సుడ్దులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుడ్దులు చిత్తూరు జిల్లాలొ కొన్ని ప్రాంతాలలో కార్తీక నక్షత్రం రోజున సుడ్దుల పండుగ జరుపుతారు. గోగు పుల్లలను చేర్చి.. సుమారు పది ఇరవై అడుగుల పొడవుగా కట్టి చివరన నిప్పు పెట్టి ఆ వూరి పిల్లలందరు వాటిని ఎత్తుకొని "డేహేరి మాముల్లో....... డేహేరి గుళ్లారి గో....... అంటూ వూరి చుట్టు తిరిగి అక్కడ వున్న గుడుల ముందు ఆ చుడ్దులతో దీవించి అలా తిరుగుతూ చివరిగా ఊరు బయట తోలు బొమ్మలాడిస్తారు. తోలు బొమ్మలాట అంటే నిజమైన తోలు బొమ్మలాట గాదు. ఒక పెద్ద తెల్లని బట్టను ఇద్దరు మనుషులు తెరగా పట్టుకొని ఆ తెర ముందు చిన్న పిల్లలు అనేక బంగిమల్లో కూర్చొని, నిలబడి, చేతుల్లో విల్లంబులు గా, కత్తులుగా గోగు పుల్లలను పట్టుకొని వుండగా ఆ పిల్లల ముందు ఒకడు ఒక మండుతున్న 'సుడ్దు'ను పట్టుకొని గుండ్రంగాను, అడ్డ దిడ్డంగాను తిప్పుతాడు. తెరకు రెండో వైపున పిల్లలందరు నిలబడి వుంటారు. సుడ్దు వెలుగు అక్కడ నిలబడి వున్న పిల్లల పై పడి అది తిప్పుతున్నందున వారి నీడ తెరపై పడి అవతలి వైపున వారి నీడ అనేక విదాలుగా కదులు తో కనబడు తుంది. ఇదొక ఆట. చివరగా వాటిని అన్నింటిని ఒక కుప్పగా వేసి కాలుస్తారు. దానిని అవ్వా గుడెసె అంటారు. అంతా కాలాక మిగిలిన నిప్పుల్లో పిల్లలందరు నడుస్తారు. అవి గోగు పుల్లల నిప్పులు గాన కాళ్లు కాలవు. సుడ్దులు ఎత్తుకొని తిరిగేటప్పుడు కొన్ని బూతు పాటలు కూడ పాడుతారు. ఒక ఊరి వారందరు కలిసి ఒక పెద్ద సుడ్దుని కట్టి దానిని బండి మీద పెట్టి చివరన నిప్పు పెట్టి దాన్ని ఎద్దులతో తోలుతూ ఊరేగిస్తారు. దాన్ని బండి సుడ్దు అంటారు. ఇటు వంటి పండగలు రాను రాను కనుమరుగవుతున్నవి. ఆ రాత్రికి అక్కడక్కడ వున్న కొండలపైన గుట్టలపైన పెద్ద మంట పెడతారు. దాన్ని ఆకాశ దీపం అంటారు

"https://te.wikipedia.org/w/index.php?title=సుడ్దులు&oldid=1219370" నుండి వెలికితీశారు