సెయింట్‌ పీటర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Pope-peter pprubens.jpg

మూస:Infobox Christian leader

సెయింట్‌ పీటర్‌. యేసు శిష్యుడు. ‘‘చర్చి వ్యవస్థకు పునాది రాయి’’అని జీసస్‌ అభివర్ణించిన వ్యక్తి. క్రీ.శ. 65 సంవత్సరంలో అప్పటి రోమన్‌ చక్రవర్తి నీరో ఆస్థాన ఇంద్రజాలికుడిని ఓడించినందుకు పీటర్‌కు శిలువ మీద మరణించడమనే శిక్ష విధించారు. యేసు అంతటి మహానుభావుడిని శిక్షించిన పద్ధతిలో గాక తనను తల క్రిందులుగా శిలువ వేయవలసిందని అడిగి అలాంటి శిక్షను అనుభవించిన మహా వ్యక్తి ఆయన. రోములోని సెయింట్‌ పీటర్‌ చర్చిలో పూజా వేదిక (ఆల్టర్‌) దిగువన పీటర్‌ శరీర శల్యాలు ఉన్నాయని 1950లో ప్రకటించారు. 1968లో అప్పటి పోప్‌ అవి సెయింట్‌ పీటర్‌ శరీర శిధిలాలేనని నిర్థారణ చేశారు. పీటర్‌ మొదట జాలరివాడు. తరువాత యేసు శిష్యుడైనాడు. యేసు శిష్యులందరిలోకి ఘన చరిత్ర కలిగినవాడు. రోము మొదటి బిషప్‌ ఆయనే.