సుగంధతైలచికిత్స

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


సువాసనలు మనసును ఉత్తేజభతం చేయడామే కాక మనసు వత్తిడి తగ్గిస్తాయి. సువాసన తైలాల మర్ధన ఒక వైద్య విధానంగా ఆఅధునిక కాలంలో ఉపయోగపడుతోంది. దీనిని ఆంగ్లభాషలో అరోమాథెరఫీ అంటారు. నిజానికి ఇది వ్యాధిని నిజంగా నయం చెయ్యదు. ఈ వైద్యం మనసుకు ఆనందం కలిగించే 'ఎండార్ఫిన్లు' అనే రసాయనాలు విడుదల చేస్తుంది. తత్ఫలితంగా వ్యాధి నిరోధకాన్ని కలిగించి, అనేక వ్యాధులకు మూలకారణమౌతున్న 'ప్రీ రాడికల్స్' పెరగకుండా చేస్తుంది.. వ్యాధి నిరోధకమైన 'ఏంటీ ఆక్సి డెంట్లను' విడుదల చేయడానికి సహకరిస్తుంది.

చరిత్ర[మార్చు]

అరీమాథెరఫీ 6 వేల సంవత్సరాలకు ముందే గ్రీకులు, రోమన్లు ఉపయోగించే వారు. గాఢ తైలాలతో శరీరాన్ని మర్ధన చెయ్యడమే అరోమా థెరఫీ. ఈ తైలాలలో ఔషధీ గుణాలు కలిగినప్పుడు, వాటిని వ్యాధితో బాధించబడుతున్న శరీర భాగాలకు మర్ధన చేసినప్పుడు బాధనుండి విముక్తి కలుగుతుంది. ఉదాహరణగా బాధా నివారిణిగా ఉపయోగించే నీలగిరి తైలంవంటివి వాటిలో ఒకటి.11 వ శతాబ్దంలో వ్యాప్తిలో ఉన్న ఈ చికిత్సను కాథలిక్ చర్చులు నిషేధించిన తరువాత ఈ చికిత్స కొంతకాలం కనుమరుగై పోయింది. అప్పట్లో కాథలిక్ చర్చ్ సహజ వైద్య విధానాలన్నింటిని నిషేధించింది. ఆధునిక కాలంలో బ్యూటీ పార్లర్లు ఈ చికిత్సను తమ సేవలలో ఒక భాగంగా ఉపయోగిస్తున్నాయి. ఆధునిక చికిత్స పితామహుడు హిప్పోక్రేట్స్ తన చికి త్సలలో భాగంగా అరోమా చికిత్సను వాడేవాడని ప్రతీతి.1920లో ఫ్రెంచ్ రసాయనిక శాస్త్రవేత్త రెన్ ప్రయోగం చేస్తున్న తరుణంలో ఆయన చేయి కాలగా ఆ చేతిని పక్కవ ఉన్న లావెండర్లో ముంచగా ఆయన గాయం త్వరగా నయమైనందని, ఆ తరువార ఆయన మొక్కల మీద తైలాల ప్రయోగాలు చేసి ఈ తరహా చికిత్సకు అరోమాథెరఫీ అని నామకరణం చేసాడు

ఉపయోగాలు[మార్చు]

