Jump to content

స్టీఫెన్ కింగ్

వికీపీడియా నుండి
స్టీఫెన్ కింగ్
2007లో స్టీఫెన్ కింగ్
పుట్టిన తేదీ, స్థలంస్టీఫెన్ ఎడ్విన్ కింగ్
(1947-09-21) 1947 సెప్టెంబరు 21 (వయసు 77)
పోర్ట్ ల్యాండ్, మైన్, యు.ఎస్.
కలం పేరు
  • రిచర్డ్ బాచ్‌మన్
  • జాన్ స్విటెన్
  • బెరిల్ ఎవాన్స్
వృత్తిరచయిత
పూర్వవిద్యార్థియూనివర్సిటీ ఆఫ్ మైనే (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్)
కాలం1967–ప్రస్తుతం
రచనా రంగం
  • హారర్ ఫిక్షన్
  • ఫాంటసీ ఫిక్షన్
  • అతీంద్రియ కల్పన
  • డ్రామా ఫిక్షన్ (నాటకం)
  • గోతిక్ ఫిక్షన్
  • జానర్ ఫిక్షన్
  • డార్క్ ఫాంటసీ
  • అపోకలిప్టిక్ అనంతర కల్పన
  • క్రైమ్ ఫిక్షన్
  • సస్పెన్స్ ఫిక్షన్
  • థ్రిల్లర్ ఫిక్షన్
జీవిత భాగస్వామి
సంతానం3, జో హిల్ (రచయిత), ఓవెన్ కింగ్ లతో సహా

సంతకం

స్టీఫెన్ ఎడ్విన్ కింగ్ (జననం 1947 సెప్టెంబరు 21) అమెరికన్ రచయిత. ఆయన ప్రధానంగా హారర్, అతీంద్రియ కల్పన (supernatural fiction), సస్పెన్స్, క్రైమ్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ నవలలతో ప్రసిద్ధిచెందాడు. దీంతో ఆయనను "కింగ్ ఆఫ్ హారర్"గా పాఠకులు పిలుచుకుంటారు,[1] ఆయన పుస్తకాలు 2006 నాటికి 350 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి.[2] అంతేకాకుండా, వీటిలో చాలా వరకు చలనచిత్రాలు, టెలివిజన్ ధారావాహికలు, చిన్న సిరీస్‌లు, కామిక్ పుస్తకాలుగా మార్చబడ్డాయి. ఆయన కింగ్ రిచర్డ్ బాచ్‌మన్ అనే కలం పేరుతో ఏడు, అలాగే ఐదు నాన్ ఫిక్షన్ పుస్తకాలతో సహా 65కి పైగా నవలలు ప్రచురించాడు.[3] ఆయన దాదాపు 200 చిన్న కథలు కూడా రాశాడు, వాటిలో ఎక్కువ భాగం పుస్తక సేకరణలలో ప్రచురించబడ్డాయి.[4][5]

బ్రామ్ స్టోకర్ అవార్డులు, వరల్డ్ ఫాంటసీ అవార్డులు, బ్రిటిష్ ఫాంటసీ సొసైటీ అవార్డులతో పాటు పలు పురస్కారాలను ఆయన అందుకున్నాడు. 2003లో, నేషనల్ బుక్ ఫౌండేషన్ అతనికి అమెరికన్ లెటర్స్‌కు విశిష్ట సహకారం అందించినందుకు మెడల్‌ను ప్రదానం చేసింది.[6] 2004 వరల్డ్ ఫాంటసీ అవార్డ్ ఫర్ లైఫ్ అచీవ్‌మెంట్, మిస్టరీ రైటర్స్ ఆఫ్ అమెరికా నుండి 2007 గ్రాండ్ మాస్టర్ అవార్డ్ వంటివి ఆయన సాహిత్యానికి చేసిన కృషికి అందుకున్నాడు.[7] 2015లో, ఆయన సాహిత్యానికి చేసిన కృషికి అమెరికా నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్ నుండి నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్‌ను కూడా అందుకున్నాడు.[8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన 1971 జనవరి 2న తబితా స్ప్రూస్‌ను వివాహం చేసుకున్నాడు.[9] ఆమె కూడా నవలా రచయిత. వారి నివాసాల్లో ఒకటైన బాంగోర్‌లోని కింగ్స్ హోమ్ పర్యాటక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రచయతలకు కేంద్రమైన ఇక్కడ వారి ఆర్కైవ్‌లు అందుబాటులో ఉంచారు.[10][11]

