సిటీ లైట్స్ (1931 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిటీ లైట్స్
ట్రంప్, పూలు అమ్మే అమ్మాయి
దర్శకత్వంచార్లీ చాప్లిన్
రచనచార్లీ చాప్లిన్
నిర్మాతచార్లీ చాప్లిన్
తారాగణంచార్లీ చాప్లిన్, వర్జీనియా చెర్రిల్, హ్యారీ మైయర్స్
ఛాయాగ్రహణంరోలీ టోరెరో, గోర్డెన్ పొల్లాక్, మార్క్ మార్కెలాట్
కూర్పుచార్లీ చాప్లిన్, విల్లార్డ్ నికో
సంగీతంచార్లీ చాప్లిన్, జోస్ పాడిల్లా, ఆర్థర్ జాన్స్టన్, అల్ఫ్రెడ్ న్యూమాన్
పంపిణీదార్లుయునైటెడ్ ఆర్టిస్ట్స్
విడుదల తేదీ
1931 జనవరి 30 (1931-01-30)
సినిమా నిడివి
87 నిముషాలు
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$1.5 మిలియన్
బాక్సాఫీసు$5 మిలియన్

సిటీ లైట్స్ 1931, జనవరి 30న విడుదలైన అమెరికా మూకీ హాస్య చలనచిత్రం. చార్లీ చాప్లిన్ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో చార్లీ చాప్లిన్, వర్జీనియా చెర్రిల్, హ్యారీ మైయర్స్ తదితరులు నటించారు.[1] ఈ చిత్రంలోని ఒక షాట్ (చాప్లిన్ కు హీరోయిన్ పువ్వును అమ్ముతూ ఫ్లవర్ సార్ అనే డైలాగ్) ప్రపంచంలోనే అత్యధికంగా టేక్స్ (342 టేక్స్) తీసుకున్న షాట్ గా చరిత్రలో నిలిచింది.[2]

కథ[మార్చు]

ఐన్ స్టీన్ తో కలిసి సిటీ లైట్స్ సినిమా ప్రీమియర్ షో చూస్తున్న చాప్లిన్

తనని ఆటపట్టిస్తున్న ఆకతాయిల నుండి తప్పించుకోవడం కోసం ట్రాంప్ (చార్లీ చాప్లిన్), అంధురాలైన పూలు అమ్మే అమ్మాయి (వర్జీనియా చెర్రిల్) దగ్గరకి వస్తాడు. పూలు తీసుకుంటున్న సమయంలో చేతి స్పర్శని బట్టి అతడే తన కంటి ఆపరేషన్ ను డబ్బులిచ్చిన వ్యక్తి అని గుర్తిస్తుంది. ట్రాంప్ కూడా ఆమెను గుర్తిస్తాడు. ఇద్దరి మధ్య కాసేపు మాటలు జరుగుతాయి. ఇది చిత్ర కథ.[3]

నటవర్గం[మార్చు]

 • చార్లీ చాప్లిన్
 • వర్జీనియా చెర్రిల్
 • ఫ్లోరెన్స్ లీ
 • హ్యారీ మైయర్స్
 • అల్ ఎర్నెస్ట్ గార్సియా
 • హాంక్ మాన్

సాంకేతికవర్గం[మార్చు]

 • రచన, నిర్మాత, దర్శకత్వం: చార్లీ చాప్లిన్
 • సంగీతం: చార్లీ చాప్లిన్, జోస్ పాడిల్లా, ఆర్థర్ జాన్స్టన్, అల్ఫ్రెడ్ న్యూమాన్
 • ఛాయాగ్రహణం: రోలీ టోరెరో, గోర్డెన్ పొల్లాక్, మార్క్ మార్కెలాట్
 • కూర్పు: చార్లీ చాప్లిన్, విల్లార్డ్ నికో
 • పంపిణీదారు: యునైటెడ్ ఆర్టిస్ట్స్

నటుల ఎంపిక[మార్చు]

