సుల్తాన్ బహు
సుల్తాన్ బహు (1630–1691) పంజాబీ సూఫీ గురువు, కవి, పండితుడు. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందినవారు. సూఫీ సంప్రదాయంలోని ఖాదరియా శాఖ కు చెందినవారు. ఆయన సర్వారీ ఖదారియా అనే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు.
ఆయన తరువాత ఏడు తరాల గురు పరంపర ఉంది. ఆయన శిష్యుడు ఒకాయన మనాకిబ్-ఇ-సుల్తానీ పేరుతో ఆయన జీవిత చరిత్రను రాశారు.[1] ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న పంజాబ్ లోని జంగ్ మండలం షోర్ కోట్ లో జన్మించారు బహు. సూఫీ తత్త్వంలో సుల్తాన్ బహు దాదాపు 40 పుస్తకాలు రాసినట్టు చెప్తారు. ఎక్కువగా అన్నీ పర్షియా భాషలో రాశారు. ఇవన్నీ సూఫీ తత్త్వాన్ని గురించీ, ఇస్లాం గురుంచీ వివరిస్తుంటాయి.[2] ఆయన పంజాబీలో రాసిన కవిత్వం చాలా ప్రసిద్ధి చెందింది.[1] ఆయన రాసిన కవితలను తరువాతి వారు కవ్వాలీ, కాఫీ వంటి రకరకాల ప్రక్రియల్లో పాడేవారు.
చదువు
[మార్చు]తల్లి మాయ్ రస్తీ సుల్తాన్ బహుకు తొలి గురువు. ఆమెకు గోరీ సంప్రదాయంలో ఆరాధనాభావం కలిగిన వ్యక్తి. బాగ్దాద్ షరీఫ్ లో ఉండే హజ్రత్ షాహ్ హబీబ్ గిలానీ వద్ద ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం తీసుకోమని తెలిపింది సుల్తాన్ కు.
1668లో ఖాదిరియా సూఫీ గురువు సయ్యద్ అబ్దుల్ రెహమాన్ జిలానీ దెహ్ల్వీ వద్ద శిక్షణ తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చారు సుల్తాన్. శిక్షణ తరువాత ఇప్పటి భారత భూభాగంలోని పంజాబ్ కు చేరుకున్నారు. జీవితాంతం అక్కడే స్థిరపడిపోయారు ఆయన.
సాహిత్యం
[మార్చు]ఆయన ఎన్ని పుస్తకాలు రాశారో కచ్చితంగా ఎవరికీ తెలియదు. కానీ ఇస్లాం గురించీ, సూఫిజం గురించీ దాదాపు 140 పుస్తకాలు రాశారు. ఎక్కువ పుస్తకాలు పర్షియా భాషలో రాసిన సుల్తాన్ అబ్యత్-ఎ-బహూ అనే కవితల పుస్తకాన్ని మాత్రం పంజాబీ భాషలో రాశారు.[3] ఆయన రాసిన సాహిత్యంలో కొన్ని పుస్తకాలు మాత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. అవి:
- అబ్యత్ ఎ బహు
- రిసలా ఎ రూహీ
- సుల్తాన్ ఉల్ వాహెమ్
- నుర్ ఉల్ హుదా
- అక్ల్ ఎ బైదర్
- మహ్క్ ఉల్ ఫకర్
- ఔరంగ్ ఎ షాహీ
- జమీ ఉల్ ఇస్రార్
- టౌఫిక్ ఏ హిదియత్
- కలిద్ టౌహీద్
- ఐన్ ఉల్ ఫకర్
- ఇస్రర్ ఎ ఖాదరి
- కలీద్ ఎ జన్నత్
- మహ్కుమ్ ఉల్ ఫక్ర్
- మజలిస్ ఉన్ నబీ
- ముఫ్తాహ్ ఉల్ అరిఫీన్
- హజ్జత్ ఉల్ ఇస్రార్
- కషఫ్ ఉల్ ఇస్రార్
- మహబత్ ఉల్ ఇస్రార్
- గంజ్ ఉల్ ఇస్రార్
- ఫజల్ ఉల్ లికా
- దీవాన్ ఎ బహు
గురు, వంశ పరంపర
[మార్చు]తన రచనల్లో అబ్దుల్ ఖాదిర్ జిలానీని తన గురువుగా పేర్కొన్నారు సుల్తాన్. కానీ ఆయన కాలానికంటే చాలా ముందే అబ్దుల్ చనిపోయారు. అబ్దుల్ ఖాదిర్ సూఫీ ప్రపంచంలో చాలా ప్రసిద్ధమైనవారు. ఆయన ఆలోచనలు, ప్రబోధాలు ఎందరో సూఫీ సాధువులపై ప్రభావం చూపాయి.[4] తనను తాను జిలానీకి చెందిన ఖాదిరియా సంప్రదాయానికి అనుచరునిగా ప్రకటించుకున్న సుల్తాన్ దానిలో సర్వారి ఖాదిరి అనే శాఖను ప్రారంభించారు.
