సూమ్రా రాజవంశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Soomra dynasty
CapitalThari (in present-day Badin District in Sindh), and Thatta
ReligionShia Ismaili Islam
GovernmentMonarchy
ISO 3166 code[[ISO 3166-2:|]]

సూమ్రా రాజవంశం ఆధునిక పాకిస్తాను కేంద్రంగా ఉన్న సింధి రాజవంశం. ఇది 11 వ శతాబ్దం ఆరంభం నుండి 1300 ల చివరి వరకు పాలించింది - ప్రారంభంలో బాగ్దాదును పాలించిన అబ్బాసిదు కాలిఫేటు సామ్రాజ్యాల సామంతులుగా పాలించారు.[1] అనేక శతాబ్దాల అరబ్బు పాలన తరువాత సూమ్రా సింధు రాజవంశీయులు స్థానిక సింధీ పాలనను తిరిగి స్థాపించారు.[2] తరువాత వారి పాలనను ముల్తాను, బలూచిస్తాను వరకు విస్తరించారు.

సూమ్రా పాలనలో సింధీ సంస్కృతి పునరుజ్జీవనాన్ని అనుభవించింది. అరబ్బు భాష, సంప్రదాయాలు సింధులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. వారి పాలనలో షియా ఇస్మాయిలిజం, సున్నీ సూఫిజం సింధులో విస్తృతంగా వ్యాపించారు. అయినప్పటికీ వారు ఒకరితో ఒకరు శాంతియుతంగా సహజీవనం చేశాయి.[1] వారి పతనం ఉన్నప్పటికీ సూమ్రా సంస్కృతి, సంప్రదాయాలు తరువాతి శతాబ్దాలకాలం సింధుప్రజలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.[3]


చరిత్ర[మార్చు]

క్రీ.శ 711 లో ముహమ్మదు బిన్ ఖాసిం ఉమయ్యదు పాలనను సింధు వరకు విస్తరించాడు. ఇది డమాస్కసు కేంద్రంగా ఉన్న ఉమయ్యదు సామ్రాజ్యం తూర్పు ప్రావింసుగా మారింది.[4] ఉమయ్యదు పాలనలో 9 - 11 వ శతాబ్దాల మధ్య పాక్షిక స్వతంత్రపాలనకు ముందు, అరబ్బు హబ్బరి రాజవంశం ఉమయ్యద్ల ప్రధాన రాజ్యంగా స్థాపించబడింది.[5]

850 లో ఉమయ్యదు కాలిఫేటును బాగ్దాదు అబ్బాసిదులు పడగొట్టారు.[4] తరువాత హబ్బరి రాజ్యం స్వతంత్రంగా పాలన సాగించింది. దీనిని అబ్బాసిదులు నామమాత్రంగా గుర్తించారు.[6] 1010 లో అరబ్బు హబ్బరి మీద సుల్తాను ముహమ్మదు ఘజ్నవి దాడిచేసాడు.[6] ఘజ్నువి అబ్బాసిదులు మాత్రమే సరైన కలీఫులని విశ్వసించాడు. అలాగే సింధులో ఉమయ్యదు ప్రభావ అవశేషాలను తొలగించాలని భావించి మంసురాను స్వాధీనం చేసుకున్నాడు.[1]

మన్సురాను తొలగించిన తరువాత ఘజ్నవి సింధును పట్టుకోలేకపోయాడు.[1] ఆయన స్థానంలో స్థానిక సూమ్రో తెగ సూమ్రా రాజవంశాన్ని స్థాపించింది. సింధును అబ్బాసిదు కాలిఫేటు ప్రధాన రాజ్యంగా పరిపాలించడం ప్రారంభించింది.[4] సూమ్రో చరిత్రకారులు వారి మొట్టమొదటి సుల్తానును ఖఫీఫు అని భావించారు. అయితే ఆధునిక పరిశోధనలు ఖఫీఫు మొదటి సూమ్రా సుల్తాను కాకుండా చివరి హబ్బరి సుల్తాను అని సూచిస్తున్నాయి.[7]

