Jump to content

సుబ్రమణియం రామదొరై

వికీపీడియా నుండి

సుబ్రమణియం రామదొరై (జననం 1945 అక్టోబరు 6) భారత ప్రభుత్వ జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ పై ప్రధానమంత్రి సలహాదారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. భారత కేబినెట్ మంత్రి హోదా ఉన్నవారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, భారతిదసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ సంస్థల బోర్డులకు చైర్ పర్సన్ గానూ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గౌహతి, టాటా ఎల్క్సీ సంస్థల చైర్మన్ గానూ  వ్యవహరిస్తున్నారు.1996 నుంచి 2009 వరకు టాటా కన్సెల్టన్సీకి సి.ఈ.వో, ఎండిగా పనిచేశారు ఆయన. 2014 అక్టోబరు 6 వరకూ అదే సంస్థకు వైస్-చైర్మన్ గా కూడా వ్యవహరించారు.[1] ఈయన సారథ్యంలో 6000 ఉద్యోగులతో 400 మిలియన్ డాలర్ల ఆదాయంతో ఉన్న టిసిఎస్ కంపెనీ 42 దేశాల్లో 200,000 మంది ఉద్యోగులతో 6.0 బిలియన్ డాలర్ల ఆదాయంతో ప్రపంచ అతిపెద్ద సాఫ్ట్ వేర్, సర్వీసెస్ సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం భారత రైల్వే తరువాత అతి ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థ టి.సి.ఎస్ కావడం విశేషం.

తొలినాళ్ళ జీవితం, చదువు

[మార్చు]
1945 అక్టోబరు 6న నాగపూర్ లోని ఒక తమిళ కుటుంబంలో జన్మించారు సుబ్రమణియం. ఆయన తండ్రి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో అకౌంటెంట్ జనరల్ గా పనిచేశారు. తల్లి గృహిణి. ఐదుగురు సంతానంలో సుబ్రమణియం నాలుగవ కుమారుడు. నిజానికి వీరి పూర్వీకులు తిరువూర్కు చెందినవారు.

న్యూఢిల్లీలోని డి.టి.ఇ.ఎ సీనియర్ సెక్ పాఠశాలలో ప్రాథమిక, మాధ్యమిక విద్య అభ్యసించారు ఆయన. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి  భౌతికశాస్త్రంలో డిగ్రీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్ ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన ఆయన లాస్ ఎంజెలెస్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్ లోమాస్టర్ డిగ్రీ చేశారు. 1993లో ఎం.ఐ.టి స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో సీనియర్  ఎగ్జిక్యూటివ్ డవలప్ మెంట్ ప్రోగ్రాంకు హాజరయ్యారు సుబ్రమణియం.[2]

కెరీర్

[మార్చు]

1969లో టిసిఎస్ లో జూనియర్ ఇంజినీర్ గా కెరీర్ ప్రారంభించిన[3] సుబ్రమణియం, ఉద్యోగంలో వేగంగా ఎదుగుతో 1979 నాటికి న్యూయార్క్ లో అమెరికా మొత్తానికి చెందిన టిసిఎస్ ఆపరేషన్స్ నిర్వహించే స్థాయికి ఎదిగారు.[4] ఆయన సారథ్యంలో ఆ దేశంలో 40  బ్రాంచిలు ఏర్పాటయ్యాయి. సి.ఈ.వోగా సుబ్రమణియం పెద్ద కంపెనీలతోనూ, విద్యాసంస్థలతోనూ టెక్నాలజీ అభివృద్ధి సంస్థలతోనూ టిసిఎస్ కు సంబంధాలు ఏర్పాటు చేశారు ఆయన. సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్ జారీ చేసిన పర్ఫార్మెన్స్ ఎసెస్ మెంట్ లో లెవెల్ 5 కు టిసిఎస్ కు చేర్చిన ఘనత సుబ్రమణియందే. ప్రపంచంలో ఉన్న అన్ని బ్రాంచులూ పిసిఎంఎంలో లెవెల్-5 కు చేరిన మొట్టమొదటి సంస్థగా టిసిఎస్ నిలిచింది.[5]  2014 అక్టోబరు 6న టిసిఎస్ వైస్ ఛైర్మన్ గా రాజీనామా చేశారు సుబ్రమణియం. ఆ తరువాత టాటా ఎల్క్సీకి చైర్మన్ గా ఆయన వంతు కూడా పూర్తయింది. ప్రస్తుతం ఆయన టాటాకి చెందిన ఏ సంస్థలోనూ ఏ విధమైన బాధ్యతలూ నిర్వర్తించబోవడంలేదు.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కు, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్, టాటా ఎల్క్సీలకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.[6] హిందుస్థాన్ యూనిలివర్ లిమిటడ్, నికోలస్ పిరమల్ ఇండియా లిమిటెడ్ లకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఉన్నారు ఆయన.[7] హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ సంస్థకు స్వతంత్ర డైరక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.[8]  2013 జూన్ 17న ఎయిర్ ఏషియా ఇండియా ఆయనను తమ ఎయిర్ లైన్ కు చైర్మన్ గా ప్రకటించింది. 2015 జనవరి 13న విట్ విశ్వవిద్యాలయ 12వ వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు సుబ్రమణియం.

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]

భారత జాతీయ ఇంజినీరింగ్ అకాడమీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ సంస్థల్లో సుబ్రమణియం ఫెలోగా ఉన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో, కార్పొరేట్ ఎడ్వైజరీ బోర్డ్, మార్షల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థలలో సభ్యునిగానూ, ఇండో-అమెరికన్ సొసైటీకి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2006లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది.[9] 2004లో బిజినెస్ ఇండియా ఆయనను బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు సుబ్రమణియం. 2003లో ఇండోర్ మేనేజ్ మెంట్ అసోసియేషన్  ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం  ఇచ్చి గౌరవించింది. బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ డిస్టింగ్విష్డ్ అచీవ్ మెంట్ అవార్డు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది. 2002లో సి.ఎన్.బి.సి ఆసియా పసిఫిక్ కు చెందిన ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆసియా బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా అందుకున్నారాయన.[10] బాంబే మేనేజ్ మెంట్ అసోసియేషన్ మేనేజ్ మెంట్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా ఇచ్చింది. 2002 జూన్లో కన్సల్టింగ్ మ్యాగజైన్ (యు.ఎస్.ఎ) పేర్కొన్న ప్రపంచంలోని టాప్ 25 అత్యంత ప్రభావవంతమైన కన్సల్టెంట్స్  జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారతీయ సి.ఈ.వో సుబ్రమణియం.[11] చైనాలోని క్వింగ్డో నగరానికి ఐటి సలహాదారుగా  కూడా ఎంపికకాబడ్డారు ఆయన. 2009 ఏప్రిల్ 28న బ్రిటిష్  రాజ్యానికి కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ గౌరవం అందుకున్నారు.[12]  2011 జనవరి 31న సుబ్రమణియాన్ని భారత జాతీయ నైపుణ్యాభివృద్ధి కౌన్సిల్ కు సలహాదారుగా నియమించింది భారత ప్రభుత్వం.

రచయితగా

[మార్చు]
2011 సెప్టెంబరు 16న ది టిసిఎస్ స్టోరీ...అండ్ బియాండ్ అనే పేరుతో ఆయన రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు సుబ్రమణియం. ఈ పుస్తకంలో టిసిఎస్ లో తన అనుభవాల గురించి రాశారు ఆయన.[13]

References

[మార్చు]