సుజుకి హయబుస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2007 సుజుకి GSX1300R

సుజుకి హయబుస (2008కు మునుపు GSX 1300R అని పిలిచేవారు) ప్రస్తుతానికి ప్రపంచంలో అతి వేగవంతమైన మోటర్ సైకిల్. ఇది జపాన్కు చెందిన సుజుకి కంపెనీచే 1999లో తయారు చేయబడింది. దీని ఇంజన్ 1340 సిసి సామర్థ్యం కలిగినది. గరిష్ఠ వేగం గంటకు 305 కిలో మీటర్లు. దీని సరికొత్త 2008 మోడల్ ధర 11999 డాలర్లు. (473960 రూపాయలు, దిగుమతి సుంకాలు అదనం).

బైక్ చరిత్ర

[మార్చు]

జపాన్ జానపద కథల ప్రకారం హయబుస అనేది ఒక అతి వేగవంతమైన పక్షి. మొదటి మోడల్ 1999 లో తయారు చేయబడింది. అప్పటికి వేగవంతమైన బైక్ హొండా సిబి అర్ 1100 యక్స్ యక్స్ ను ఇది అధిగమించింది. హయబుస మొదటి మోడల్ ను GSX 1300R అంటారు. దీని సామర్థ్యం 1299 సిసి. 2007 వరకు దీనిలో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.

వివిధ దశలలో హయబుస వేగం క్రింది విధంగా ఉంటుంది:

  • 60-80 మైళ్ళ వేగం 3.13 సెకండ్లలో[1]
  • 80-100 3.31 సెకండ్లలో[1]
  • 143.7 మైళ్ళ వేగం 10.02 సెకండ్లలో అందుకోగలదు[1]
  • సామర్థ్యం: 156.1 హెచ్ పి (9500 ఆర్ పి యం) [1]

BMW K1200S, కావసాకి నింజా ZX-12R, కావసకి నింజా ZX-14 మోడళ్ళ నుండి గట్టి పోటీ ఎదురు కావడం చేత 2008 లో ఈ బైక్ అనేక మార్పులకు గురైంది. ఇంజన్ సామర్థ్యం 1340 సి.సి.కి పెంచబడింది. దీని వల్ల అశ్వ సామర్థ్యం 12.5 శాతానికి పెరిగింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "GSX1300R సాధించిన సంఖ్యలు" (in ఆంగ్లం). స్పోర్ట్సు రైడరు. 2005. Archived from the original (HTML) on 2007-09-15. Retrieved సెప్టెంబరు 15, 2007.{{cite web}}: CS1 maint: unrecognized language (link)