Jump to content

సోల

వికీపీడియా నుండి
భారతదేశంలోని అల్మోరా నుండి ఒక ప్రామాణిక కొలమానం - సోల

సోల (ఆంగ్లం: Sola) ఒక విధమైన ప్రాచీనమైన కొలమానము. రెండు సోలలు ఒక తవ్వ[1]. పూర్వం ఉన్న కొలతలు ఇప్పుడు ఎక్కువగా అమలులో లేవు కానీ గ్రామీణ ప్రాంతాలో ఇప్పటికీ అప్పటి కొలతలను అనుసరిస్తున్నారు. ధాన్యం, ఇతర వ్యవసాయ, పాడి ఉత్పత్తులను ఈ కొలతలను ఉపయోగించే క్రయ విక్రయాలు చేసేవారు. [2]

పద ప్రయోగాలు

[మార్చు]

తెలుగు భాషలో సోల పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[3] సోల [ sōla ] sōla. [Tel.] n. A certain dry measure, equal to a seer. పదునారు డబ్బుల యెత్తు వస్తువు పట్టే కొలది, శాస్త్రకారుడు చెప్పినది తొమ్మన్నూరు గింజలు పట్టేది. సోల వెలితిగా sōla-veliti-gā. adv. Scornfully, contemptuously. కొంచెము తక్కువగా. "ఏలయీ బహురూపులేవైన మున్ను సోల వెలితిగ నిన్ను జూచితినయ్య." BD. iv. 1028. "ఈ చందమిట్లుతాల్పక యాచందంబున నెయున్న యప్పుడునిన్నున్ జూచితినెపోలవెలితిగ నీ చుక్కల దగిలికొనగనేటికి నాకున్." BP. vi. 238. సోలెడు sōl-eḍu. adj. A small pailful. అరతవ్వెడు.

ప్రమాణాల మార్పు

[మార్చు]
  • రెండు అర సోల =1 సోల,
  • రెండు సోలలు =1 తవ్వ (సేరు)
  • రెండు తవ్వలు= 1 మానిక
  • రెండు మానికలు =1 అడ్డెడు
  • 2 అడ్డలు = 1 కుంచం
  • 2 కుంచాలు = 1 ఇరస
  • 2 ఇరసలు = తూము
  • 2 తూములు = 8 కుంచాలు = ఒక గిద్దె /ఇద్దు / బస్తా
  • 20 తూములు = 1 పుట్టి

మూలాలు

[మార్చు]
  1. "ప్రాచీన తెలుగు కొలమానం – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-09-09. Retrieved 2020-07-07.
  2. "అలనాటి కొలతలు, ద్రవ్యం | జాతర | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-07-07.
  3. బ్రౌన్ నిఘంటువు ప్రకారం సోల పదప్రయోగాలు.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=సోల&oldid=4118577" నుండి వెలికితీశారు