Jump to content

సురేష్ అద్వానీ

వికీపీడియా నుండి
భారత[permanent dead link] రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ పద్మభూషణ పురస్కారాన్ని సురేష్ హరియం అధ్వానీకి అందజేస్తున్న దృశ్య్సం. రాష్ట్రపతి భవనం, 2012 మార్చి 22

డా. సురేష్ అద్వానీ (Suresh H Advani) ప్రముఖ భారతీయ వైద్యుడు, క్యాన్సర్ నిపుణుడు. ఇతడు రక్తంలోని మూలకణాల మార్పిడి (Hematopoietic stem cell transplantation) గురించి విశేష కృషిచేశారు. భారత ప్రభుత్వం ఇతని వైద్య సేవలకు పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది.

వీరు 8 సంవత్సరాల వయసులోనే పోలియో వ్యాధి బారిన పడినా, చక్రాలకుర్చీ తోనే గ్రాంట్ వైద్యకళాశాలలో పట్టాపొంది ఆంకాలజీలో మాస్టర్స్ డిగ్రీ సంపాదించారు.[1] ఆ పిదప మూలకణాల మార్పిడి గురించి వాషింగ్టన్ లోని ఫ్రెడ్ హచిన్సన్ కాన్సర్ పరిశోధనా కేంద్రం (Fred Hutchinson Cancer Research Center)లో పరిశోధనలు జరిపారు.[2]

గౌరవ సత్కారాలు

[మార్చు]
  • రాష్ట్రీయ క్రాంతివీర్ పురస్కారం, ఉజ్జయినీ (2014)
  • భారత ప్రభుత్వం నుండి 2002లో పద్మశ్రీ పురస్కారం[3], 2012లో పద్మభూషణ పురస్కారం[3] తో గౌరవించబడ్డారు.
  • మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి 2005 లో బి.సి.రాయ్ జాతీయ పురస్కారం పొందారు.
  • హార్వర్డ్ అంతర్జాతీయ వైద్యసంస్థ నుండి ఆంకాలజీలో జీవిత సాఫల్య పురస్కారం (2005) పొందారు.
  • వైద్యశాస్త్రంలో విశేషసేవలకు గాను ధన్వంతరీ పురస్కారం (2002) పొందారు.

మూలాలు

[మార్చు]
  1. "Wheelchair-bound~ this doctor covered new ground in oncology". Mid-day. 29 October 2002.
  2. "Meet Dr Suresh Advani: India's first and best-known oncologist". The Economic Times. 21 July 2013.
  3. 3.0 3.1 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Padma Awards" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు