సి.ఎల్.ఎన్.గాంధి

వికీపీడియా నుండి
(సి.ఎల్.ఎన్.గాంధీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

హేతువాది సిఎల్‌ఎన్‌ గాంధి

రవాణాశాఖలో జాయింట్ కమిషనర్ గా[మార్చు]

గాంధి రవాణాశాఖలో జాయింట్ కమిషనర్ గా ఉన్నప్పుడు, కంప్యూటరైజేషన్‌ చేసి ప్రజలకు సత్వర సేవలు అందించడానికి శ్రీకారం చుట్టాడు. హైదరాబాదులో రవాణాశాఖకు స్వంత భవనాన్ని సమకూర్చడంలో గాంధీ కృషి ఎంతో ఉంది. ఈ కార్యాలయంలో కుడ్య చిత్రీకరణ, పూల తోట పెంపకంలో గాంధి కృషికి ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు లభించింది.

హేతువాదిగా[మార్చు]

మూడు దశాబ్దాలుగా హేతువాద ఉద్యమంలో కొనసాగుతున్న గాంధి, ఉద్యమానికి అనేక సందర్భాలలో ఆర్థిక సాయమందించాడు. ప్రస్తుతం హైదరాబాదు హేతువాద సంఘానికి అధ్యక్షుడు. హేతువాద భావాలతో నడిచే మానవ వికాస వేదికకు గౌరవ అధ్యక్షుడు. గతంలో, గాంధిని మాజీ మంత్రి దివాకరరెడ్డి తమ్ముడు కులం పేరుతో దూషించినందుకు మంగలి వారంతా నిరసన తెలిపి క్షమాపణలు చెప్పించారు. గాంధి మాత్రం తనకు ఏ కులమూ లేదని, తనది మానవకులమని చెప్పాడు.

కుటుంబం[మార్చు]

ఈయన భార్య రాధారాణి (ప్రముఖ హేతువాది గురిజాల సీతారామయ్య కుమార్తె) ప్రస్తుతం హైదారాబాదులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నది.వీరిద్దరిదీ కులాంతర వివాహం. భార్యాభర్తలిద్దరూ మానవతావాదులే. సమావేశాలకు జంటగా హాజరవుతూ ఉంటారు. పిల్లలు: ఇరువురు కుమార్తెలు - చేతన రాధాగాంధి, మానవి రాధాగాంధి. ఇక్కడ గమనించవలసిన విషయమేమంటే పిల్లలకు ఇంటి పేరు స్థానం లో, తల్లితండ్రుల పేరు ఉంచి, నూతన సంప్రదాయానికి నాంది పలికారు గాంధి, రాధారాణి. ఇద్దరు కుమార్తెలకు కులాంతర వివాహం జరిపించారు.

ప్రస్తుతం[మార్చు]

గాంధి రవాణా శాఖ అడిషినల్‌ కమిషనర్‌గా మే 2011 లో పదవీ విరమణ చేసి, ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నాడు.