సురేంద్ర సింగ్ భోయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురేంద్ర సింగ్ భోయ్
సురేంద్ర సింగ్ భోయ్


అటవీ, పర్యావరణ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
22 ఫిబ్రవరి 1999 – 05 మార్చి 2000

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
నియోజకవర్గం టిట్లాగఢ్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-06-05) 1961 జూన్ 5 (వయసు 62)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు రమేష్ చంద్ర సింగ్ భోయ్
జీవిత భాగస్వామి మోనికా సింగ్ భోయ్
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

సురేంద్ర సింగ్ భోయ్ ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒడిశా శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అటవీ, పర్యావరణ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

సురేంద్ర సింగ్ భోయ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995 , 2000లో రెండుసార్లు సైంతాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 22 ఫిబ్రవరి 1999 నుండి 05 మార్చి 2000 వరకు హేమానంద్ బిస్వాల్ మంత్రివర్గంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2009లో టిట్లాగఢ్ నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత జరిగిన 2014, 2019 ఎన్నికలలో ఓడిపోయాడు.

సురేంద్ర సింగ్ భోయ్ 2024 మార్చి 28న బొలంగీర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి[3], మార్చి 29న బీజేడీ ప్రధాన కార్యాలయం శంఖ భవన్‌లో రాజ్యసభ సభ్యుడు సస్మిత్ పాత్ర, మంత్రి తుకుని సాహు సమక్షంలో బిజూ జనతా దళ్ పార్టీలో చేరాడు.[4]

మూలాలు[మార్చు]

  1. The Hindu (29 March 2024). "Odisha MLA Surendra Singh Bhoi quits Congress after 38 years; two leaders leave BJP too" (in Indian English). Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  2. "Odisha MLA Surendra Singh Bhoi Quits Congress After 38 Years To Join BJD, 2 BJP Leaders Also Li" (in ఇంగ్లీష్). 29 March 2024. Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  3. The Economic Times (29 March 2024). "Odisha MLA Surendra Singh Bhoi quits Congress after 38 years; two leaders leave BJP too". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  4. The Times of India (30 March 2024). "3-time ex-Congress MLA Surendra Bhoi joins BJD in Odisha". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.