సిద్ధూ మూసేవాలా
సిద్ధూ మూసేవాలా | |
---|---|
జననం | శుభ్‌దీప్ సింగ్ సిద్ధూ[1] 1993 జూన్ 11 [2] మూసా, మాన్సా జిల్లా, పంజాబ్, భారతదేశం |
మరణం | 2022 మే 29 జవహర్కే, మాన్సా జిల్లా, పంజాబ్, భారతదేశం | (వయసు 28)
మరణ కారణం | తుపాకీతో హత్య |
ఇతర పేర్లు | 5911 |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2016–2022 |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
తల్లిదండ్రులు | చరణ్ కౌర్, బల్కౌర్ సింగ్ |
సంతకం | |
సిద్ధూ మూసేవాలా (1993 జూన్ 11 - 2022 మే 29) (ఆంగ్లం: Sidhu Moose Wala) భారతీయ కళాకారుడు . ప్రముఖ పంజాబీ గాయకుడు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేత.
జీవితచరిత్ర
[మార్చు]సిద్ధూ మూసేవాలాగా పేరుపొందిన శుభ్‌దీప్ సింగ్ సిద్ధూ 2021 డిసెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2022 ఎన్నికల్లో పంజాబ్‌లోని మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. హింసను ప్రేరేపించే పాటల్తో ఆయన వివాదాస్పద గాయకుడిగా వార్తల్లో నిలిచారు. సిద్ధూ పాడిన ‘బంబిహ బోలే’, ‘47’ పాట అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. తేరీ మేరీ జోడీ, మోసా జఠ్.. వంటి చిత్రాల్లో నటించారు. 2020 జులై నెలలో ఎకే-47 రైఫిల్‌ని ఉపయోగించినందుకు ఆయనపై కేసు నమోదు నమోదైంది.
మరణం
[మార్చు]28 ఏళ్ళ వయసులోనే సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. 2022 మే 29న మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను తుపాకీతో కాల్చిచంపారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Grewal, Preetinder (15 November 2018). "The rise of Punjabi singer Sidhu Moosewala". Special Broadcasting Service. Archived from the original on 31 డిసెంబరు 2018. Retrieved 31 December 2018.
- ↑ Kapoor, Diksha (11 June 2019). "Happy Birthday Sidhu Moose Wala: Here Are Some Lesser Known Facts About Birthday Boy". PTC Punjabi. Retrieved 23 February 2022.
- ↑ "Sidhu Moosewala: పంజాబీ గాయకుడు సిద్ధు దారుణ హత్య". web.archive.org. 2022-05-29. Archived from the original on 2022-05-29. Retrieved 2022-05-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)