సురేఖ సిక్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురేఖ సిక్రీ
జననం19 April 1945 (1945-04-19)
మరణం2021 జూలై 16(2021-07-16) (వయసు 76)[1]
క్రియాశీల సంవత్సరాలు1978–2021
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బాలికా వధూ (తెలుగులో - చిన్నారి పెళ్లికూతురు)
బాధాయి హొ"
జీవిత భాగస్వామిహేమంత్ రేగే
పిల్లలు1
బంధువులునసీరుద్దీన్ షా
పురస్కారాలుజాతీయ చలనచిత్ర అవార్డులు & ఫిల్మ్‌ఫేర్ అవార్డు & సంగీత నాటక్ అకాడమీ

సురేఖా సిక్రీ భారతీయ థియేటర్‌ ఆర్టిస్ట్‌, టీవీ, సినీ నటి. ఆమె 1978 లో ‘కిస్సా కుర్సీకా’ సినిమా ద్వారా నటిగా సినీ రంగానికి పరిచయమై, తమాస్ (1988), మమ్మో (1995), బధాయ్ హో (2018) చిత్రాలకుగాను మూడుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకుంది. సురేఖ హిందీతో పాటు మలయాళ చిత్రాల్లో సహాయక నటి పాత్రల్లో నటించింది.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సురేఖా సిక్రీ 1945 ఏప్రిల్ 19న న్యూ ఢిల్లీలో జన్మించింది. ఆమె 1971లో నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా నుండి పీజీ పూర్తి చేసి, పలు నాటకాల్లో నటించింది. సురేఖా సిక్రీకి హిందీ థియేటర్ కోసం చేసిన కృషికి గాను 1989 లో సంగీత నాటక్ అకాడమీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

నటించిన సినిమాలు

[మార్చు]
  • కిస్సా కుర్సి కా (1978) - మీరా
  • అనాది అనంత్ (1986)
  • తమస్‌ (1986)
  • సలీమ్ లంగ్డ్ పే మత్ రో (1989) - అమీనా
  • పరిణతి (1989) - గణేష్ భార్య
  • నాజర్ (1990)
  • కారమతి కోర్ట్ (1993)
  • లిటిల్ బుద్ధ (1993)
  • మామో (1994) [3] - ఫయాజి
  • నసీమ్ (1995)
  • సర్దారీ బేగం (1996)
  • జన్మదినం (1998, మలయాళం సినిమా)
  • సర్ఫారోష్ (1999)
  • దిల్ లాగీ (1999)
  • కాటన్ మేరీ (1999)
  • హరి -భారి (2000) - హసీనా
  • జుబెయిదా (2001) - ఫయాజి
  • దేహం (2001)
  • కాళీ సల్వార్ (2002) - అన్వారి
  • మిస్టర్ & మిస్సెస్ అయ్యర్ (2003) - నజ్మా ఖాన్
  • రఘు రోమియో (2003)
  • రైన్ కోర్ట్ (2004)
  • తుమ్ సా నహి దేఖా (2004)
  • జో బోలె సో నిహాల్ (2005)
  • హమ్ కో దీవానా కర్ గాయే (2006)
  • దేవ్.డి (2009) - బస్సులో ప్రయాణించిన నటిగా
  • స్నిఫ్ (2017)
  • బధాయ్ హో (2018) - దుర్గ దేవి కౌశిక్
  • షేర్ కూర్మ (2020)
  • ఘోస్ట్ స్టోరీస్" (2020)

టెలివిజన్

[మార్చు]
  • 'ఏక్ తా రాజా ఏక్ తి రాణి (2015–2017)
  • పర్డేస్ మే హై మేరా దిల్ (2016-2017)
  • బాలికా వధూ (2008-2016)
  • మా ఎక్స్చేంజి
  • మహా కుంభ్: ఏక్ రహస్య, ఏక్ కహాని (2014–2015)
  • సాత్ పేరే (2006-2009)
  • బనేగి ఆప్నీ బాత్
  • కేసర్
  • కెహెనా హై కుచ్ ముజ్ కో
  • సహేర్
  • గోదాన్'
  • సి.ఐ.డి (1 Episode, 2007)
  • సమయ్
  • ఆహాత్
  • మనో యా నా మానో (1995)
  • జస్ట్ మొహబ్బత్ (1996-2000)
  • కభీ కభీ (1997 )
  • సంఝా చులా (1990)
  • గోదాన్ - మున్షి ప్రేమచంద్ నవల ఆధారంగా (దూరదర్శన్)

మరణం

[మార్చు]

సురేఖ సిక్రీ కొన్నాళ్లుగా అనారోగ్య సమ‌స్య‌ల‌తో బాధపడుతూ 16 జూలై 2021న గుండెపోటుతో ముంబైలో మరణించింది.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. "Veteran actress Surekha Sikri dies of cardiac arrest at 75 in Mumbai". India Today (in ఇంగ్లీష్). Mumbai. 16 July 2021. Retrieved 16 July 2021.
  2. TV9 Telugu (16 July 2021). "మూడుసార్లు జాతీయ అవార్డు విన్నర్.. చిన్నారిపెళ్లి కూతురు ఫేమ్ సురేఖ సిక్రీ గుండెపోటుతో మృతి". Archived from the original on 19 జూలై 2021. Retrieved 19 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Surekha Sikri Channel 4.
  4. Andrajyothy (16 July 2021). "సురేఖ సిక్రీ ఇకలేరు!". Archived from the original on 19 జూలై 2021. Retrieved 19 July 2021.
  5. V6 Velugu (16 July 2021). "చిన్నారి పెళ్లికూతురు బామ్మ ఇకలేరు" (in ఇంగ్లీష్). Archived from the original on 19 జూలై 2021. Retrieved 19 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Mana Telangana (16 July 2021). "సీనియర్ బాలీవుడ్ నటి సురేఖ సిక్రి కన్నుమూత". Archived from the original on 19 జూలై 2021. Retrieved 19 July 2021.