Jump to content

సుబి సురేష్

వికీపీడియా నుండి
సుబి సురేష్
దస్త్రం:Subi Suresh in during a photoshoot.jpg
జననం1988 ఆగస్టు 23
త్రిపుణితుర, కేరళ, భారతదేశం
మరణం2023 ఫిబ్రవరి 22(2023-02-22) (వయసు 34)
మరణ కారణంకాలేయ వ్యాధి
జాతీయతఇండియన్
వృత్తినటి, యాంకర్
క్రియాశీల సంవత్సరాలు1998–2023

సుబి సురేష్ (1988 ఆగస్టు 23 - 2023 ఫిబ్రవరి 22) భారతీయ ప్రముఖ మలయాళ టెలివిజన్ నటి, యాంకర్. తస్కరా లహలా (2010), గృహనాథన్ (2012), డ్రామా (2018) వంటి ప్రముఖ చిత్రాలలో ఆమె పాత్రకు ప్రసిద్ది చెందింది. ఆమె కామిక్ వాయిస్‌కు విస్తృతంగా పేరుగాంచింది.

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

సురేష్, అంబిక దంపతులకు కేరళలోని ఎర్నాకులం జిల్లా, త్రిపుణితురలో 1988 ఆగస్టు 23న జన్మించింది. ఆమెకు సోదరుడు అభీ సురేష్ ఉన్నాడు. ఆమె త్రిపుణితుర ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యను, ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కళాశాల నుండి కళాశాల విద్యను పూర్తిచేసింది.

కెరీర్

[మార్చు]

కొచ్చిన కళాభవన్ ద్వారా మిమిక్రీ ఆర్టిస్టుగా సుబి సురేష్ తన కెరీర్ ప్రారంభించింది. ఆమె ఆగష్టు 1993లో సినిమాలాకు యాంకర్‌గా తన వృత్తిని ప్రారంభించింది. సినిమాలా అనేది మలయాళ టెలివిజన్ పేరడీ సిరీస్, ఇది ఆసియానెట్‌లో ప్రసారమైంది. టీవీ షోలలో డ్యాన్సర్, కమెడియన్, యాంకర్ గా కీలక పాత్ర పోషించి సుభి సురేష్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నిర్వహించిన సినీమాల, కుట్టి పట్టాలం టీవీ షోలకు ఎంతో ఆదరణ వచ్చింది. 2006లో కనక సింహాసనం చిత్రం ద్వారా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ఇరవైకి పైగా సినిమాల్లో నటించింది. మిమిక్రీలోనూ ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది.

మరణం

[మార్చు]

42 వయసులో సుబి సురేష్ కాలేయ వ్యాధితో కొన్ని రోజులుగా కోచిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ, పరిస్థితి విషమించడంతో 2023 ఫిబ్రవరి 22న తుదిశ్వాస విడిచింది.[1] ప్రొఫెషనల్ హాస్యనటి, టెలివిజన్ యాంకర్‌గా ఎప్పుడూ బిజీగా ఉండే సుబి సురేష్ చివరిగా ఫ్లవర్స్ టీవీలో ఫ్లవర్స్ ఓరు కోడిలో పార్టిసిపెంట్ గా, జీ కేరళం టీవీలో ఒన్నన్నార రుచి ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరించింది.

మూలాలు

[మార్చు]
  1. "Subi Suresh | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సీరియల్‌ నటి మృతి-Namasthe Telangana". web.archive.org. 2023-02-22. Archived from the original on 2023-02-22. Retrieved 2023-02-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)