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును అన్నంతో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించి నట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం..... అలసిన మనసుకి... అరోమానూనె ఎంతో మేలు చేస్తుంది. శారీరక, మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మనసును ఉత్తేజితపరుస్తుంది. స్నానం చేసే నీటిలో వాడినా.. కొద్దిగా వాసన పీల్చినా.. ఆ ప్రయోజనాల ప్రత్యేకతే వేరు. ఎనిమిది రకాల సువాసనలను అష్టగంధాలు అని పేర్కొంటారు. ఇవి: కర్పూరం, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, అత్తరు, శ్రీగంధం. పువ్వులు, ఔషధాలు.. ఇతర సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే ఈ నూనెలు.. రోజ్‌మేరీ, జాస్మిన్‌, లావెండర్‌, యూకలిప్టస్‌, టీట్రీ.. ఇలా పలు రకాల్లో లభ్యమవుతాయి. మానసిక సాంత్వననందిస్తాయివి. ఈ నూనెల్ని పొద్దున పూట కన్నా.. రాత్రిళ్లు వాడటమే మేలు. పొద్దున రాసుకోవడం వల్ల చర్మంలోని గ్రంథులు తెరచుకుని దుమ్ము, మురికి చేరతాయి. ఉదయం రాసుకోవాలనుకుంటే.. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. కురులకు మేలు: శిరోజాలు జిడ్డుగా మారుతున్నాయా.. వాడే షాంపూలో కొద్దిగా టీ ట్రీ నూనె వేసి తలస్నానం చేస్తే.. జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. * జుట్టు పొడిబారడం.. పొట్టులా రాలడం వంటి సమస్యలు వేధిస్తుంటే.. షాంపూలో కొద్దిగా రోజ్‌మేరీ నూనె కలిపి స్నానం చేయాలి. గాఢత తక్కువున్న షాంపూలను మాత్రమే వాడాలి. * యాపిల్‌సిడర్‌ వెనిగర్‌ కప్పు తీసుకుని అందులో నాలుగు చుక్కల నిమ్మ, లావెండర్‌, నూనెలు కలిపి గాలిచొరని డబ్బాలోకి మార్చుకోవాలి. తలస్నానం చేసిన తరువాత ఈ మిశ్రమాన్ని చెంచా తీసుకుని మగ్గునీటిలో కలిపి తలపై ధారలా పోయాలి. ఇది జుట్టుకు పోషణని మెరుపునూ తెస్తుంది. * ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా పొడిబారిన చర్మం కోమలత్వాన్ని సంతరించుకోకపోతే వీట్‌ గ్రెయిన్‌ నూనె వాడి చూడండి. * అలసిన శరీరానికి, మనసుకు ఉపశమనాన్ని అందించే శక్తి.. లావెండర్‌ నూనె సొంతం. ఈ నూనెను చర్మ సంరక్షణకు పెట్టింది పేరు. ... అరోమా నూనెలతో చేసిన కొవ్వొత్తులను గదిలో ఓ మూల ఏర్పాటు చేస్తే మనసుకు హాయిగా ఉంటుంది. మొదటిసారి వీటిని వాడాలనుకున్నవారు నిపుణుల సూచనల మేరకు ఎంచుకోవచ్చు. ఈ నూనెలు ఎప్పుడైనా కళ్లకు తగిలితే.. వెంటనే ఆలివ్‌నూనె అద్ది.. ఆ తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఇవీ జాగ్రత్తలు.. వీటిని కొనుగోలు చేసేముందు నిపుణుల సలహా తీసుకొంటే మంచిది. వందశాతం ఎసెన్షియల్‌ లేదా నాణ్యమైనవి అని రాసున్న వాటినే ఎంచుకోవాలి. * అరోమా నూనెల్ని చర్మానికి నేరుగా రాయకూడదు. బాదం వంటి ఇతర నూనెలతో కలిపి రాసుకోవాలి. * ఎలాంటి అరోమా నూనైనా సరే కొద్దిగా మాత్రమే వాడాలి. * చర్మానికి కొద్దిగా రాసుకుని.. ఎలర్జీ సమస్య లేదని నిర్థారించుకున్నాకే వాడటం మేలు. * వీటిని చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి.

సుగంధ చికిత్స (ఆరోమాథెరపీ)-[మార్చు]