వీరికి ముగ్గురు పిల్లలు, ఒక కుమార్తె కాగా ఇద్దరు కుమారులు.[12] వారి కుమార్తె నయోమి ఫ్లోరిడాలోని ప్లాంటేషన్‌లో యూనిటేరియన్ యూనివర్సలిస్ట్ చర్చి మంత్రిగా, ఆమె భాగస్వామి తండెకాతో కలిసి పని చేస్తోంది.[13] ఇక కుమారులు ఇద్దరూ రచయితలు: ఓవెన్ కింగ్ తన మొదటి కథల సంకలనాన్ని 2005లో ప్రచురించాడు, అలాగే అదే సంవత్సరం జో హిల్‌గా వ్రాసే జోసెఫ్ హిల్‌స్ట్రోమ్ కింగ్ 20వ శతాబ్దపు గోస్ట్స్‌లో మొదటి చిన్న కథల సంకలనం ప్రచురించాడు.[14]

తను రచయిత అవడానికి ఏదీ చేతకాకపోవడమే కారణం అని చెప్పే స్టీఫెన్ కింగ్ రోజూ కనీసం నాలుగు నుంచి ఆరు గంటలు చదవడం, రాయడం చేస్తాడుట. అలాగే సుమారు రెండు వేల పదాలైనా రాయకుండా నిద్రపోకూడదనేది ఆయన నియమం.[15]

మూలాలు

[మార్చు]
  1. K.S.C. (September 7, 2017). "Why Stephen King's novels still resonate". The Economist. Archived from the original on September 9, 2017. Retrieved September 9, 2017.
  2. Morgan, Robert (November 22, 2006). "Stephen King". Newsnight. BBC. Archived from the original on September 18, 2019. Retrieved November 7, 2010.
  3. Breznican, Anthony (September 3, 2019)."Life Is Imitating Stephen King's Art, and That Scares Him" Archived సెప్టెంబరు 3, 2019 at the Wayback Machine. New York Times. Retrieved September 3, 2019.
  4. Barone, Matt (November 8, 2011). "The 25 Best Stephen King Stories" Archived ఫిబ్రవరి 7, 2019 at the Wayback Machine. Complex. Retrieved February 5, 2019.
  5. Jackson, Dan (February 18, 2016). "A Beginner's Guide to Stephen King Books" Archived ఫిబ్రవరి 7, 2019 at the Wayback Machine. Thrillist. Retrieved February 5, 2019.
  6. "Distinguished Contribution to American Letters". National Book Foundation. 2003. Archived from the original on March 10, 2011. Retrieved March 11, 2011.
  7. "FORUMS du CLUB STEPHEN KING (CSK)". Forum Stephen King. Archived from the original on February 22, 2012. Retrieved March 8, 2012.
  8. "President Obama to Award 2014 National Medals of Arts". NEA. National Endowment for the Arts. September 3, 2015. Archived from the original on September 15, 2015. Retrieved September 12, 2015.
  9. King, Stephen. "Stephen King on Twitter: "A couple of kids got married 48 years ago today. So far it's worked out pretty well. Still in love."". Twitter. Archived from the original on January 2, 2019. Retrieved January 6, 2019.
  10. "Stephen King is turning his Maine home into a museum and writer's retreat". Telegram.com. October 17, 2019. Archived from the original on December 20, 2019. Retrieved October 19, 2019.
  11. Ehrlich, Brenna (October 17, 2019). "Stephen King's House to Become Archive and Writers' Retreat". Rolling Stone. Archived from the original on December 20, 2019. Retrieved December 29, 2021.
  12. King, Tabitha; DeFilippo, Marsha. "Biography". StephenKing.com. Archived from the original on May 9, 2008. Retrieved December 8, 2013.
  13. "River of Grass Ministry". Archived from the original on May 2, 2010. Retrieved April 5, 2009.
  14. "Jordan will build 'Box' for Warners". Hollywood Reporter. Archived from the original on September 30, 2007.
  15. "స్టీఫెన్‌ కింగ్‌ | Great Writer, American Novelist Stephen King - Sakshi". web.archive.org. 2023-09-21. Archived from the original on 2023-09-21. Retrieved 2023-09-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)