Jump to content

కంపాక్ట్ డిస్క్

వికీపీడియా నుండి
(సి.డి. నుండి దారిమార్పు చెందింది)
కంపాక్ట్ డిస్క్
కంపాక్ట్ డిస్క్‌ ఉపరితలంపై అతి దగ్గరగా ఉన్న "ట్రాక్"లపై కాంతి "డైఫ్రాక్షన్" చెందడం వలన "దృశ్య స్పెక్ట్రమ్‌"లోని రంగులన్నీ కనిపిస్తుంటాయి.
మీడియా టైప్ఆప్టికల్ డిస్క్
ఎన్‌కోడింగ్వివిధ విధానాలు
సామర్ధ్యంసాధారణంగా 700 MB ( 80 నిముషాల వరకు నిడివి గల ఆడియో ఫైళ్ళు)
చదివే విధానం
(Read mechanism)
780 nm తరంగ దైర్ఘ్యం ఉండే సెమికండక్టర్ లేజర్
రూపొందించిన వారుఫిలిప్స్ , సోనీ కంపెనీలు
వినియోగంఆడియో , డేటా భద్రపరచడం కోసం

కంపాక్ట్ డిస్క్ లేదా సి.డి. (Compact Disc లేదా CD), డిజిటల్ డేటాను భద్రపరచడానికి వాడే ఒక ఆప్టికల్ డిస్క్. ఆరంభంలో ఇది డిజిటల్ ఆడియోను రికార్డు చేయడానికి, భద్రపరచడానికి తయారుచేయబడింది. అక్టోబరు 1982నుండి కంపాక్ట్ డిస్కులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఇప్పటికీ ఇవి డేటా, ఆడియో ఫైళ్ళకు సర్వసాధారణంగా వాడుతున్నారు. సాధారణంగా వాడే సి.డి.ల వ్యాసం 120 మి.మీ. ఇందులో 80 నిముషాల నిడివి గల ఆడియోను భద్రపరచవచ్చును. 60 మి.మీ. - 80 మి.మీ. మధ్య వ్యాసం ఉండే "మినీ సి.డి."లలో 24 నిముషాల ఆడియోను రికార్డు చేయొచ్చును. సీడీ పై భద్రపరిచిన డేటా ను బట్టి, లేదా భద్రపరచిన విధానాన్ని బట్టి (FORMAT) రకరకాల ఆ సీడీని వీసీడీ, ఆడియో సీడీ లేదా డేటా సీడీ అని పిలుస్తారు. వీసీడీ అంటే వీడియో సీడీ. దీనిలో సుమారు ఒక గంట సేపు నిడివి గల వీడియో భద్రపరచవచ్చు.

సి.డి.లను రూపొదించడానికి వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం తరువాత మరింత అభివృద్ధి చెందింది. తత్ఫలితంగా మరిన్ని ప్రత్యేక సదుపాయాలున్న డిస్కులు ఆవిర్భవించాయి. CD-ROM, CD-R (ఒకేమారు "వ్రాయ"గలిగేవి), CD-RW (మళ్ళీ మళ్ళీ వ్రాయగలిగేవి), సూపర్ ఆడియో సిడి, విడియో కంపాక్ట్ డిస్క్ (VCD), సూపర్ విడియో కంపాక్ట్ డిస్క్ (SVCD), ఫొటో సిడి, పిక్చర్ సిడి, CD-i, Enhanced CD - ఇలా ఎన్నో రకాల డిస్కులు లభిస్తున్నాయి. CD-ROM , CD-R లు ఇప్పటికీ అత్యధికంగా వాడుతున్న మీడియా సాధనాలు. 2004లో ప్రపంచ వ్యాప్తంగా 30 బిలియన్ డిస్కులు (CD audio, CD-ROM, CD-R) అమ్ముడయ్యాయి.[1]

అంతకు ముందు వెలువడినా గాని అంతగా విజయవంతం కాని లేజర్ డిస్క్ టెక్నాలజీయే కంపాక్ట్ డిస్క్ ఆవిర్భావానికి పునాది. 1977లో ఫిలిప్స్ కంపెనీ ఆప్టికల్ లేజర్ డిస్క్ టెక్నాలజీలను అభివృద్ధి చేసింది. 1979లో సోనీ , ఫిలిప్స్ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాయింట్ టాస్క్ ఫోర్స్ ఈ కంపాక్ట్ డిస్కులను రూపొందించింది.[2] ఒక సంవత్సరం ప్రణాళిక , శ్రమ అనంతరం తయారైన ప్రమాణాలకు అనుగుణంగా తక్కిన పరిశోధన నడిచింది. ఈ ప్రయత్నంలో పారిశ్రామికంగా డిస్కులను తయారు చేయడానికి అవసరమైన నిర్మాణ పరిజ్ఞానాన్ని ఫిలిప్స్ అందించింది. ఇంకా ఫిలిప్స్ సమకూర్చిన Eight-to-Fourteen Modulation (EFM) మరింత "ప్లే టైమ్" అందించడానికి, గీతలు, ముద్రలనుండి రక్షణ కల్పించడానికి ఉపయోగపడే విధానం. సోనీ నుండి error-correction విధానం, CIRC విధానం సమకూరాయి. ఇలా కంపాక్ట్ డిస్క్ అనేది పలువురి సమష్టి కృషి ఆధారంగా రూపొందిన విజ్ఞానం. Compact Disc Story, [3]లో ఈ ప్రయత్నంలో జరిగిన ప్రయోగాలు, చర్చలు, నిర్ణయాల గురించి చెప్పబడింది.[4]

ఇవి కూడా ఛూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Compact Disc hits 25th birthday
  2. "How the CD was developed". BBC News. 2007-08-17. Retrieved 2007-08-17.
  3. Kees A. Schouhamer Immink (1998). "The CD Story". Journal of the AES. 46: 458–465. Archived from the original (html) on 2014-11-04. Retrieved 2007-02-09.
  4. "The Inventor of the CD". research.philips.com/ Philips research]. Retrieved 2007-02-09.

బయటి లింకులు

[మార్చు]