సూక్ష్మ ఆర్ధిక సహాయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బీదలు తమ ఉత్పాదక కార్య కలాపలను చేసుకోవడానికి, అనగా చిన్న చిన్న వ్వాపారాలు చేసుకోవడానికి చిన్న మొత్తములో పెట్టుబడులను సమకూర్చడము ఈ పథకం ముఖ్యోద్దేశము. పేదలు గ్రామాలలోని వడ్డీ వ్యాపారస్తుల కోరల్లో చిక్కుకోకుండా రక్షించడమే ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశము.

సూక్ష్మ ఆర్ధిక సహాయం అంటే ఏమిటి?

[మార్చు]

చాలా మందికి, సూక్ష్మ ఆర్ధిక సహాయమంటే ఉత్పాదక కార్యకలాపాలను చేసుకోవడానికి లేదా వారి చిన్న వ్యాపారాలను పెంచుకోవడానికిగాను నిరుపేద కుటుంబాలకు అతి తక్కువ ఋణాలను (సూక్ష్మ ఋణాల ను- మైక్రోక్రెడిట్‌) ఇవ్వడం. పేదలు, నిరుపేదలు, సాంప్రదాయకమైన లాంఛనప్రాయపు వ్యవస్థల నుండి రక రకాలైన ఆర్ధిక ఉత్పాదనలను అందుకోలేక పోవడమనేది గ్రహించినందువలన నిర్ణీత కాల పరిమితిని దాటి అదనపుకాలంలోనే విస్తృత స్థాయిలో సేవలను (ఋణాలు, పొదుపు, బీమా మొదలగునవి) కూడా ఈ పద్ధతి కలుపుకుంది.

1980 సంవత్సరానికి మునుపే, అనగా ముప్పై సంవత్సరాల క్రితమే బంగ్లాదేశ్‌, బ్రెజిల్‌, మరికొన్ని ఇతర దేశాలలో ఈ సూక్ష్మ ఋణాలను ప్రయోగాత్మకంగా చేసినప్పటికిని, 1980వ దశకానికి ప్రత్యేకత వచ్చింది. సూక్ష్మ ఋణాలను ఇవ్వడంలో ప్రస్పుటంగా కన్పించే భేదం ఏమిటంటే, ఋణమివ్వడానికి ప్రత్యామ్నాయ వనరు లైన అనియత రంగ ఖాతాదారు వర్గాలపై దృష్టి సారించడం ద్వారా, తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయడం ద్వారా, ఇచ్చిన అరువు అప్పగింతలో తన మూల్యాన్ని కలుపుకునే వడ్డీలను వేయడం ద్వారా ఋణాలను ఇచ్చి అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న పూర్వపు వ్యవస్థలోని లోపాలని తప్పించింది. పేదవారికి సేవ చేయడానికి, త్వరితగతిలో రాయితీ ఋణాలను ఇవ్వడం నుండి, ప్రాధాన్యత, స్థానిక, నిలకడగల సంస్థల నిర్మాణాత్మకతను సాధించే లక్ష్యాత్మక రంగానికి మారింది. సూక్ష్మ ఋణాలు ఇవ్వడానికి ప్రైవేట్‌ రంగం (లాభపేక్ష లేని రంగం) పూనుకుంది కాబట్టి మితిమీరిన రాజకీయం లేకుండా అయ్యింది. దీనివల్ల అన్నిరకాలైన అభివృద్ధి కోసం ఇచ్చిన ఋణాలన్నిటి కంటే ఎక్కువ పనితనం చూపించింది.

సాంప్రదాయకంగా, సూక్ష్మ ఆర్ధిక సాయాన్ని ఇవ్వడమన్నది చాలా ప్రామాణికతగల క్రెడిట్. ఇది ముఖ్యంగా ఉత్పాదకతకపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఆస్తులను ఏర్పరచుకునేందుకు,, సంసారానికి అవసరమైన స్థిరమైన పరికరాలను కల్పించుకునేందుకూ, ఆపదలనుంచి తమకుతాము భద్రత కల్పించుకునే సామర్ధ్యం కల్పించడానికీ, మిగతావారి వలెనే బీదప్రజలకి వివిధ విస్తారమైన ఆర్ధిక సాధనాల అవసరం ఉంటుంది. ఆ విధంగా, విస్తరింపబడిన సూక్ష్మ ఆర్ధిక సాయం యొక్క భావనని మనము చూస్తాము... సూక్ష్మ ఉత్పత్తుల సమృద్ధి అయిన ఒక మెనూని అందించే సమర్ధవంతమైన, విశ్వసనీయమైన మార్గాలని కనుగొనడమే మన ముందున్న ప్రస్తుత సవాలు.

సూక్ష్మ ఋణం అంటే ఏమిటి?

