Jump to content

సిమ్రాన్ నటేకర్

వికీపీడియా నుండి
సిమ్రాన్ నటేకర్
జననం (1997-12-12) 1997 డిసెంబరు 12 (వయసు 27)
ముంబై, భారతదేశం
జాతీయతభారతీయురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ధూమపానంపై అవగాహన ప్రకటన

సిమ్రాన్ నటేకర్ భారతీయ నటి. ఆమె బాలీవుడ్ ఫిల్మ్, టీవీ పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె బాలనటిగా వాణిజ్య ప్రకటనలతో అరంగేట్రం చేసింది. ఆమె 150కి పైగా ప్రకటనలలో నటించింది.[1] ఆమె మొదటి టీవి సీరియల్ బంధన్ సాత్ జన్మో కా ఆన్ కలర్స్, కాగా మొదటి చలన చిత్రం యష్ రాజ్ ఫిల్మ్స్ దావత్-ఇ-ఇష్క్ (2014) . ఆమె బెస్ట్ ఆఫ్ లక్ లాలు (2017)లో నటించింది. ఆమె బాలికా వధు, లాడో 2 సీరియల్‌లలో సహాయక పాత్రలను పోషించింది.

హిందీలో హిట్ అయిన బాలికా వదు తెలుగులో చిన్నారి పెళ్లికూతురుగా వచ్చింది. ఈ సీరియల్‌లో పూజ పాత్రతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆమె మెప్పించింది.

బాల్యం

[మార్చు]

ఆమె 1997 డిసెంబరు 12న ముంబైలో జన్మించింది.[2]

కెరీర్

[మార్చు]

ఆమె 6 సంవత్సరాల వయస్సులో 'ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు పొగ.. మరోవైపు నుసి.. ఎవ్వరూ నోరుమెదపరేంటి..’ అనే నో స్మోకింగ్ అవేర్ నెస్ క్యాంపెయిన్‌ యాడ్ తో కెరీర్ మొదలుపెట్టింది.[3] ఇది ఆమెకు దేశవిదేశాలలో ప్రజాదరణ తెచ్చిపెట్టింది. ఆ తరువాత, ఆమె టెలివిజన్ ప్రకటనలు, ప్రింట్ షూట్‌లు చేయడం కొనసాగించింది. ఆమె 2018లో యూట్యూబ్‌లో గర్లియాపాస్ గర్ల్స్ హాస్టల్ సిరీస్‌లో మిల్లీ పాత్రను కూడా పోషించింది.

ఆమె కాంప్లాన్ బాక్స్‌ చిత్రంలో నటించింది. ఆమె ముంబై మెట్రో కోసం, దాదాపు 3 సంవత్సరాల పాటు ప్రజా అవగాహన పోస్టర్లతోనూ ప్రసిద్ధి చెందింది.

2011లో స్టార్ ప్లస్ లో ప్రసారమైన ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై అనే సీరియల్‌లో ఆమె ఒక పాత్రను పోషించింది. ఆమె డిస్నీ ఛానెల్‌లో షహానా పాత్రలో ది సూట్ లైఫ్ ఆఫ్ కరణ్ & కబీర్‌లో అతిధి పాత్ర చేసింది.

2012లో, ఆమె తోతా వెడ్స్ మైనా అనే సీరియల్‌లో నటించింది. 2013లో, ఆమె డెవోన్ కే దేవ్ మహాదేవ్‌లో యువ సీత పాత్రను, ఖౌఫ్ ఆన్ లైఫ్ ఓకేలో రూహీగా నటించింది. ఆమె దావత్-ఎ-ఇష్క్‌ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్ సోదరి ఫరీదాగా నటించింది. ఆమె హాతీమ్, క్రిష్3, డిష్కియావూన్‌లలో అతిధి పాత్రలు చేసింది. ఆమె డిస్నీ కోసం ఓయే జస్సీ, పాలక్ పే ఝలక్ వంటి సీరియల్స్‌లలో నటించింది.

2015లో, ఆమె బాలికా వధులో పూజా పాత్ర పోషించింది. 2016లో, ఆమె సోనీ కోసం తను ఇన్ ఏక్ రిష్తా సాజెదారి కాలో ఒక పాత్ర చేసింది. 2017లో, ఆమె ఖైదీ బ్యాండ్, చక్కి అండ్ బెస్ట్ ఆఫ్ లక్ లాలు అనే గుజరాతీ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.[4] ఆమె అదే సంవత్సరంలో పెహ్రేదార్ పియా కీలో శివాని పాత్రను కూడా పోషించింది.

మూలాలు

[మార్చు]
  1. "Simran Natekar Got Movie Chance In Tollywood - Sakshi". web.archive.org. 2023-08-27. Archived from the original on 2023-08-27. Retrieved 2023-08-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Simran Natekar on Instagram: "Happy 16 to me..."". Instagram (in ఇంగ్లీష్). Archived from the original on 26 December 2021. Retrieved 2020-11-03.
  3. "No-smoking ads: Bollywood to take charge and add much-needed visual appeal". 22 March 2017.
  4. "Dhollywood set for an action-packed festive season". epaperbeta.timesofindia.com (in ఇంగ్లీష్). Retrieved 2017-10-29.[dead link]