సౌభ్రాతృత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సౌభ్రాతృత్వం : (ఆంగ్లం : fraternity (లాటిన్ భాష frater : "సోదరుడు") అనునది సోదరత్వం. సాధారణంగా ఈ పదము సమాజంలో గల విభిన్న మతాలకు, వర్గాలకు, భాషలకు, సంస్కృతులకు అతీతంగా మానవుల మధ్య గల ప్రేమ, గౌరవాల భావనలనే "సౌభ్రాతృత్వం" అని నిర్వచిస్తారు. ఇంకనూ ముందుకు సాగి, సర్వమానవ ప్రేమ, మానవకళ్యాణం, విశ్వమానవ సమానత్వం, వసుదైక కుటుంబ భావనలు మున్నగు ఉన్నత భావనలు, సద్-నీతి, ప్రకృతినియమాలు, విశ్వజనీయ మానవసూత్రాలు, సమ్మిళిత సామాజిక స్పృహలు, మూలవస్తువులు కలిగిన ఓ విశాల దృక్పథమే ఈ సౌభ్రాతృత్వం.

ఈ సౌభ్రాతృత్వాన్ని అనేక రంగాలలో ఉపయోగించ వచ్చును, ఉదాహరణకు విద్య, వృత్తి నైపుణ్యాలు, నీతి, జాతి, మతాలు, రాజకీయాలు, దానధర్మాలు, వ్యక్తిగత ఆదర్శాలు, సేవారంగం, కళలు, కుటుంబ అధికారాలు మున్నగునవి. ఈ సౌభ్రాతృత్వము వలన పరస్పర అవగాహన, సహకారం, జనజీవన స్రవంతి, మొదలగునవి స్థాపించవచ్చును.

ఈ సౌభ్రాతృత్వము వలన "జ్ఞాన మార్గములో జీవనము" అనే క్రొత్త ఒరవడిని సృష్టించ వచ్చును. ఈ సౌభ్రాతృత్వానికి ప్రపంచంలో ఏ విషయాన్నైనా జయించ గలిగే శక్తి ఉంది. [1]

ఉద్ద్యేశాలు

[మార్చు]

ఈ సౌభ్రాతృత్వం, ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలుగాని, సూత్రాల ద్వారా గాని సిద్ధాంతీకరించబడినది కాదు. ఈ సౌభ్రాతృత్వం అవకాశవాదీ కాదు. ఇదో ఉన్నత భావన. వ్యక్తీకరించడానికి సాధ్యం కానిది. మనస్సు నుండి జనించే ఓ విశాల దృక్ఫథం. దీనిని ఇటు భౌతికంగానూ, అటు ఆధ్యాత్మికంగానూ చూడవచ్చు, కొలవనూ వచ్చు. ఈ దృక్ఫథం వలన మానవునికి అనేక రంగాలలో ప్రవేశించగలిగే ఓ నైతికత ఏర్పడుతుంది.

మూలాలు

[మార్చు]
  1. Jacob, Margaret C. (1991). Living the Enlightenment: Freemasonry and Politics in Eighteenth-Century Europe. New York, New York: Oxford University Press.