 1. వర్జీనియా చెర్రిల్: ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు అనేకమందిని ఇంటర్వ్యూ చేసాడు కాని వారెవరూ చాప్లిన్ కు నచ్చలేదు. సాంటా మోనికా బీచ్ లో షూటింగ్ చేస్తున్న సమయంలో వర్జీనియా చెర్రిల్ చూశాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి తన సినిమాలో నటించాలని అడిగాడు.[4] మరికొందమందిని చూశాక, చివరికి చెర్రిల్ ను స్క్రీన్ టెస్ట్ చేశాడు. అంతా సరిపోవడంతో 1928, నవంబరు 1న ఒప్పంద పత్రంపై సంతకం చేసింది.[5]

నిర్మాణం - విడుదల[మార్చు]

1928 డిసెంబరులో ఈ చిత్రం యొక్క చిత్రీకరణ మొదలై 1930, సెప్టెంబరులో పూర్తయింది. దీనిని 1.5 మిలియన్లు డాలర్లు ఖర్చు అయింది. 1931, జనవరి 30న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డుతో 5 మిలియన్లు డాలర్లు వసూళ్లు చేయడమేకాకుండా విమర్శకుల ప్రసంశలు అందుకుంది.

చిత్రవిశేషాలు[మార్చు]

 1. చాప్లిన్ కు హీరోయిన్ పువ్వును అమ్మే (ఫ్లవర్ సార్ అనే డైలాగ్) షాట్ ను 342 టేక్ లు తీశారు, ప్రపంచంలోనే అత్యధికంగా టేక్స్ తీసుకున్న షాట్ గా చరిత్రలో నిలిచింది.
 2. ఈ చిత్రంలో చాప్లిన్ వేసిన ట్రాంప్ (విదూషకుడు) పాత్ర అనేక సినిమాల్లో వాడబడింది. రాజ్ కపూర్ నటించిన ఆవారా చిత్రంలోని రాజ్ కపూర్ పాత్ర, చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమాలోని ఒక పాటలో చిరంజీవి వేసిన గెటప్ లకు ఈ పాత్రే ఆధారం.[6]
 3. ఈ చిత్రం ద్వారా కెమెరా ముందు అంధురాలిగా నటించి మెప్పించిన మొదటి నటీమణిగా వర్జీనియా చెర్రిల్ నిలిచింది.[7]

గుర్తింపులు[మార్చు]

 1. చాప్లిన్ సినీప్రస్థానంలో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం, చాలామంది విమర్శకులచే గొప్ప చిత్రాలలో ఒకటిగా పేర్కొనబడింది.
 2. 1991లో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో "సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా, ఆకర్షణీయంగా ముఖ్యమైనది"గా సిటీ లైట్స్ చిత్రాన్ని ఎంపిక చేసింది.
 3. 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ ఎంపిక చేసిన ఉత్తమ అమెరికన్ చిత్రాల జాబితాలో ఈ చిత్రం 11వ స్థానంలో నిలిచింది.
 4. 1949లో ప్రముఖ సినీ విమర్శకుడు జేమ్స్ ఆయేజీ ఈ చిత్రంలోని చివరి సన్నివేశం గురించి గొప్పగా పేర్కొన్నాడు.[8]

మూలాలు[మార్చు]

 1. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 15.
 2. Robinson, David (2004). "Filming City Lights". CharlieChaplin.com. Archived from the original on నవంబరు 22, 2010. Retrieved ఫిబ్రవరి 9, 2019.
 3. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 14-15.
 4. "Obituary: Virginia Cherrill". The Independent. Archived from the original on 8 ఏప్రిల్ 2019. Retrieved 9 February 2019.
 5. Robinson, David (1985). Chaplin:His Life and Art. New York: McGraw-Hill Books Company. p. 398. ISBN 0-07-053181-1.
 6. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 14.
 7. Weissman, Stephen M. (2008). Chaplin: A Life. Arcade Publishing. p. 67. ISBN 978-1-55970-892-0.
 8. Snider, Eric D. (February 15, 2010). "What's the Big Deal: City Lights (1931)". Seattle Post-Intelligencer. The Hearst Corporation. Retrieved 9 February 2019.

ఇతర లంకెలు[మార్చు]

ఆధార గ్రంథాలు[మార్చు]