సుష్మావర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏడేళ్ల వయసులోనే 10వ తరగతి పూర్తి చేసి, 13 సంవత్సరాల పిన్న వయసులోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన బాలిక సుష్మావర్మ. లక్నోకి చెందిన సుష్మా 13 సంవత్సరాలకే లక్నో బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ చదువుతోంది. అద్భుతమైన తెలివితేటలున్న సుష్మా 2007లో పాత రికార్డులన్ని బ్రేక్ చేసి మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన భారతదేశపు పిన్న వయస్కురాలిగా రికార్డు సాధించింది. 7 సంవత్సరాల వయసులో .  లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదు చేసుకుంది. సుష్మా డాక్టరవ్వాలన్న తన కోరిక మేరకు 10 సంవత్సరాల వయసులో ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఎంబీబీఎస్ కంబైండ్ ప్రీ మెడికల్ ప్రవేశ పరీక్ష రాసింది. నిర్ణీత వయసు లేదని అధికారులు ఆమె ఫలితాలను నిలిపి ఉంచడంతో ఆమె అండర్ గ్రాడ్యుయేషన్‌లో మైక్రోబయాలజీని ఎన్నుకొంది.

కుటుంబ నేపథ్యం[మార్చు]

సుష్మా తండ్రి రోజువారీ వేతన కార్మికుడు, తల్లి నిరక్షరాస్యురాలు. సుష్మా అన్న తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఉత్తరప్రదేశ్ ఉన్నత పాఠశాల పరీక్ష ఉత్తీర్ణుడై రికార్డ్ సాధించగా ఈమె తన అన్న రికార్డును అధిగమించింది. సుష్మా చెల్లెలు పేరు అనన్య.

ఎన్‌జీవో సులభ్ ఇంటర్నేషనల్[మార్చు]

సుష్మా ఆర్థిక పరిస్థితిని గమనించిన భారత దేశపు "ఎన్‌జీవో సులభ్ ఇంటర్నేషనల్" సుష్మా చదువు కోసం 8 లక్షల రూపాయల గ్రాంటు ప్రకటించింది.

మూలాలు[మార్చు]

  • సాక్షి దినపత్రిక - 27-07-2014 - 7వపేజీ (పిన్నవయసులోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్..!