Jump to content

సీతారాం బాగ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

సీతారాంభాగ్ శాసనసభ నియోజకవర్గం 1967లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభా నియోజకవర్గం. 1978లో ఈ నియోజకవర్గం రద్దయి ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1972 జనరల్ ఎస్.రహమాన్ పు స్వతంత్ర అభ్యర్ధి 16884 ఎస్.వై.రెడ్డి పు ఎస్.టి.పి.ఎస్ 14895
1967 జనరల్ అహ్మద్ హుస్సేన్ పు స్వతంత్ర అభ్యర్ధి 17478 డి.గోస్వామి పు ఎస్.ఎస్.పి 10842

1967 ఎన్నికలు

[మార్చు]

1967 ఫిబ్రవరి 21న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ శాసనసభ మొత్తం ఓటర్లు 71359 మంది. అందులో 39873 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో 38694 ఓట్లు చెల్లినవి కాగా 1179 ఓట్లు తిరస్కరించబడ్డాయి.

అందులో ఇండిపెండ్ంట్ అభ్యర్థి ఎ హుస్సేన్ కు 17478, ఎస్.ఎస్.పి అభ్యర్థి అయిన డి.గోస్వామికి 10824 ఓట్లు వచ్చాయి. ఎ.హుస్సేన్ 6654 మెజారిటీతో గెలుపొందాడు.[2]

1972 ఎన్నికలు

[మార్చు]

1972 మార్చి 15న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం ఓటర్లలో 48335 మంది పురుషులు, 45985 మంది స్రీలు కలిపి మొత్తం 94320 ఓటర్లు ఉన్నారు. అందులో 47476 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 46403 ఓట్లు చెల్లినవి కాగా 1073 ఓట్లు తిరస్కరించబడ్డాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి షాపూర్ రహ్మాన్ కు 16844 జోట్లు రాగా సమీప ప్రత్యర్థి సోమ యాదవ రెడ్డికి 14898 ఓట్లు వచ్చాయి. ఎస్.రహమాన్ 1946 జోట్ల మెజారితీతో గెలుపొందాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 219.
  2. https://ceotelangana.nic.in/Archives/StasticalReports/StatRep_AP_1967.pdf
  3. https://ceotelangana.nic.in/Archives/StasticalReports/StatRep_AP_1972.pdf