(Bhavani Shankar Kodali MD, Associate Professor, Karl Frindrich MD),

నొప్పుల సమయంలో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంకోసం ఈ సుగంధ చికిత్సను ఉపయోగిస్తున్నారు. ఈ విధానం ఇటీవల అందరి దుఎష్టిని ఆకర్షిస్తున్నది. నొప్పుల సమయంలో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవడంకోసం చాలా మంది అరోమాథెరపీని ఆశ్రయిస్తున్నారు. అరోమాథెరపీ వల్ల ప్రత్యక్షంగా లేక పరోక్షంగా బాధ తగ్గిన ఆనవాళ్లేమీ లేవు. కానీ నొప్పులు పడే మహిళల్లో ఈ థెరపీ ఒత్తిడి తగ్గించి, బాధను సహించే శక్తిని పెంచుతుంది. సుగంధ చికిత్స ప్రసూతికి సహకరించే వారిలోనూ, సన్నిహితుల్లోనూ ఒత్తిడి తగ్గించి మొత్తంగా ఆహ్లాదకర వాతావరణొ స్రుష్టించడానికి దోహదం చేస్తుంది. టెక్నిక్: గులాబీ, గంధం, గన్నేరు, ఇతర పుష్పాల నూనెలను స్నానం సందర్భంగా ఉపయోగిస్తారు. తుడుచుకునే బట్టలపై చల్లుతారు. మర్ధన సందర్భంగా కూడా ఈ నూనెలను వాడతారు. గర్భిణీ స్త్రీల శరీరంపై చల్లడం కూడా మరో పద్ధతి. నొప్పుల తీవ్రతను బట్టి ఒక్కో దశలో ఒక్కో రకం నూనెను వాడడం మంచిదని కొందరు సిఫారసు చేస్తారు. నొప్పులు తొలిదశలో ఉన్నప్పుడు ప్రశాంతతను ఇచ్చే నూనెలను ఉపయోగించాలని కొందరు సూచిస్తారు. నొప్పులు రెండవ దశకు చేరుకోగానే, అంటే బిడ్డ గర్భాశయం నుంచి బయటకి రావడం మొదలు కాగానే పెప్పర్ మింట్ వంటి నూనెలను ఇవ్వాలని, అది ధీమాను, నైతిక స్తైర్యాన్ని పెంచుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఉపయోగించే కొన్ని నూనెలు, వాటి ధర్మాలను దిగువ ఇస్తున్నాము: చామోమైల్: చేమంతి పువ్వువంటి. ప్రశాంతతనిస్తుంది. రుతుక్రమానికి ముందు బాధను, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అజీర్తిని నివారిస్తుంది. ముక్కు చీముడు (రైనిటిస్), మొటిమలు, ఎక్జీమా, ఇతర చర్మసంబందమైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. యూకలిప్టస్: జామాయిల్, దగ్గు, జలుబు, రొమ్పు పడిశం (బ్రాంకైటిస్), వైరస్ నుంచి వచ్చే వ్యాధులు (వైరల్ ఇన్ఫెక్షన్స్), కండరాల నొప్పులు, కీళ సంబందమైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. యాంటీసెప్టిక్ గా ఉపయోగపడుతుంది. జెర్మేనియం: ఒక రసాయనం. కషాయం వలె పనిచేస్తుంది. గాయాలు, పుండ్లు, శిలీంద్రాల నుంచి వచ్చే వ్యాధులను (ఫంగల్ ఇన్ఫెక్షన్స్) ను మాన్చడానికి ఉపయోగపడుతుంది. క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. చర్మసంబందమైన సమస్యలు, గజ్జి, తామర, గాయాలు మానడానికి దోహదం చేస్తుంది. స్వల్పంగా మూత్రకారకంగా పనిచేసే ఈ రసాయనం యాంటీ డిప్రెసెంట్ గా కూడా పనిచేస్తుంది. లావెండర్: మరువం వంటి ఒక మొక్క. తలనొప్పులను, గాయాలను మాన్చడానికి ఉపయోగపడుతుంది. యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. కీటకాలు కాటువేసినప్పుడు విరుగుడుగా పనిచేస్తుంది. మొటిమలు, వాపులు తగ్గిస్తుంది. నిద్రలేమినుంచి కాపాడుతుంది. స్వల్పంగా డిప్రెషన్ కారకంగా పనిచేస్తుంది. రోజ్: గులాబీ. గొంతువాపు, ముక్కుపుట్టేయడం, ఊపిరాడకపోవడం వంటి సమస్యలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. స్వల్పంగా నిద్రకారకంగా పనిచేస్తుంది. రుతుక్రమం ముందు, మెనోపాజ్ సమయంలోనూ కలిగే బాధ, ఒత్తిడి నుంచి ఊరటనిస్తుంది. కామాతురత తగ్గడం వంటి సమస్యలకు కూడా గులాబీ ఉపయోగపడుతుంది. రోజ్ మేరీ: దవనం వంటి ఒక మొక్క, మానసిక, శారీరక అలసట నుంచి ఊరటనిస్తుంది. మతిమరుపు నుంచి కాపాడుతుంది. ఆస్త్మా, ఇతర శ్వాసకోశ సంబంధ వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు, ఇతర బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శాండల్ వుడ్: మంచిగంధం. పొడిగా ఉన్న, పగిలిన శరీరానికి యాంటీ సెప్టిక్ గా ఉపయోగపడుతుంది. మొటిమలు తగ్గించడానికి దోహదం చేస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతతను ఇస్తుంది. ఉత్తేజకారిగా పనిచేస్తుంది. మార్జోరం: మరువం. తలనొప్పులను, గొంతువాపును, రుతుసంబంధమైన నొప్పిని తగ్గిస్తుంది. నిద్రాకారకంగా పనిచేసి, నిద్రలేమిని నివారిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మొటిమల నివారణకు దోహదం చేస్తుంది. జాస్మైన్: జాజి పువ్వు. మనోవ్యాకులత (డిప్రెషన్) కు గురైనవారికి ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రసూతికి ముందు తలెత్తే వ్యాకులత నుంచి ఊరటనిస్తుంది. ప్రసూతి నొప్పుల సమయంలో ఉత్తేజకారిగా పనిచేసి, గర్భాశయం విస్తరించడానికి దోహదం చేస్తుంది. నెరోలి: నారింజ చెట్ల నుంచి తీసే తైలం. నిద్రాకారకంగా పనిచేస్తుంది. వ్యాకులతకు, నిద్రలేమికి, నరాల బలహీనతకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణను వేగిరపర్చుతుంది. వెన్నునొప్పిని తగ్గిస్తుంది. మొటిమలు నివారిస్తుంది. రుతుక్రమం ముందు కలిగే బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మరిన్ని వివరాలకోసం చూడండి:www.aworldofaromatheraphy.com పరిమితులు * నేరుగా బాధను నివారించే లక్షణాలు కనిపించవు.

