సూర్యదేవర అన్నపూర్ణమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూర్యదేవర అన్నపూర్ణమ్మ (1903 - 1985) గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో చారిత్రక ప్రసిద్ధి గాంచిన చేబ్రోలు గ్రామములో వాసిరెడ్డి నాగయ్యకు జన్మించింది. సూర్యదేవర వెంకటప్పయ్య భార్య. ప్రముఖ స్వాతంత్ర్య యోధురాలు. 1930లో ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్ట్ చేయబడింది. సహాయ నిరాకరణోద్యములో పాల్గొని సంవత్సరము బాటు వెల్లూరు, కన్ననూరు కారాగారములల్లో బంధించబడింది. 1940 - 1942 మధ్య ఉధృతముగా బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా పలు అందోళనలు చేసింది. 1947-48 లో హైదరాబాదు రాష్ట్రము భారతదేశములో విలీనానికై అందోళన సాగించి మధిర జైలులో నిర్బంధించబడింది. కృష్ణా జిల్లా వీరులపాడులో ఆడపిల్లల కోసం పాఠశాల పెట్టింది. కొంత కాలం కృష్ణా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది.

మూలాలు[మార్చు]

  • అన్నపూర్ణమ్మ, సూర్యదేవర, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, 2005, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 12-3.