సుకృతి కండ్పాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుకృతి కండ్పాల్
బాక్స్ క్రికెట్ లీగ్ పాటీలో సుకృతి కండ్పాల్
జననం (1987-11-20) 1987 నవంబరు 20 (వయసు 36)[1]
జాతీయతభారతీయులు
ఇతర పేర్లుసుకు[2]
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు2007–present
సుపరిచితుడు/
సుపరిచితురాలు
దిల్ మిల్ గయే
ప్యార్ కీ ఏక్ కహానీ
దిల్లీ వాలీ ఠాకూర్ గర్ల్స్
బిరుదుమిస్ ఇండియా వరల్డ్ వైడ్ ఇండియా 2011, మిస్ బాలీవుడ్ దివా

సుకృతి కండ్పాల్, భారతీయ టీవీ నటి, మోడల్. ఆమె నటించిన అగ్లే జనమ్ మోహే బిటియా హి కిజో, దిల్ మిల్ గయే, ప్యార్ కీ యే ఏక్ కహానీ, కైసా యే ఇష్క్ హై..  అజబ్ సే రిస్క్ హై,  దిల్లీ వాలీ ఠాకూర్ గర్ల్స్  వంటి సీరియళ్ళ ద్వారా  ప్రఖ్యాత నటిగా నిలిచింది సుకృతి. 2014లో బిగ్ బాస్ 8లో పాల్గొంది ఆమె. కానీ రెండు వారాల  తరువాత షో నుంచీ నిష్క్రమించింది సుకృతి.[3] 2015లో ఆమె దిల్లీ వాలీ ఠాకూర్ గర్ల్స్ అనే ధారావాహికలో నటించింది. జీటీవీలో ప్రసారమవుతున్న  కాలా టీకా  సీజన్-2లో  ప్రధాన పాత్ర నైనాగా నటించింది  సుకృతి.

తొలినాళ్ళ జీవితం, చదువు

[మార్చు]

ఉత్తరాఖండ్ లోని నైనీటాల్ లో ఒక కుమౌనీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది సుకృతి. ఆమె తండ్రి బి.డి.కండ్పాల్. ఆమెకు ఒక అక్క భావన కండ్పాల్, తమ్ముడు మంజుల్ కండ్పాల్ ఉన్నారు.[4] ఆమె తండ్రి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్నాడు. సుకృతి చదువుకునే రోజుల్లో తన తండ్రిలానే న్యాయశాస్త్రం చదవాలని అనుకునేది.[5]

నైనీటాల్ లోని సెయింట్ మేరీస్ కాన్వెంట్ హైస్కూల్ లో ప్రాధమిక విద్య అభ్యసించింది సుకృతి.[6] ఆ తరువాత ముంబైలోని సోఫియా మహిళా కళాశాలలో చదువుకుంది ఆమె.[7]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "'I was not apprehensive about taking up Dill Mill Gayee'". 12 September 2008. Retrieved 26 November 2015.
  2. "TV actors and their 'nicknames' part 2". Tellychakkar. November 15, 2015.
  3. "Sukirti Kandpal and Soni Singh in Bigg Boss". timesofindia.com. Retrieved 20 September 2014.
  4. "Sukirti Kandpal: the vampire girl of Indian television". himalayanbuzz.com. Retrieved April 14, 2017.
  5. "Sukirti Kandpal, happy birthday!". bollywoodlife.com. November 20, 2012. Retrieved April 14, 2017.
  6. "Taste of Nainital with Sukirti Kandpal". yahoo.com.
  7. "Sukirti might look like her but she doesn't want to ape Kangana". dnasyndication.com. November 27, 2009.

బయటి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.