సుచిత్ర ఎల్లా
సుచిత్ర ఎల్లా | |
---|---|
![]() | |
జననం | 1963 |
జాతీయత | ![]() |
వృత్తి |
|
వీటికి ప్రసిద్ధి | శాస్త్రవేత్త, డాక్టర్ |
జీవిత భాగస్వామి | కృష్ణ ఎల్ల |
పిల్లలు | వీరేంద్ర దేవ్[1] |
సన్మానాలు | పద్మభూషణ్ |
వెబ్‌సైటు | [1] |
సుచిత్ర ఎల్లా భారతీయ బయోటెక్ శాస్త్రవేత్త, భారతదేశంలో మొట్టమొదటి కరోనా టీకా మందును కనుగొన్నా భారతీయ బయోటెక్ అంతర్జాతీయ లిమిటెడ్ కో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్. స్వదేశీ కొవిడ్ టీకా ‘కొవ్యాక్సిన్’ ఆవిష్కరణకు గాను భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులకు భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.[2][3][4]
సుచిత్ర కె. ఎల్లా 2012-13 సంవత్సరానికిగాను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆంధ్రప్రదేశ్ చైర్‌పర్సన్‌గా,[5] సీఐఐ - దక్షిణ ప్రాంత చైర్‌పర్సన్‌గా 2022-23 సంవత్సరానికిగాను పని చేసింది.[6]
టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా
[మార్చు]సుచిత్ర ఎల్లాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యురాలిగా అక్టోబర్ 30న ప్రభుత్వం నియమించగా,[7] ఆమె నవంబర్ 7న టీటీడీ బోర్డు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసింది.[8]
ప్రభుత్వ సలహాదారుగా
[మార్చు]సుచిత్ర ఎల్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ 2025 మార్చి 19న ఉత్తర్వులు జారీ చేశాడు. ఆమె కేబినెట్ ర్యాంకుతో రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. చేనేత, హస్త కళల అభివృద్ధికి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తారు.[9][10]
పురస్కారాలు
[మార్చు]- ఆంధ్ర ఛాంబర్ అఫ్ కామర్స్ 'బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు 2020[11]
- 2022 పద్మభూషణ్ పురస్కారం[12][13]
- 2021 రామినేని ఫౌండేషన్ పురస్కారం[14]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (2017). "Politicians, industrialists attend big fat wedding of Ramoji Rao's granddaughter". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ Eenadu (25 January 2022). "కృష్ణ ఎల్ల దంపతులకు పద్మభూషణ్". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ Andhrajyothy (26 January 2022). "'భారత్' గర్జించే.. 'భారత్' గర్వించే!!". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ Sakshi (26 January 2022). "మన తెలుగు పద్మాలు". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ "Suchitra Ella new CII chief of AP chapter" (in Indian English). The Hindu. 15 March 2012. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.
- ↑ "సీఐఐ దక్షిణ ప్రాంత విభాగం (సౌత్ రీజియన్) ఛైర్‌పర్సన్‌గా సుచిత్ర ఎల్ల". Eenadu. 17 March 2022. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.
- ↑ "టీటీడీ పాలకమండలి తుది జాబితా ఇదే." Andhrajyothy. 1 November 2024. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.
- ↑ "టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా సుచిత్ర ఎల్ల ప్రమాణ స్వీకారం". ETV Bharat News. 7 November 2024. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.
- ↑ "చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా సుచిత్ర ఎల్ల". Eenadu. 19 March 2025. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.
- ↑ "రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా సోమనాథ్, సతీష్‌రెడ్డి, సుచిత్ర ఎల్ల, కేపీసీ గాంధీ". Eenadu. 20 March 2025. Archived from the original on 20 March 2025. Retrieved 20 March 2025.
- ↑ Eenadu (15 February 2021). "సుచిత్ర ఎల్లా, పుల్లెల గోపీచంద్‌లకు బిజినెస్ ఎక్సలెన్స్ పురస్కారం". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ V6 Velugu (25 January 2022). "డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు పద్మ భూషణ్" (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (2022). "పద్మభూషణ్ అందుకున్న డాక్టర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.
- ↑ Sakalam (6 November 2021). "భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్రలకు రామినేని ఫౌండేషన్ పురస్కారం". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.