ఇస్లాం మతంలోకి మారిన సింధులోని మొట్టమొదటి తెగలలో సూమ్రో తెగ ఒకరు. తరువాత వారు మన్సురాలో ధనవంతులు అయ్యారు. [4] వారు స్థానిక సింధులు అయినప్పటికీ సింధీలు వారి మూలాలను అరబ్బులుగా పేర్కొన్నారు.[8] ఉమయ్యదు పాలనలో స్థానిక సింధులతో వివాహం చేసుకోవాలని ప్రోత్సహించిన కారణంగా మిశ్రమ మూలాలు కలిగిన అరబ్బు అధికారుల పాలకవర్గం వారి మూలాలు అరబ్బు అని పేర్కొన్నారు.[1] వాస్తవానికి వారి పేరు ఇరాకులోని సమర్రా నగరం నుండి ఉద్భవించింది.[9] వారు కొన్నిసార్లు రాజ్పుతు సంతతికి చెందినవారని పేర్కొంటారు.[9][2] అయినప్పటికీ ఆ వాదనను ధృవీకరించే ఖచ్చితమైన ఆధారాలు లేవు.[10] ఇస్లాం మతంలోకి మారినప్పటికీ వారు అనేక హిందూ ఆచారాలను, సంప్రదాయాలను కొనసాగించారు.[1]

రెండవ సూమ్రా సుల్తాను పాలనలో సూమ్రా రాజ్యం ముల్తాను, ఉచు వరకు ఉత్తరం వైపు విస్తరించబడింది.[1] 11 వ శతాబ్దం ప్రారంభంలో, ఫాతిమిదు కాలిఫేటు నుండి వచ్చిన ఇస్మాయిలీ మిషనరీ ఇస్మాయిలిజాన్ని వ్యాప్తి చేయడానికి సింధు సందర్శించారు. దీని ఫలితంగా సింధు, ముల్తాను, ఉచు ఇస్మాయిలీ షియా మత కేంద్రాలుగా మారాయి.[8] అదే సమయంలో పర్షియా, మధ్య ఆసియా నుండి పెద్ద సంఖ్యలో సున్నీ సూఫీ మిషనరీలు సింధులోకి ప్రవేశించారు. చివరికి పెద్ద సంఖ్యలో సింధీలు ఇస్లాం మతంలోకి మారడానికి దారితీస్తుంది.[8] షియా, సున్నీ సంప్రదాయాలు రెండూ సింధులో శాంతియుతంగా సహజీవనం చేశాయి. [1]

1000 ల చివరలో -1100 ల ప్రారంభంలో సంఘరు పాలనలో తరువాత ఆయన కుమారుడు రెండవ ఖాఫీఫు-ఎల్ పాలనలో సూమ్రా నియంత్రణ దక్షిణ భారతదేశంలోని గుజరాతు వరకు విస్తరించింది. కచు, కాతియవారు ప్రాంతాలకు విస్తరించింది.[1] అతని మరణం తరువాత సంఘరు భార్య హమూను తన కోసం సూమ్రా సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమె ప్రయత్నాలు సూమ్రా ప్రభువులచే త్వరగా నలిగిపోయాయి.[1]

1100 ల చివరలో ముహమ్మదు ఘోరి సింధు మీద దండెత్తి, పొరుగున ఉన్న సమ్మ రాజవంశం కచు మీద పోరాటాలకు దారితీసింది. [1] 1220 లలో ఖ్వారెజ్ముకు చెందిన జలాలుద్దీను మింగ్బర్ను సింధును కొల్లగొట్టాడు. కొంతకాలం సూమ్రా నౌకాశ్రయమైన డెబలును ఆక్రమించాడు.[1]

బాగ్దాద్ ముట్టడి (1258) వరకు సూమ్రోలు అబ్బాసిదు సామంతులుగా పరిపాలించారు. తరువాత వారు స్వతంత్రంగా పాలించడం ప్రారంభించారు.[9] 1330 లలో సింధు మీద సూమ్రో పాలన బలహీనపడింది. సింధు నది మార్గాన్ని మార్చడంతో సింధు ఆర్థిక వ్యవస్థకు భంగం కలిగింది.[11]

ఢిల్లీ సుల్తానేటు ఖల్జీ రాజవంశం రెండవ రాజు అలావుద్దీను ఖల్జీ చివరి సూమ్రా రాజును ఓడించినప్పుడు సింధు సూమ్రా రాజవంశం పాలన దాదాపు ముగిసింది.[12][13] వారు 1400 ల మధ్యకాలం వరకు ఉమెర్కోట చుట్టూ ఉన్న థారు ఎడారిలో భూభాగాలను పాలించడం కొనసాగించారు.[1]

పాలకుల జాబితా[మార్చు]

సూమ్రో చరిత్రకారులు వారి మొదటి సుల్తానును ఖఫీఫు అని భావిస్తున్నప్పటికీ ఆయన చివరి హబ్బరి సుల్తాను అయి ఉండవచ్చు. ఏకాభిప్రాయం కిందివాటిని సూమ్రో పాలకులుగా జాబితా చేస్తుంది:[1]