[మార్చు]

గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాలు, పట్టణప్రాంతాలలోగల పేదలకి అతి తక్కువ సొమ్ము పొదుపు, ఋణము, ఇతర ఆర్ధిక సేవలు, ఉత్పత్తులు కల్పించి, వారి ఆదాయాన్ని పెంచే, జీవన ప్రమాణాలను మెరుగుపరచడాన్ని సూక్ష్మ ఋణంగా నిర్వచిస్తారు. ఈ సౌకర్యాలను సూక్ష్మ ఋణాల సంస్థలు అందిస్తాయి. సూక్ష్మ ఋణం కల్పించడానికిగల నిబంధనలు, షరతులు ఏమిటి?

వాస్తవిక ఆధారాలతో తాము స్వంతంగా ఇచ్చే ఋణాల విధానాలకు బ్యాంకులు స్వేచ్ఛను కల్గి ఉన్నాయి. తగిన ఋణము, పొదుపు ఉత్పాదనలు, ఋణ పరిమాణం, ప్రామాణికథర, ప్రామాణిక పరిమాణం, కాలపరిపక్వత, ఉదార వ్యవధి, లాభాలు మొదలగు వాటితో సంబంధిత నిబంధనలు, షరతులని ప్రణాళీకాబద్ధంగా సూత్రీకరించమని వారిని అడిగారు. వ్యవసాయ, వ్యవసాయేతర కార్యకలాపాలకి వినియోగ ఋణాలు, ఉత్పాదక ఋణాలే గాక ఇంటిని కట్టు కోవడానికీ, మెరుగుపరచడం కొరకు కూడా ఈ సూక్ష్మ ఋణాలు పేదవారికి ఇస్తారు. సూక్ష్మ ఆర్ధిక సహాయం, సూక్ష్మ ఋణమునకు గల భేదం ఏమిటి?

ఋణాలు, పొదుపులు, బీమా, సొమ్ము బదిలీ సేవలు, ఇతర ఆర్ధిక ఉత్పాదనలను అల్పాదాయ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని ఇచ్చేది, సూక్ష్మ ఆర్ధిక సహాయంగా చెప్పవచ్చు. బ్యాంకు నుంచి గాని ఇతర సంస్థ నుంచి గాని ఖాతాదారులకు ఇచ్చే తక్కువ ఋణాలని, సూక్ష్మ ఋణంగా చెప్పవచ్చు. ఇది తరచుగా అదనపు హామీ లేకుండా ఒక వ్యక్తికి లేదా గ్రూపుకు సూక్ష్మ ఋణాలని ఇవ్వవచ్చు.

సూక్ష్మ ఆర్ధిక సాయానికి గల ఖాతాదారులెవరు?

[మార్చు]

లాంఛనప్రాయపు ఆర్ధిక సంస్థలు అందుబాటులో లేని అల్పాదాయ ఖాతాదారులే సూక్ష్మ ఆర్ధిక సహాయానికి అర్హులవుతారు. స్వయంఉపాధి పొందేవారు, తమకు నచ్చిన వ్యాపారాన్ని ఇంటివద్దనే చేయ గలిగేవారు దీనికి ఖాతాదారులుగా ఉంటారు. మామూలుగా, చిల్లర వర్తకం, తినుబండారాలు తయారుచేసే కార్యకలాపాల వంటి స్వల్ప ఆదాయాన్ని పొందగలిగేవారు, సన్నకారురైతులు గ్రామీణ ప్రాంతాలలో ఉంటారు. పట్టణప్రాంతాలలో సూక్ష్మ వ్యాపార కార్యకలాపాలు ఎక్కువ విభిన్నంగా ఉండి దుకాణ దారులు, సేవలనందించేవారు, చేతివృత్తులవారు/కార్మికులు, వీధి వెంబడితిరిగి అమ్ముకునే చిల్లర వ్యాపారులు మొదలైనవారు కలిగి ఉంటారు. సూక్ష్మ ఆర్ధిక సహాయాన్ని పొందే ఖాతాదారులెవరంటే, బీదవారు, అంతేగాకుండా ఇతరులతో పోలిస్తే, పేదవారుకానటువంటి కొంత నిలకడైన ఆదాయ వనరులు ఉండి హానికి లోనయ్యేవారు.

అనేక కారణాలవలన, సాంప్రదాయ ఆర్ధిక సంస్థల అందుబాటు నేరుగా ఆదాయంతో సంబంధం కలిగి ఉంటుంది. మీరెంత పేదవారైతే, మీకు అంత తక్కువ ఆర్థిక సహాయం అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. మరొక వైపు, మీరెంత పేదవారైతే మీకంత ఎక్కువ ఖర్చు అయ్యే లేదా బరువు బాధ్యతలతో కూడిన అంశాలు, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అటువంటి ఏర్పాట్లు కొన్ని ఆర్ధిక అవసరాలను తీర్చడానికి తగినవిగా ఉండవు లేదా ఒక్కొక్కసారి ఏ విధంగానైనా మిమ్మల్ని మినహాయించవచ్చు. ఇందులో వ్యక్తులు మినహాయింపబడి, సేవామార్కెట్‌ శాఖ కింద పనిచేస్తున్న వారు సూక్ష్మ ఆర్ధిక సహాయానికి ఖాతాదారులుగా ఉంటారు.

