సురభి 70ఎంఎం
స్వరూపం
సురభి 70ఎంఎం 2022, ఫిబ్రవరి 18న విడుదలైన తెలుగు సినిమా. బాబీ ఫిలిమ్స్, జె.ఎస్.ఆర్. పిక్చర్స్ బ్యానర్స్‌పై నిర్మించిన ఈ సినిమాను కె.కె. చైతన్య నిర్మించగా గంగాధర వైకె అద్వైత దర్శకత్వం వహించాడు. అక్షత శ్రీనివాస్, వినోద్, అనిల్ కుమార్, చందు, మహేష్, ఉషాంజలి, శ్లోక, యోగి ఖత్రి, అనీష్ రామ్, సూర్య ఆకొండి ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాకు డెన్నిస్ నార్టన్ సంగీతం అందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- అక్షత శ్రీనివాస్
- వినోద్
- అనిల్ కుమార్
- చందు
- మహేష్
- ఉషాంజలి
- శ్లోక
- యోగి ఖత్రి
- అనీష్ రామ్
- సూర్య ఆకొండి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: బాబీ ఫిలిమ్స్, జె.ఎస్.ఆర్. పిక్చర్స్
- నిర్మాత: కె.కె. చైతన్య
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గంగాధర వైకె అద్వైత
- సంగీతం: డెన్నిస్ నార్టన్
- సినిమాటోగ్రఫీ: శేఖర్, ఎస్.ఎస్.వి. గోపాల్, భరత్ సి కుమార్
- ఎడిటర్: కంజర్ల యాదగిరి
- స్పెషల్ ఎఫెక్ట్స్: నాగిరెడ్డి
- సహా నిర్మాత: జంగా శేషిరెడ్డి
- పి.ఆర్.వో: జి.ఎస్.కె. మీడియా
ప్రచారం
[మార్చు]2020, డిసెంబరు 17న సినీనటుడు చిరంజీవికి అంకితమిస్తూ రూపొందించిన ఐన చిట్టి చిట్టి కన్నుల్లో అనే పాట విడుదలయింది. ఈ పాటను చూసిన చిరంజీవి సినిమా టీంకు ప్రసంశలు అందించాడు.[2] 2021, జూలై 3న మధుర ఆడియో నుండి ఈ సినిమా టీజర్ విడుదలయింది. 2022 ఫిబ్రవరి 9న సినిమా ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ విడుదల చేశాడు.[3]
విడుదల, స్పందన
[మార్చు]ఈ సినిమా 2022, ఫిబ్రవరి 18న విడుదలయింది.
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (2 February 2022). "సినిమా థియేటర్ ను కాపాడుకోవాలి". Archived from the original on 11 February 2022. Retrieved 11 February 2022.
- ↑ ""సురభి 70 ఎంఎం" ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ – డైరెక్టర్ గంగాధర్ వై కె అద్వైత |" (in ఇంగ్లీష్). 2022-02-02. Archived from the original on 2022-02-11. Retrieved 2022-02-11.
- ↑ ""సురభి 70 ఎంఎం(హిట్టు బొమ్మ )" ట్రైలర్". mirchi9.com (in ఇంగ్లీష్). 2022-02-10. Archived from the original on 2022-02-11. Retrieved 2022-02-11.