బహు స్థాపించిన సర్వారి ఖాదిరీ శాఖ కు వేదాంత పరంగా ఖాదిరియా సంప్రదాయానికి పోలికలుంటాయి. కానీ ఇతర సూఫీ శాఖల్లా బట్టలపై, సన్యాసిలా బ్రతకాలనే నిబంధనలు ఉండవు.
ఈ సంప్రదాయం ప్రకారం గురు, వంశ పరంపర:
- మహమ్మద్
- అలీ బిన్ అబీ తలిబ్
- హసన్ అల్ బస్రి
- హబిబ్ అల్ అజామీ
- దావుద్ తై
- మరుఫ్ కర్ఖి
- సిర్రి సక్తి
- జునౌద్ బగ్దాదీ
- అబు బక్ర్ షిబ్లి
- అబ్దుల్ అజిజ్ బిన్ హర్స్ బిన్ అసద్ యెమెని తమిని
- అబు అల్ ఫజల్ అబ్దుల్ వహీద్ యెమెనీ తమిమీ
- మహమ్మద్ యూసఫ్ అబు అల్-ఫరహ్ టర్టుసి
- అబు-అల్-హస్సాన్ అలి బిన్ మహమ్మద్ కురేషి హంకారీ
- అబు సేద్ ముబారక్ మఖ్జూమీ
- అబ్దుల్ ఖాదిర్ జిలానీ
- అబ్దుల్ రజాక్ జిలానీ
- అబ్దుల్ జబ్బర్ జిలానీ
- సయ్యద్ మహమ్మద్ సదిక్ యహ్యా
- నజిమ్-ఉద్-దిన్ బుర్హన్ పూరీ
- అబ్దుల్ ఫతే
- అబ్దుల్ సత్తర్
- అబ్దుల్ బక్కా
- అబ్దుల్ జలీల్
- సయ్యద్ అబ్దుల్ రెహమాన్ జిలానీ దెహ్ల్వీ
- సుల్తాన్ బహు
ఇప్పటికీ సుల్తాన్ బహు శిష్యుల ద్వారా ఈ సుల్తాన్ బహు పరంపర సంఫ్రదాయం కొనసాగుతోంది.
పుణ్యక్షేత్రం
[మార్చు]పంజాబ్ లోని గర్హ్ మహారాజా లో సుల్తాన్ బహు పుణ్యక్షేత్రం ఆయన సమాధి వద్ద నిర్మించారు మొదట.[5] కానీ చీనాబ్ నది దిశ మారడంతో రెండు సార్లు మార్చవలసి వచ్చింది. ఇది సుప్రసిద్ధ సూఫీ క్షేత్రం. ప్రతీ సంవత్సరం జుమాదా అల్-థానీ నెలలోని మొదటి గురువారం సుల్తాన్ సంస్మరణ దినాన ఉరుసు ఉత్సవం నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు.[6]
కర్బలా అమరవీరుల సంస్మరణార్ధం ప్రతీ సంవత్సరం ముహర్రం నెలలోని మొదటి పదిరోజులూ ఉరుసు ఉత్సవం నిర్వహించేవారు సుల్తాహ్ బహు. ఇప్పటికీ ముహర్రం నెలలో జరుగుతూంటుందీ ఈ ఉత్సవం. దీనికి కూడా వేలల్లో భక్తులు పాల్గొంటారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Sult̤ān Bāhū (1998). Death Before Dying: The Sufi Poems of Sultan Bahu. University of California Press. ISBN 978-0-520-92046-0.
- ↑ Syed Ahmad Saeed Hamadani. Sultan Bahu Life & Work.
- ↑ Sultan Hamid Ali,"Manaqib-i Sultani" Malik Chanan Din Publishers (Regd) Lahore Pakistan 1956
- ↑ S. Padam, Piara. Dohrhe Sultan Bahu. s. n.
- ↑ Sadia Dehlvi. Sufism: Heart of Islam. HarperCollins Publishers. pp. 185–. ISBN 978-93-5029-448-2.
- ↑ Book Name: Tareekh-e-Jhang, Author:Iqbal Zuberi, Publisher: Jhang Adabi Academy, Jhang Sadar, Pakistan, First Edition, Date: 2002