 1. సర్దారు సూమరు; 1025-1030
 2. ఇడోను సూమరు రాజ్పాలు, డోడో-ఎల్ అని కూడా పిలుస్తారు; 1030-1054
 3. మన్సురా చివరి హబ్బరి పాలకుడు ఖాఫీఫు కుమారుడు మొదటి భూంగరు-ఎల్; 1054-1068
 4. రెండవ డోడో; 1068-1089
 1. సంఘరు; 1089-1107. రాజప్రతినిధిగా వ్యవహరించిన తన సోదరి తారి సంరక్షణలో మొదటి మూడేళ్లు
 2. రెండవ ఖాడోఫు, (రెండవ డోడో కుమారుడు); 1107-1142
 3. మొదటి ఉమరు; 1142-1181
 4. మూడవ డోడో; 1181-1195
 5. రెండవ భూంగరు; 1195-1226
 6. గంహ్వరు; 1226-1242
 7. ముహమ్మదు తూరు; 1242-1251
 8. అమ్రా సూమ్రో; 1251-1256


అబ్బాసిడ్ పాలన రద్దు తరువాత:

 1. రెండవ గంహ్వరు; 1256-1259
 2. నాలుగవ డోడో; 1259-1273
 3. తాయి; 1273-1296
 4. చనేసరు; 1296-1300
 5. మూడవ భూంగరు; 1301-1315
 6. మూడవ ఖఫీఫు; 1315-1333
 7. ఐదవ డోడో; 1333-1351


సింధులో సూమ్రా పాలన పతనం తరువాత, ఉమర్కోటకు పారిపోయిన పాలకులు

 1. హమీరు సూమ్రో; 1351-1355
 2. ఉమరు; 1355-1390
 3. ఐదవ భూంగారు; 1390-1400
 4. రెండవ హమీరు; 1400-1444

ప్రముఖులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 1.13 Siddiqui, Habibullah. "The Soomras of Sindh: their origin, main characteristics and rule – an overview (general survey) (1025 – 1351 AD)" (PDF). Literary Conference on Soomra Period in Sindh.
 2. 2.0 2.1 International Journal of Dravidian Linguistics (ఆంగ్లం లో). Department of Linguistics, University of Kerala. 2007.
 3. The Herald (ఆంగ్లం లో). Pakistan Herald Publications. 1992.
 4. 4.0 4.1 4.2 4.3 Stanton, Andrea L. (2012). Cultural Sociology of the Middle East, Asia, and Africa: An Encyclopedia (ఆంగ్లం లో). SAGE. ISBN 978-1-4129-8176-7.
 5. DADUZEN, Dayal N. Harjani aka (19 జులై 2018). Sindhi Roots & Rituals - Part 1 (ఆంగ్లం లో). Notion Press. ISBN 978-1-64249-289-7.
 6. 6.0 6.1 Varyāh, ʻAbdullāh (1983). Souvenir, Mansura Seminar: 12th Rabi-us-Sani, 1403 A.H./27th January, 1983 A.D. (ఆంగ్లం లో). Sanghar Historical and Cultural Society.
 7. The Archeology: An Organ of the Friends of Cultural and Archeeological [i.e. Archaeological] Heritage of Pakistan (ఆంగ్లం లో). International Press & Publications Bureau. 1993.
 8. 8.0 8.1 8.2 Dani, Ahmad Hasan (2007). History of Pakistan: Pakistan through ages (ఆంగ్లం లో). Sang-e Meel Publications. ISBN 978-969-35-2020-0.
 9. 9.0 9.1 9.2 DADUZEN, Dayal N. Harjani aka (19 జులై 2018). Sindhi Roots & Rituals - Part 1 (ఆంగ్లం లో). Notion Press. ISBN 978-1-64249-289-7.
 10. Dani, Ahmad Hasan (2007). History of Pakistan: Pakistan through ages (ఆంగ్లం లో). Sang-e Meel Publications. ISBN 978-969-35-2020-0.
 11. Meadows, Azra; Meadows, P. S. (1999). The Indus River: Biodiversity, Resources, Humankind (ఆంగ్లం లో). Oxford University Press. ISBN 978-0-19-577905-9.
 12. "Pakistan: The lesser-known histories of an ancient land". Cite web requires |website= (help)
 13. "A tale of two legends: Padmavat and Dodo-Chanesar". Cite web requires |website= (help)