సుశీల్ కుమార్ సేన్
Jump to navigation
Jump to search
సుశీల్ సేన్ | |
---|---|
జననం | సుశీల్ కుమార్ సేన్ 1892 సైల్హేట్, బాంగ్లాదేశ్ |
మరణం | 1915 మే 2 | (వయసు 22–23)
జాతీయత | భారతదేశం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | అలిపోరే బాంబు కేసు |
సుశీల్ కుమార్ సేన్ భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు.[1]
జీవితం
[మార్చు]సుశీల్ సేన్ తన బాల్యం నుండి దేశభక్తి స్ఫూర్తిని పెంచుకొని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన కలకత్తాలోని నేషనల్ కాలేజీలో చదువుకున్నాడు. సేన్ చిన్న వయస్సులోనే, బ్రిటీష్ న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా పికెటింగ్‌లో పాల్గొన్నందుకు అతనికి పదిహేను కొరడా దెబ్బలు శిక్ష విధించబడింది.[2]
అరెస్ట్
[మార్చు]సుశీల్ కుమార్ సేన్ అలిపూర్ బాంబు కేసులో ప్రధాన నిందితులలో ఒకడిగా ఉన్న ఆయనను మే 1909 లో అరెస్టు చేసి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా హైకోర్టు లో ఆ కేసులో అతని పాత్ర నిరూపించబడనందున 21 నెలలు జైలులో గడిపిన తరువాత ఈ శిక్షను రద్దు చేసింది. బ్రిటీష్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్షన్ ఇన్వెస్టిగేషన్ సెల్‌లో సురేష్ చంద్ర ముఖర్జీని చంపాడు.[3][4]
మరణం
[మార్చు]సుశీల్ కుమార్ సేన్ 2 మే 1915న పోలీసులతో జరిగిన వాగ్వాదంలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Som Nath Aggarwal (1995). The heroes of Cellular Jail. Publication Bureau, Punjabi University. pp. 52, 56, 58. ISBN 9788173801075.
- ↑ Raj, Rishi. 50 Great Freedom Fighters. Prabhat Prakashan. Retrieved 17 October 2018.
- ↑ Raj, Rishi. 50 Great Freedom Fighters. Prabhat Prakashan. Retrieved 17 October 2018.
- ↑ Peter Heehs (2008). The Lives of Sri Aurobindo. Columbia University Press. p. 132. ISBN 9780231511841.