సైన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఫౌండేషన్
సంకేతాక్షరం | SIF |
---|---|
ఆశయం | అంతర్దృష్టులు, ప్రేరణలు |
Established | 1977[1] |
వ్యవస్థాపకులు | క్రిస్ బట్లర్ |
కేంద్రీకరణ | విద్యా, దాతృత్వ, ఆధ్యాత్మికత |
సైన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఫౌండేషన్ (SIF) అనేది యునైటెడ్ స్టేట్స్‌లోని హవాయిలో ఉన్న ఒక హిందూ వైష్ణవ యోగా సంస్థ, దీనిని క్రిస్ బట్లర్ (అతని వైష్ణవ పేరు సిద్ధస్వరూపానంద గోస్వామి అని కూడా పిలుస్తారు) 1977లో స్థాపించారు.[2]
ప్రారంభ చరిత్ర
[మార్చు]1969లో హైకూ మెడిటేషన్ సెంటర్‌ను స్థాపించిన తర్వాత బట్లర్ అనుచరులను సంపాదించుకున్నాడు. అతను 1970లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్)లో చేరాడు, అయితే ఇస్కాన్ వ్యవస్థాపకుడు A. C. భక్తివేదాంత స్వామి ప్రభుపాద మరణం తర్వాత, బట్లర్ ఇస్కాన్ నుండి విడిపోయి SIFని స్థాపించాడు.[3]
SIFని మొదట్లో హరి నామ లేదా హోలీ నేమ్ సొసైటీ అని పిలిచేవారు. 1977లో, బట్లర్ ఈ బృందానికి ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది భక్తులు ఉన్నట్లు అంచనా వేశారు.
వేదాంతశాస్త్రం
[మార్చు]ఈ సంస్థ యోగా బోధనను, కృష్ణైట్ వైష్ణవ హిందూధర్మంలోని ఇతర అంశాలను మిళితం చేస్తుంది. హిందూధర్మంలో స్థిరపడినప్పటికీ, భక్తి యోగా SIF తత్వశాస్త్రం "క్రైస్తవ మతంతో, ఇస్లాం మతంతో, ఏ నిష్కపటమైన మత వ్యవస్థతో విభేదించదని బట్లర్ నొక్కిచెప్పారు. ఇది హిందూ సంస్థ అని ఎవరూ అనకుండా భక్తి యోగా సారాంశాన్ని బోధించడానికి మేము ప్రయత్నిస్తున్నాము అని చెప్పాడు.[2][4]
ఈ సంస్థ సభ్యులు తప్పనిసరిగా శాఖాహారాన్ని ఆచరించాలి. మద్యం, ధూమపానం, అక్రమ సంభోగం లేదా జూదం ఆడకూడదు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]తులసి గబ్బార్డ్ — యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ (ప్రత్యేకంగా US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో మొదటి హిందూ సభ్యులు, క్రిస్ బట్లర్ ప్రత్యక్ష శిష్యురాలు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Science of Identity Foundation business information on the website of Hawaii State Department of Commerce & Consumer Affairs". Hawaii State Department of Commerce & Consumer Affairs, Business Registration Division. Retrieved 2019-10-22.
- ↑ 2.0 2.1 Reflections on Hindu Demographics in America: An Initial Report on the First American Hindu Census. Archived 2019-10-20 at the Wayback Machine en:J. Gordon Melton & Constance A. Jones. A paper presented at the Association for the Study of Religion, Economics & Culture meeting in Washington, D.C., April 7–10, 2011. p. 14.
- ↑ Wright, Walter (August 22, 1977). "Hawaii's 'other' Krishnas". Honolulu Star-Advertiser. p. A-1. Retrieved November 1, 2019.
- ↑ "Science of Identity one of founders". en:Honolulu Star-Advertiser. July 1, 1991. p. A-4. Retrieved November 1, 2019.
- ↑ What Does Tulsi Gabbard Believe?, Kelefa Sanneh, The New Yorker, Oktober 30, 2017.
- ↑ Tulsi Gabbard Had a Very Strange Childhood, Kerry Howley, New York Intelligencer, Juni 11, 2019.