వ్వతిరేక ప్రభావాలు[మార్చు]

  • కొన్ని రకాల తైలాలు కొందరికి మనో వికారాలు (అలర్జీ) కలిగించవచ్చు. * నొప్పులు పడే చాలా మంది మహిళలకు కొన్ని రకాల తైలాలు పడకపోవచ్చు. కంపరం పుట్టించి, వాంతులు కావడానికి దారితీయవచ్చు. నొప్పుల సమయంలో సుగంధ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాల గురించి మంచి అధ్యయనాలు ఏమీ లేవు. ఈ చికిత్సవల్ల కొన్ని సమస్యలూ ఉన్నాయి. కొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. అందువల్ల ఇది ఒక అనుబంధ చికిత్సగా మాత్రమే ఉపయోగపడుతుంది. తమకు బాగా నచ్చే సుగంధ తైలాలను మాత్రమే ఎంపికచేసుకుని ఉపయోగించడం ప్రసూతి మహిళలకు మంచిది. దీంతో కంపరం, వాంతులు కలిగించే తైలాలను ముందుగానే నివారించవచ్చు. పై సమాచారాన్ని దిగువ పేర్కొన్న ప్రచురణల నుంచి తీసుకోవడం జరిగింది. సుగంధ చికిత్స గురించి మరింత సమాచారం కావాలనుకునే వారు దిగువ సూచించిన పత్రాలు, వెబ్ సైట్లు చూడగోరుతున్నాము: https://web.archive.org/web/20110105123432/http://www.childbirthsolutions.com/articles/birth/aromabirth/index.php https://web.archive.org/web/20041108021442/http://www.securewebexchange.com/poyanaturals.com/catalog/default.php

ఉపయోగించే సుగంధాలు వాటి ఉపయోగాలు[మార్చు]

మల్లె తైలం:- మల్లె సుగంధం. వత్తిడిని తగ్గించి మనసును ప్రశాంత పరుస్తుంది కనుక మనోవిశ్వాసం పెరగడానికి దోహదం చేస్తుంది. లావెండర్:- అత్యధికంగా వాడకంలో ఉన్న సుగంధ తైలమిది. ఇది వత్తిడిని తగ్గిస్తుంది. డియోడరెంటు, ఏంటీ సెప్టెక్ గా కూడా పనిచేస్తుంది. మైగ్రెయిన్ తలనొప్పిని, జలుబును తగ్గిస్తుంది. స్నానం చేసే నీటిలో రెండు చుక్కలు వేస్తే నూతనోత్సాహం కలిగిస్తుంది. దిండు మీద రెండు చుక్కలు చిలకరించి నిద్రిస్తే ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. లావెండరును సోపులు, లోషన్ తయారీలో కూడా అధికంగా ఉపయోగిస్తారు.

