగా పీరియడ్-డ్రామా ఎన్ను నింటే మొయిదీన్‌కు సైన్ అప్ చేసింది.[7]

2014లో, ఆమె అమృత టీవీలో లెట్స్ డ్యాన్స్ అనే రియాలిటీ టెలివిజన్ షోను హోస్ట్ చేసింది.[8]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (10 July 2018). "జనతా హోటల్‌". Archived from the original on 7 October 2021. Retrieved 7 October 2021.
  2. "Wish upon a star". Times of Oman. Archived from the original on 13 April 2014. Retrieved 30 December 2012.
  3. "M'wood is still male-dominated: Sija Rose". The Times of India. 10 January 2017.
  4. Manigandan, K. R. (29 December 2012). "Kozhi Koovuthu: Clichéd take". The Hindu. Retrieved 30 December 2012.
  5. "M'wood is still male-dominated: Sija Rose". The Times of India. 10 January 2017.
  6. "Acting is easier than direction: Says Sija Rose". The Times of India. 14 January 2014.
  7. "Sija Rose plays Prithviraj's fiancee !". The Times of India. 20 October 2014.
  8. "Sija enjoys hosting reality show". The Times of India. 3 April 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=సిజా_రోజ్&oldid=4094730" నుండి వెలికితీశారు