సైరస్ పూనావాలా
స్వరూపం
సైరస్ ఎస్.పూనావాలా | |
---|---|
జననం | 1941 | (age 83)
జాతీయత | భారతదేశం |
విద్య | బ్రియాన్ మహారాష్ట్ర కాలేజీ అఫ్ కామర్స్ |
వృత్తి | వ్యాపారవేత్త |
క్రియాశీల సంవత్సరాలు | 1966 – ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు |
నికర విలువ | US$13.3 బిలియన్ (July 2021)[1] |
జీవిత భాగస్వామి | విళ్లూ పూనావాలా (died 2010) |
పిల్లలు | ఆదార్ పూనావాలా |
పురస్కారాలు | పద్మశ్రీ (2005), పద్మభూషణ్ (2022) |
సైరస్ పూనావాలా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) చైర్మన్. ఆయనకు 2022లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.[2]
జననం, వృత్తి జీవితం
[మార్చు]సైరస్ పూనావాలా 1941లో మహారాష్ట్ర రాష్ట్రం, పుణెలో జన్మించాడు. ఆయన పదో తరగతి వరకు బిషప్ స్కూల్లో పూర్తి చేసి, యూనివర్సిటీ ఆఫ్ పుణె నుంచి డిగ్రీ పుట్టా అందుకున్నాడు. ఆయన విద్యాభాస్యం పూర్తి కాగానే కుటుంబ వ్యాపారమైన గుర్రాల పెంపకంలో పాలు పంచుకున్నాడు. సైరస్ పూనావాలాకు ఈ వ్యాపకాన్ని ఓ వ్యాపారంగా కొనసాగించడం ఇష్టం లేక స్నేహితులతో కలిసి కార్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించి, హై ఎండ్ కార్ల తయారీపై ప్రయోగాలు చేసి ప్రోటోటైప్ స్పోర్ట్స్ కార్ మోడల్ ను తయారు చేశారు, కానీ అది సఫలీకృతం కాలేదు. ఆయన 1966లో సీరమ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించి వ్యాక్సిన్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టాడు.[3]
అవార్డులు
[మార్చు]- వైద్య రంగానికి చేసిన కృషికి గాను 2005లో పద్మశ్రీ పురస్కారం [4]
- కోవిడ్ వ్యాక్సిన్‌ల ఉత్పత్తిలో చేసిన కృషికి గాను 2022లో పద్మభూషణ్ పురస్కారం[5]
- 2018లో యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్ గౌరవ డాక్టరేట్ ప్రధానం
- 2019లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం[6]
- 2021లో లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు[7]
మూలాలు
[మార్చు]- ↑ "Forbes profile: Cyrus Poonawalla". Forbes. Retrieved 28 June 2021.
- ↑ India com (25 January 2022). "Will Continue to Work For Health Sector: Poonawalla After Being Awarded Padma Bhushan" (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ Namasthe Telangana (22 May 2021). "గుర్రాల పెంపకం నుంచి వ్యాక్సిన్ల తయారీ వరకు.. ఇదీ 'సీరమ్' పూనావాలా ప్రస్థానం". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ "Padma Awards Directory (1954–2009)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 10 May 2013.
- ↑ "Dr. Cyrus Poonawalla to be conferred with Padma Bhushan". Hindu Business Line (in ఇంగ్లీష్). 25 January 2022. Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ University of Oxford (2021). "Honorary degree recipients for 2019 announced | University of Oxford" (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-26. Retrieved 26 January 2022.
- ↑ The Indian Express (31 July 2021). "SII chairman Cyrus Poonawalla named recipient of Lokmanya Tilak National Award" (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.