గులాబీ తైలం:- ఇది మాససిక వత్తిడిని తగ్గించి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. సంపెంగ తైలం :- ఇది మానసిక వత్తిడిని తాగ్గిస్తుంది. జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. తలనొప్పి తగ్గడానికి సహకరిస్తుంది. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. మరువం :- ఇది మానసిక వత్తిడిని తగ్గిస్తుంది. మలబద్ధకం టెన్షన్, తలనొప్పిని తగ్గిస్తుంది. దీనిని నీటిలో వేసి వాసన పీల్చితే ఆస్తమా, సైనస్ తగ్గుముఖం పడుతుంది. స్నానం చేసే నీటిలో వేస్తే హైపర్ ఏక్టివ్ పిల్లలు కొంత నెమ్మదిస్తారు. రోజ్ మేరీ :- మానసికోత్తేజం కలిగిస్తుంది. మానసిక వత్తిడిని తగ్గిస్తుంది. షాంపూలలో చేర్చితే జుట్తూ పెరగడానికి సహకరిస్తుంది. కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. ఙాపక శక్తిని కలిగిస్తుంది.

నిమ్మ:- వత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఏకాగ్రతను కలిగిస్తుంది.. రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది.

తైలాల తైయారీ మూలాలు[మార్చు]

గాఢ తైలాలు సువాసన భరితమైన పూలు, ఆకులు, చెట్లబెరడు, సువాసన ద్రవ్యాలు, ఔస్హధ మొక్కలు మొదలైన వాటి నుండి తయారు చేస్తారు. పూలు:గులాబీ, మల్లె, లావెండర్, సంపంగి మొదలైనవి. పండ్లు: ద్రాక్ష, నిమ్మ, నారింజ మొదలైనవి. ఆకులు: పుదీనా. తులసి, వాము, నీలగిరి ఆకులు. సుగంధ ద్రవ్యాలు: యాలకులు, లవంగాలు, జాజికాయ మొదలైనవి. బెరడు: చందనం, సెడారి మొదలైనవి. భూమి నుండి ఓక్ మాస్, పాట్చౌలి మొదలైనవి.

విధానాలు[మార్చు]

అరోమా తెరఫీ తైలాలను నేరుగా వాసన చూడడం, మర్ధన చేయడం, స్నానం చేసే నీటిలో వేయడం, నీటిలో వేసి ఆవిరి పట్టడం వంటి పద్ధతి ద్వారా చికిత్సలో ఉపయొగిస్తారు.

  • నీలగిరి తైలం ఆవిరి పట్టడం.
  • లావెండర్ స్నానం చేసే నీటిలో వెయ్యడం.
  • సబ్బులు, షాంపూలలో చేర్చడం.
  • నీలగిరి తైలం, వాము, లవంగ తైలం: మర్ధన చెయ్యడం.

ఉపయోగాలు[మార్చు]

మానసిక వత్తిడి నుండి ఉపశమనం, వ్యాధి నివారణ, మానసిక ఉల్లాసం, నూతనోత్తేజం, సౌందర్య పోషణ, నొప్పుల నుండి విముక్తి. హైపర్ టెన్షన్, సాధారణ వత్తిడి, మానసిక అశాంతి వంటివి తగ్గించడం, తల నొప్పి, కండరాల నొప్పి, కీళ్ళ నొప్పి, బెణుకులు మొదలైన నొప్పులు, మలబద్ధకం, పార్శ్య వాయువు వలన చచ్చుబడిన భాగాలకు మర్ధించడం వలన ఆయా శరీర భాగాల పనితీరు మెరుగుపడడం. రక్తపోటు మొదలైన వ్యాధుల వంటివాటిని ఈ చికిత్సతో కొంత తగ్గించవచ్చు. జలుబు, ఆస్త్మా వంటివి మరుగుతున్న నీటిలో తైలం వేసి, వస్త్రంతో తలను మూసి ఉంచి ఆవిరి పట్టడం ద్వారా తగ్గించవచ్చు.

జాగ్రత్తలు[మార్చు]

అరోమా థెరఫీలో వాడబడే తైలాలు చాలా గాఢత కలిగినవి కనుక కొన్ని సమయాలలో వీటిని నేరుగా వాసన చూడడం కారణంగా తలనొప్పులు, కళ్ళు మండడం మొదలైనవి సంభవించవచ్చు. కళ్ళకు దూరంగా ఉంచి మర్ధన చెయ్యాలి, చర్మంపై నేరుగా వేయకుండా ఆలివ్ ఆయిల్. కొబ్బరి నూనె వంటి నూనెలతో కలిపి ఉపయోగించాలి. రక్తపోటు, మూర్చ రోగం ఉన్నవారు, గర్భవతులు వైద్యుల సలహాతో వాడాలి. పిల్లలకు దూరంగా ఉంచాలి. సీసా మీద ఉన్న జాగ్రత్తలను చక్కగా చదివి సూచించిన విధంగానే వీటిని వాడాలి.

మూలాలు[మార్చు]