సురేంద్రబాబు
ఎన్.వి.సురేంద్రబాబు IPS విజయవాడ నగర పోలీసు కమీషనరు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన గుంటూరు జిల్లాకు కెందిన దోనెపూడి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి నిమ్మగడ్డ జనార్థన రావు పాఠశాల ఉపాధ్యాయుడు. సురేంద్రబాబు 2001 నుండి 2004 వరకు విజయవాడ పోలీసు కమీషనరుగా పనిచేసాడు.[1][2][3] ఆయన ఇనస్పెక్టరు జనరల్ ఆఫ్ పోలీసుగా 2007లో పదోనతి పొందాడు.
2006, 2007 మధ్య కాలంలో ఆయన హైదరాబాదు సిటీపోలీసు అడిషనల్ కమీషనర్ లో కో ఆర్డినేషన్ విభాగంలో సేవలందించాడు. ఆయన అంతకు ముందు హైదరాబాదు సిటీ పోలీసు విభాగంలో ట్రాఫిక్ కొరకు అడిషనల్ కమీషనరుగా పనిచేసాడు. పట్టణంలోని ట్రాఫిక్ సమస్యపై మంచి అనుభవంతో తన సేవలనందించాడు.
ఆయన ప్రస్తుతం ఆక్టోపస్ (కౌంటర్ టెర్రరిజం ఫోర్స్) విభాగంలో అడిషనల్ డైరక్టరు జనరల్ ఆఫ్ పోలీసుగా తన సేవలనందిస్తున్నాదు. ఆయన 2008 లో మక్కా మస్జిద్ బాంబింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసు దళంలో సభ్యులు.[4] ఆయన లిక్కర్ అమ్మకాలలో కరిగిన డ్రైవ్ లో ఛీఫ్ కో ఆర్డినేటరుగా వ్యవహరించారు. ఆయన డైరక్టరు ( ఎన్‌ఫోర్స్‌మెంటు) గానూ, ప్రొహిబిషన్, ఎక్సైజ్జ్ డిపార్టు మెంటులోనూ పనిచేసాడు.[5]
హైదబాదు పోలీసు విభాగం యొక్క అడిషనల్ కమీషనరుగా ఆయన మానవవనరులు, ఆర్థిక, ఇంఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయ నిర్వహణ లలో సహకారాన్నందించాడు.[6]
ఆయన డెహ్రాడూన్ లోని నేషనల్ పోలీసు అకాడమీ వద్ద ఎస్.పి శిక్షణ పొందాడు. మావోయిస్టు వ్యతిరేక శిక్షణను నల్లమల లోని గ్రే హౌండ్స్ అకాడమీలో పూర్తి చేసాడు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ లో బి.టెక్ చేసాడు. ఆయన వరంగల్ లో ఎన్.ఐ.టి నుండి బి.టెక్ డిగ్రీని, ముంబై లోని ఎన్.ఐ.టి.ఐ.ఇ నుండి ఎం.టెక్ డిగ్రీని పొందాడు. ఆయన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో ఫెలోషిప్ చేసాదు. ఆయన కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కు గౌరవ అధ్యక్షునిగా ఉన్నాడు.[7]
ఆయనకు 2003లో రాజీవ్ సర్వీస్ మెడల్ లభించింది.
మూలాలు
[మార్చు]- ↑ "Advocate ends self-imposed `exile'". Archived from the original on 2004-03-19. Retrieved 2016-11-11.
- ↑ "3 youths held for TDP leader's killing". Archived from the original on 2011-05-14. Retrieved 2016-11-11.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-26. Retrieved 2016-11-11.
- ↑ Mecca Masjid investigation
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-07-23. Retrieved 2016-11-11.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-26. Retrieved 2016-11-11.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-26. Retrieved 2016-11-11.