సినాప్టిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినాప్టిక్ ప్యాకేజీ నిర్వాహకం

సినాప్టిక్ 0.62
అభివృద్ధిచేసినవారు ఆల్ఫ్రెడో కొజిమ, గుస్తావో నియెమియెర్, మైకేల్ వోట్
మొదటి విడుదల 2001 నవంబరు 13 (2001-11-13)
నిర్వహణ వ్యవస్థ డెబియన్, ఇతర పంపిణీలు APT వాడుతున్నాయి
రకము ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థ
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్
వెబ్‌సైట్ http://www.nongnu.org/synaptic/

సినాప్టిక్ అనే కంప్యూటర్ కార్యక్రమం డెబియన్ ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థ కోసం జిటికె+ చిత్రరూప వాడుకరి అంతరవర్తితో రూపొందించిన ఆధునిక ప్యాకేజింగ్ సాధనం. సినాప్టిక్ సాధారణంగా డెబ్ ప్యాకేజీల ఆధారిత వ్యవస్థలలో ఉపయోగిస్తారు కానీ RPM ప్యాకేజీల ఆధారిత వ్యవస్థలలో కూడా ఉపయోగించవచ్చు. సాఫ్టువేర్ ప్యాకేజీలను స్థాపించడానికి, తీసివేయుటకు, ఉన్నతీకరించుటకు, భాండాగారాలను జతచేయడానికి దీనిని ఉపయోగించవచ్చు.

‌ విశిష్టాంశాలు[మార్చు]

 • ఏక, బహుళ ప్యాకేజీల స్థాపన, తొలగించడం, ఉన్నతీకరణ, డౌన్గ్రేడ్
 • వ్యవస్థ-వ్యాప్త ఉన్నతీకరణ
 • ప్యాకేజీ శోధన వినియోగం
 • ప్యాకేజీ భాండాగారాలను నిర్వహణ
 • పేరు, వివరణ, అనేక ఇతర లక్షణాలు ద్వారా ప్యాకేజీలను కనుగొనుట
 • స్థితి, విభాగం, పేరు లేదా అనురూపిత వడపోత ద్వారా ప్యాకేజీలను ఎంచుకోండి
 • పేరు, స్థితి, పరిమాణం లేదా రూపాంతరం ద్వారా ప్యాకేజీలను క్రమబద్ధీకరించు
 • ప్యాకేజీకి సంబంధించిన ఆన్లైన్ పత్రీకరణను విహరించండి
 • ఒక ప్యాకేజీ యొక్క సరికొత్త మార్పుచిట్టాను దింపుకోవచ్చు
 • ప్యాకేజీలను ప్రస్తుత రూపాంతరానికి లాక్ వేయుట
 • ఒక నిర్దిష్ట ప్యాకేజీ రూపాంతరాన్ని బలవంతంగా స్థాపించుట
 • ఎంపికల దిద్దుబాటు రద్దుచెయ్యి/మళ్ళీచేయుట
 • ప్యాకేజీ నిర్వాహకం కోసం అంతర్గతంగా నిర్మితమైన టెర్మినల్ ఎమ్యులేటరు

డెబియన్, ఉబుంటుల కోసం ఈ క్రింది విశిష్టతలను కలిగివుంది:

 • Debconf వ్యవస్థ ద్వారా ప్యాకేజీలను స్వరూపించుట
 • Xapian-ఆధారిత శీఘ్ర శోధన
 • Screenshots.debian.net నుండి తెరపట్టులను పొందుట

వాడకం[మార్చు]

ప్యాకేజీ నిర్వాహకం వాడుకరిని సాఫ్టువేరు ప్యాకేజీలను స్థాపించుటకు లేదా తొలగించడానికి, ఉన్నతీకరించుటకు అనుమతిస్తుంది. ఒక ప్యాకేజీని స్థాపించుటకు మనకు కావలసిన కార్యక్రమాన్ని వెతికి, దానిని స్థాపించుటకు గుర్తుపెట్టాలి. మార్పులు తక్షణమే అనువర్తించబడవు; వాడుకరి ముందుగా అన్ని మార్పులను గుర్తుపెట్టాలి, తరువాత వాటిని అనువర్తించాలి.

చరిత్ర[మార్చు]

ప్రత్యామ్నాయాలు[మార్చు]

మూలాలు[మార్చు]