సూక్ష్మ ఆర్ధిక సహాయం చేసే అన్నిరకాల సేవలను విశాలమైన దృక్పధంతో చూస్తే, మార్కెట్‌ అవకాశంగల ఖాతాదారులు కూడా విస్తరింపబడతారు. ఉదాహరణకి, వివిధ రకా లైన పొదుపు ఉత్పత్తులు, చెల్లింపు లు, పంపిన పైకము సేవలు, వివిధ రకాలైన బీమా ఉత్పత్తులు కలిగి ఉండే వివిధ రకా లైన ఆర్ధిక సేవలకన్నా సూక్ష్మ ఋణానికి మార్కెట్‌లో అవకాశం తక్కువ పరిమితిలో ఉండవచ్చు. ఉదాహరణకి, చాలామంది పేదవారైన రైతులు నిజానికి అరువు తెచ్చుకోవడానికి ఇష్టపడకపో వచ్చు కాని తమ పంటల నుండి వచ్చే ఆదాయాన్ని దాచడానకి సురక్షితమైన ప్రదేశం కావాలి. ఎందుకంటే, నిత్య జీవితావసరాలకు చాలా నెలలవరకు ఇవి ఉపయోగపడతాయి.

సూక్ష్మఆర్ధిక సాయం పేదవారికి ఎట్లా తోడ్పడుతుంది?

[మార్చు]

సూక్ష్మ ఆర్ధిక సాయం పేదల ఆదాయాన్ని పెంచేదిగానూ, క్లిష్ట పరిస్థితులను అధిగమించి వ్యాపారంలో నిలద్రొక్కుకొనేలా చేసేదిగానూ, బయటివారి నుండి కలిగే ఇబ్బందు ల నుండి వచ్చే నష్టాలు తగ్గించేదిగానూ దోహదపడుతుందని మన అనుభవం తెలుపుతోంది. అంతేగాకుండా పేదల స్వశక్తిని పెంచే శక్తివంతమైన సాధనంగాను ముఖ్యంగా స్త్రీలను ఆర్ధికంగా శక్తిమంతులుగా చేయడంలోనూ ఈ సూక్ష్మ ఆర్ధిక సాయం మార్పు తీసుకురావచ్చు.

పేదరికం చాలా క్లిష్ట మైనది. ఆర్ధిక సేవలను అందుబాటులోనికి తీసుకురావడం ద్వారా, అన్ని కోణాల లోను పేదరికాన్ని ఎదుర్కోవడంలో సూక్ష్మ ఆర్ధిక సాయం ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఉదాహరణకి, వ్యాపారంలోని ఆదాయఉత్పత్తి, వర్తక కార్యకలాపాలను విస్తృతపరచడంలో దోహదపడడమే కాకుండా, ఇంటి ఆదాయానికి, కుటుంబాన్నిపోషించే వ్యక్తికి ఆహార భద్రతను కల్పించి లాభాన్నికల్గించడమే గాక, వారి పిల్లల చదువుకు సాయం కూడా చేస్తుంది. అంతేకాకుండా, చాలా సందర్భాలలో బయట ప్రదేశాల నుండి వేరుగా ఉంచే స్త్రీలకు, వారు ప్రామాణిక సంస్థలతో లావాదేవీలు చేయడం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసం, బలం వస్తుంది .

దారిద్ర్యరేఖకు దిగువనున్న వారిలో దినసరివేతనం పొందేవ్యక్తికి జబ్బుచేయడం, వాతావరణ పరిస్థితులు, సొమ్ము దొంగలింపబడడం, లేదా ఇతర ఇటువంటి కారణాలవల్ల వారి జీవన సరళిలో తల్లడిల్లి పోయే ఇబ్బందులు ఎంతవరకు కలుగుతున్నాయో ఇటీవలి పరిశోధనలవల్ల తెలుస్తున్నది. దీనివలన పరిమిత ఆర్ధిక వనరులు గలవారి కుటుంబంలో భారీ ఎత్తున కోలుకోలేని నష్టం ఏర్పడుతోం ది. పటిష్ఠ మైన ఆర్ధిక సేవలు లేక పోవడం, మరింత పేదరికంలో కూరుకు పోయి, దానినుండి యధాస్థితికి రావడానికి వారికి చాలకాలం పట్టవచ్చు.